రైతు వేదికలో సీఎం కార్యక్రమాన్ని వీక్షించిన రైతులు, అధికారులు
ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్వహించిన రైతు ఉత్సవాలు, రైతు భరోసా నిధుల విడుదల, నర్మెట్టలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రేగొండ రైతు వేదికలో రైతులు, అధికారులు కలిసి దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా వీక్షించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ జి. కిష్టయ్య, రేగొండ సర్పంచ్ వారణాసి మౌనిక, వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవ రెడ్డి,వ్యవసాయ విస్తరణ అధికారులు భరత్, గోవర్ధన్, నాగరాజు, ప్రవీణ్, ఉద్యాన శాఖ విస్తరణ అధికారి రామాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులు రైతులకు వివరణ ఇచ్చారు. ముఖ్యంగా రైతు భరోసా నిధుల విడుదలతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. అలాగే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభంతో రైతులకు మార్కెట్ అవకాశాలు విస్తరించి, ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులు ఆసక్తిగా పాల్గొని ప్రభుత్వ పథకాలపై అవగాహన పొందారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపయోగకరంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.