పాలకుర్తి ఫిబ్రవరి 16జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం లో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రతినిధులు తెలంగాణ పిసిసి రేవంత్ రెడ్డి కి కమ్యూనిటీకి సంబంధించిన లీఫ్లేట్స్,ప్రవక్త ముహమ్మద్ జీవిత చరిత్ర గ్రంధాన్ని బహూకరించారు.బుధవారం హాత్‌సే హాత్ జోడు పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం లో పర్యటన జరిగింది.ఈ సందర్భంగా అహ్మదీయ ముస్లిం ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మౌల్వీ షబ్బీర్ అహ్మద్,ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మౌల్వీ అక్బర్,మౌల్వీ రహీముద్దీన్,మౌల్వీ ఖలీల్ లు రేవంత్ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించి కమ్యూనిటీ గురించి పరిచయం చేశారు.రేవంత్ రెడ్డి అహ్మదీయ ముస్లిం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.