అంబేద్కర్ ఆలోచనలే రాజ్యాధికారానికి దిక్సూచి
Jangaonస్టేషన్ ఘనపూర్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని భారత రాష్ట్ర సమితి అనుబంధ విద్యార్థి విభాగం బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ బస్టాండ్ దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ తిరుమలనాధ దేవస్థానం చైర్మన్ కుంభం కుమార్ స్వామి, ముదిరాజ్ యూత్ రాష్ట్ర కార్యదర్శి గోరంట్ల యాదగిరి, బిఆర్ఎస్వీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలే రాజ్యాధికారానికి దిక్సూచి అని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల, దళితుల సంక్షేమం కోసం పోరాడిన మహనీయుడు అని అన్నారు. బలహీన వర్గాల, ప్రజల పక్షాన పోరాడిన భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన మహనీయుడు అని, సమ సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి కుల రహిత సమాజాన్ని నిర్మించాలని అన్నారు. ప్రభుత్వ ఫలాలు అందరికీ చెందాలని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరినీ సమానంగా చూడాలని ఆనాడు భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో నేటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని అన్నారు. అంబేద్కర్ గొప్ప పండితుడు, సంఘ సంస్కర్త, ప్రజల మనిషి అని, విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించిన మహోన్నత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరించుకొని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరికి బాధ్యత అని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలను తీసుకొచ్చి దళితుల సాధికారతకు పాటు పడ్డాడని అన్నారు.