భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 వార్డులైన మహబూబ్పల్లి, కుందూరుపల్లి, పుల్లూరి రామయ్యపల్లి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు.సీపీఐ, సీపీఐ(యం) పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్పం కిషన్, పుల్లూరి మంజూల–మాధవరావు గెలుపు లక్ష్యంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం సాగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు,ముఖ్య నాయకులు, ఆయా వార్డుల ఎన్నికల ఇన్చార్జీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పుల్లూరి రామయ్యపల్లి హనుమాన్ టెంపుల్ సెంటర్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడారు. ప్రజా సంక్షేమం, మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొంటూ, అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.