ఈ69న్యూస్ హన్మకొండ:అనుమతులు లేకుండా నడుస్తున్న జూనియర్ కాలేజీలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ,స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ నేతృత్వంలో డి.ఐ.ఈ.ఓ.కి వినతిపత్రం అందజేయడం జరిగింది.సాయికుమార్ మాట్లాడుతూ..అక్రమ కాలేజీలు విద్యార్థులను మోసం చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి.ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి శివకుమార్,సిద్ధార్థ,విక్రం,సాత్విక్,శ్రావణ్,జస్వంత్,సాయి,ముఖేష్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.