సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో భూమి వారోత్సవాలు
సత్తుపల్లి మండల పరిధిలోని
గంగారం గ్రామంలో గల సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం భూమి వారోత్సవాల సందర్భంగా మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రాంగణంలో విస్తృతంగా మొక్కలు నాటారు.
కళాశాల కార్యదర్శి, ప్రతినిధి దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల నాటకం, ప్రాంగణ పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు, వ్యర్థాల నిర్వహణ, సుస్థిరత ప్రతిజ్ఞ, పచ్చదనం కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించడం, సుస్థిర జీవన విధానాలపై చైతన్యం కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు.
ఏప్రిల్ 22 నుంచి 29 వరకు భూమి వారం సందర్భంగా భారత్ సస్టైనబిలిటీ మిషన్–2026 కింద దేశవ్యాప్తంగా పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ విద్యాసంస్థల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
కళాశాల చైర్మన్, పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, ట్రస్టీ బండి అన్విద వర్చువల్గా పాల్గొని ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో సైన్స్, మానవీయ శాస్త్రాల విభాగాధిపతి డాక్టర్ షేక్ మీరాసాహెబ్, వివిధ ఇంజనీరింగ్ విభాగాధిపతులు, జాతీయ సేవా పథకం అధికారి బలుసుపాటి సీతారాములు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.