రోడ్డు ప్రమాద మృతులకు ఎమ్మెల్యే నాగరాజు నివాళి
పర్వతగిరి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురి మృతదేహాలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎంజీఎం మార్చురీలో నివాళులర్పించారు.ఆదివారం పర్వతగిరి మోడల్ స్కూల్ సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన పర్వతగిరికి చెందిన బుద్ధె చరణ్, సోమారానికి చెందిన వడ్లకొండ ఎల్లగౌడ్, మహ్మద్ అహ్మద్ మృతదేహాల వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకుని మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, మాజీ జెడ్పీ సభ్యుడు సర్వర్, సర్పంచులు ఏర్పుల శ్రీనివాస్, జున్ను కనకయ్య,ఎస్టీ సెల్ అధ్యక్షుడు భాస్కర్,మహ్మద్ అలీ, డీలర్ బాబు, జంగిలి బాబు, జంగిలి భాస్కర్ పాల్గొన్నారు.