రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ,ఏసీపీ
వరంగల్ జిల్లా:పర్వతగిరి మోడల్ స్కూల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని డీసీపీ ఈస్ట్ జోన్,మామునూరు ఏసీపీ సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు,సంభావ్య కారణాలను విశ్లేషించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన రోడ్డు భద్రతా చర్యలు,నివారణ చర్యలపై అవసరమైన పరిశీలనలు చేశారు.