
ఈ69 న్యూస్ హనుమకొండ, మార్చి 30
అహ్మదీయ ముస్లిం జమాత్ హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం ఆత్మకూరు మండలం హౌజ్ బుజుర్గ్ గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సెక్రటరీలు, ఆమ్లా సభ్యులు, సదరానే జమాత్ పాల్గొని జమాత్‌కు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు.జిల్లా స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అదే విధంగా మౌల్లిమీన్తో ప్రత్యేక సమావేశం జరిపి ధార్మిక విద్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలపై సూచనలు చేశారు.జమాత్ పురోగతికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.