యూనియన్ జిల్లా కార్యదర్శి బైరగోని అంజము లు డిమాండ్
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కు నెలనెలా వేతనాలు సక్రమంగా అందజేయాలి
సిఐటియు డిమాండ్
తెలుగు గళం న్యూస్ జనగామ మే11
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కు నెలనెలా వేదనల సక్రమంగా అందజేయాలని పెండింగ్లో ఉన్న ఏప్రిల్ నెల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జనగామ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బైరగోని అంజము లు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తున్న అంగన్వాడీ మరియు ఆయాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. చేసిన శ్రమకు నెల నెల వేతనాలు కూడా సక్రమంగా అందుకోలేని స్థితిలో అంగన్వాడీ టీచర్లు ఆయాలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐ సి డి ఎస్ ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రీ ప్రైమరీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అంగన్వాడీలనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలని పెండింగ్లో ఉన్న సెంటర్ ల అద్దెలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి టీచర్లకు కొత్తగా ఇచ్చిన సెల్ ఫోన్స్ పనిచేయడం లేదని వాటిని వెంటనే వెనక్కి తీసుకొని అన్ని యాప్స్ మరియు సౌకర్యాలతో 5జీ నెట్వర్క్ ఫోన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 180 చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర శిశు సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారం బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని ఐసిడిఎస్ కు సంబంధం లేని పనులు చేయించరాదని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కు 18 వేల వేతనం పెంచుతామని పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని వంటి అనేక హామీలు ఇచ్చిందన్నారు.ప్రభుత్వం అధికారాంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయినప్పటికీ ,ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా అదనపు పని భారాలను మోపుతూ అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ ను అనారోగ్యాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పి, బిక్షం, సహాయ కార్యదర్శి ఎర్రబెల్లి సంతోష,జిల్లా కమిటీ సభ్యులు టి సంతోష, జ్యోతి,సుమతి, శోభ,సుజాత,లక్ష్మీ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.