


ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ మార్చి 30:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు సోమవారం ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి సుస్ట్రో స్పెషాలిటీ ఆయిల్స్ మరియు ఐరా గురుకుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహకారం అందించారు.ఈ సందర్భంగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు.జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. యువత అతివేగంగా వాహనాలు నడపవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు.కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సుస్ట్రో సంస్థ ప్రతినిధులు వాహనదారులకు నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎసిపి బీం శర్మ, ట్రైనీ ఐపీఎస్ మనీషా, సీఐ జి. వేణు, ఎస్సైలు విజయ్, కుమార్, రాజేష్, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.