
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య
ఈ69 న్యూస్ హనుమకొండ, మార్చి 20
పవిత్ర “ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)” పర్వదినం సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ మాసం ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు, సహనం, దాతృత్వం వంటి గొప్ప విలువలను పెంపొందించే పవిత్ర కాలమని ఆమె పేర్కొన్నారు. ఈ నెలలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్షలు ఆచరించడం గొప్ప సంప్రదాయమని అన్నారు.ఈ ఉపవాసాలు వ్యక్తిగత ఆత్మవికాసంతో పాటు సమాజంలో సమానత్వం, పరస్పర గౌరవం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ప్రేమ, దయ, సహనం, సోదరభావం వంటి మానవతా విలువలను ఆచరించడం రంజాన్ పండుగ ప్రధాన సందేశమని తెలిపారు.తెలంగాణలో గంగా-జమునా తహజీబ్‌కు రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్న ఆమె, ఈ పర్వదినం సమాజంలో ఐక్యత, సఖ్యతను మరింత బలపరచాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సుఖసంతోషాలు నిండాలని కోరుకున్నారు.