అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కఠిన చర్యలు
రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని సంబంధిత యజమానులు,డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.ఈ విషయాన్ని ఎస్సై డి.సుధాకర్ వెల్లడించారు.వివరాల్లోకి వెళితే, రేగొండ మండలానికి చెందిన గోళ్లేనా కుమార్, శ్రీపతి మహేందర్, అంకం రాజేందర్, శ్రీనివాసరావు వారి ట్రాక్టర్లను డ్రైవర్లు నగేష్, నితిన్, రాజు తదితరులు ఎలాంటి చెల్లుబాటు అయ్యే అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.ఈ మేరకు సంబంధిత ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా ఎస్సై డి. సుధాకర్ మాట్లాడుతూ, అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అక్రమ రవాణా, సహకారం చేసే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.మొత్తం మీద రేగొండ పోలీసుల ఈ చర్యలు అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో కీలకంగా మారనున్నాయి.