తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ నిర్మలా కోటిరెడ్డి ఆధ్వర్యంలో భారీ జన సమీకరణతో సత్తుపల్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఎన్నిప్రచారంలో విశేష స్పందన లభించింది, కార్యక్రమాన్ని ఉద్దేశించి అభ్యర్థి వెంకట వీరయ్య మాట్లాడుతూ నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలను,దానికి కారకులైన సర్పంచ్ నిర్మల అదేవిధంగా ఈ గ్రామ విడిసీ చైర్మన్ కోటిరెడ్డి కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాన ని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఈరోజు ఇంత అభివృద్ధి జరిగిందంటే తెలంగాణ ప్రభుత్వం, ప్రజలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న దానిని నా భుజాలపైన వేసుకుని నాకు చేతనైనంత ప్రయత్నిస్తున్నానని,నాకు వేరే వ్యాపకాలు లేవు అభివృద్ధి చేయడమే నా వ్యాపకం .అని ఆయన అన్నారు కార్యకర్తలే నా బలం ప్రజలే నా బలగం మీ ఆశీస్సులే నాకు దీవెనలను ఈ సందర్భంగా ఆయన చెప్తూ *మొదటి ఈవీయంలో 5 వ నంబర్ కారు గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు,జడ్పిటిసి దిరిశాల ప్రమీల,సొసైటీ చైర్మన్ వీర మోహన రెడ్డి,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ధుగ్గి దేవర వెంకట లాల్, గ్రామ సర్పంచ్ బద్దం నిర్మల,ఆ గ్రామ వీడిసి చైర్మన్ కోటిరెడ్డి ఉప సర్పంచ్* మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు