అక్రమ మైనింగ్ నడుపుతున్న మాచారెడ్డి ఎంపీపీ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి
Uncategorizedసిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్
మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ జితేష్ పాటలు గారిని కలిసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలోజిల్లాలోని మాచారెడ్డి మండలం మంథని దేవనపల్లి లో జరుగుతున్న అక్రమ మైనింగ్ నడుపుతున్న మాచారెడ్డి ఎంపీపీ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆ మైనింగ్ వల్ల రైతులు గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బోర్ పంపులో బోరు బావులు ఆ పేలుళ్ల శబ్దాలకు ఎగులుతుంది అన్నారు ఇష్టానుసారంగా బ్లాస్టింగ్లు చేయడం తోటి పంట పొలాల్లో పని చేసుకునే మహిళలు రైతులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ రాయి ముక్కలు తగిలి చనిపోయే ప్రమాదం ఉందన్నారు ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల ప్రజల పశువులైనటువంటి మేకలు గాని బర్లు గాని ఆవులు దాంట్లో పడి చనిపోయే ప్రమాదం ఉందన్నారు ఇదంతా జిల్లా ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతోటి మాచారెడ్డి ఎంపీపీ గారు లోపాయికర ఒప్పందం కుదుర్చుకొని నడిపిస్తున్నాడు ప్రధానంగా కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రజా సమస్యలపై ఆందోళన చేసినప్పుడు చట్టాల కోసం మాట్లాడుతూ గుర్తు చేస్తారని ఇష్టానుసారంగా బ్లాస్టింగ్లు చేస్తున్న తమకేమీ పట్టనట్టు వ్యవహ రించడం సిగ్గుచేటు అన్నారు రెవెన్యూ అధికారులు చరోషికం భూమితో పాటు అసైన్డ్ భూములను తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేయించి ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపించారు ఇది నడిపిస్తున్నారని ఆరోపించారు ఈ విషయానికి సంబంధించి రెవెన్యూ మినిస్టర్ తో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాలుగు పేజీల లేక రాయనున్నట్లు ఆయన వివరించారు