ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు- ఎర్రబెల్లి దయాకర్ రావు
బక్రీద్ త్యాగానికి ప్రతీక-మాజీ మంత్రి ఎర్రబెల్లి
•కేసీఆర్ హయాంలో మైనారిటీలకు సముచిత గౌరవం-ఎంపీ రవిచంద్ర
•అల్లాహ్ అనుగ్రహంతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలి- ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా:బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండలంలో ఒక ప్రకటన విడుదల చేశారు.ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.బక్రీద్ త్యాగానికి,భక్తి విశ్వాసాలకు ప్రతీక అని పేర్కొన్నారు.మహ్మద్ ప్రవక్త బోధించిన మానవత్వం,ప్రేమ, శాంతి,సమానత్వం,క్షమాగుణాలు ఎప్పటికీ ఆచరణీయమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో గౌరవించారని,మహమూద్ అలీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖ కేటాయించి గౌరవించారని తెలిపారు. కేసీఆర్ పాలనలో మైనారిటీల సంక్షేమానికి షాదీ ముబారక్ కింద 1,00,116 సాయం, ప్రత్యేక గురుకులాలు, ఇమాం-మౌజన్లకు 5,000 గౌరవ వేతనం, చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల సాయం అందించారని వివరించారు. అనీస్-ఉల్-గుర్భా ఆధునీకరణకు నిధులు,రంజాన్లో అధికారిక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.గంగా-జమున తహజీబ్ సంస్కృతి వెల్లివిరిసేలా కేసీఆర్ పాలన సాగిందని, శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయని అన్నారు.పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జరుపుకోవాలని,అల్లాహ్ అనుగ్రహంతో అందరి జీవితాలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు. తెలంగాణతో పాటు దేశ,విదేశాల్లో ఉన్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.