యశోద హాస్పిటల్ లో గొంతు క్యాన్సర్ కు రేడియేషన్ థెరపీతో అరుదైన చికిత్స
ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖమ్మం ప్రాంతం చెందిన 86 సంవత్సరాల వృద్ధురాలు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతూ గొంతు నొప్పితో బాధపడుతూ హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ ను సంప్రదించంగా అక్కడ వైద్య బృందం యం.ఆర్ ఎల్.ఐ.ఎన్.ఏ.సి రేడియేషన్ థెరపీలో సరికొత్తదైన పరికరం తో అరుదైన శాస్త్ర చికిత్స అందించామని తెలిపారు. ఆమె గొంతులో ఒక పెద్ద కణితి శ్వాస మార్గానికి అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు . ఆమెకు అత్యవసరంగా ట్రాకియోస్టమీ (శ్వాసనాళికను తెరవడం) చేశారు . తదుపరి పరీక్షలలో హైపోఫారింజియల్ క్యాన్సర్ స్వరపేటికకు (లారింక్సు) వ్యాపించి, అడ్డంకిని కలిగిస్తున్నట్లు తేలింది. అంతటి వృద్ధాప్యం మరియు బలహీనమైన ఆరోగ్య పరిస్థితిలో, ఉపశమన చికిత్స మాత్రమే చేయగలమని , నయం చేయడం కష్టమని భావించారు. సాధారణ పద్ధతిలో చికిత్స చేయడం సవాలుతో కూడుకున్నది. మొదట ఆమెను ఐసియులో స్థిరీకరించి, క్యాన్సర్‌ను నిర్ధారించడానికి (పి.ఈ.టి.సి.టి) స్కాన్ మరియు బయాప్సీతో నెమ్మదిగా పరీక్షించారు . ఆమె వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని , రేడియేషన్ థెరపీ ఒక్కటే మార్గం కావడంతో తరువాత దాని కొంచెం సైడ్ కి తరలించారు . ఆమెకు కొద్ది రోజుల్లోనే హైపోఫ్రాక్షనేటెడ్ రేడియోథెరపీతో చికిత్స అందించారు . ఆమె క్రమంగా తీవ్ర అనారోగ్యం నుండి కోలుకుని మళ్లీ నడవడం ప్రారంభించారు . చికిత్స పూర్తయిన 3 నెలల తర్వాత చేసిన ఫాల్ అప్‌లో ఆమె క్యాన్సర్ నుండి పూర్తిగా విముక్తి పొందారని అన్నారు . మెదడు కణితులు , ప్రోస్టేట్, ఊపిరితిత్తులు , కాలేయం క్యాన్సర్ల వంటి వాటికి 5 రోజుల్లో క్యాన్సర్ చికిత్స . ఆసుపత్రి సందర్శనలను తగ్గించడం మరియు రోగి ఒత్తిడిని తగ్గించడం . దుష్ప్రభావాలు లేవు అన్ని వయసుల వారికి సురక్షితం , 90 ఏళ్ల వయస్సు గల రోగులకు కూడా సురక్షితంగా చికిత్స చేయవచ్చు . యం.ఆర్ ఎల్.ఐ.ఎన్.ఎ.సి. తో ప్రపంచ క్యాన్సర్ సంరక్షణలో భారతదేశం ఒక పెద్ద ముందడుగు వేసింది . ఈ సాంకేతికత కచ్చితత్వం మరియు భద్రతను మెరుగుపరచడమే కాకుండా , ఒకప్పుడు నయం చేయడం అసాధ్యం అని భావించిన క్యాన్సర్లకు చికిత్స చేయడం ద్వారా రోగులకు ఆశను కూడా ఇస్తుంది,” అని డాక్టర్ ప్రదీప్ కరుమంచి అన్నారు . భారతదేశంలో యం.ఆర్ ఎల్.ఐ.ఎన్.ఎ.సి. కు మార్గదర్శకులుగా నిలవడం ఆంకాలజీలో ఒక గొప్ప ముందడుగును సూచిస్తుంది . ఈ కార్యక్రమంలో డాక్టర్ వినీత్ ఇలాపురం , శ్రీధర్ రావు , బాల కృష్ణ , నాగార్జున పాల్గొన్నారు .