శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ గ్రామ ఉపసర్పంచ్ మేకల దేవేందర్, గ్రామ వార్డు మెంబర్లు గ్రామ ప్రముఖులు గ్రామ పెద్దలు ఆలయ అభివృద్ధి దాతలు తదితరులు పాల్గొన్నారు