డిసెంబర్ 3వ తేదిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయం

ప్రజాదీవన యాత్ర హన్మకొండ 29 వ డివిజన్ లో రామన్నపేటలో మహమ్మద్ ముదస్సిర్ ఖయ్యుం ఇంటి నుండి ప్రారంభమై కీస్ హై స్కూల్, అసదుద్దీన్ స్ట్రీట్, కృష్ణమూర్తి కిరాణం, ఓ.ఎస్. నగర్, జెండా, యాసీన్ సాహబ్ స్ట్రీట్, బొమ్మల సత్యం స్ట్రీట్, రఘునాథ్ నగర్, బొడ్రాయి మీదుగా సాగి అయేషా మస్జిద్ వద్ద ముగిసింది. అనంతరం అయేషా మస్జిద్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కే. శివ కుమార్ పాల్గొని ప్రచారం నిర్వ్క్హించారు.
ఈ సందర్భంగా కర్నాటక డిప్యూటీ సిఎం. డి.కే.శివ కుమార్ గారు కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ…
తెలంగాణంలో 3 వ రోజు నేను వచ్చి కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన వస్తుంది.
నాకు మార్పు కనబడుతుంది. నాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని హామీ.
తెలంగాణాలో కేసిఆర్ కుటుంబ పాలన సాగుతున్నది.
ఫామౌజ్ లో వుండే తెలంగాణ ముఖ్యమంత్రిని అక్కడే వుంచుదాం.
టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
ప్రజలు అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించిన ఉప ముఖ్యమంత్రి డీకే.
సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తెలంగాణా రాష్ట్రము ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకుంది.
తెలంగాణా ఇస్తే నేను నా పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి బంగారు తెలంగాణా కోసం పాటు పడుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వెన్ను పోటు పొడిచారు.
తెలంగాణా రాష్ట్రము ఏర్పడిన తర్వాతా దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తానూ ముఖ్యమన్థ్రీగా కూర్చొని దళితులని మోసం చేసాడు.
ఏరాష్ట్రంలో నయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో అక్కడ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి
ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధి గారు ఎలాగైతే తెలంగాను ఇచ్చారో, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం మన అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి సోనియా గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలి.
ఇంటికో ఉద్యోగామిస్తానాన్న కే.సి.ఆర్ మాట నిలబెట్టుకోలేదు. tspsc లోనే 17 సార్లు పేపర్ లీక్ అయిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా ?
బిజేపి బీఆర్ఎస్ రెండు ఒకటే పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు బిల్లు పాస్ కాడానికి బిజెపి కి సప్పోర్ట్ చేసింది కే.సి.ఆర్ కాదా ? వీరు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ డ్రామాలు చేస్తున్నారు గల్లి లో లొల్లి దిల్లీలో దోస్తీ చేస్తున్నారు.
స్వయానా ప్రధానమంత్రి మోడీ ఏ దేశంలోని మొదటి కరప్షన్ ముఖ్యమంత్రి అంటే కే.సి.ఆర్ అని అన్నారు.
దళితులకు 3 ఎకరాల్ భూమీ ఇస్తానని అన్నాడు ఎవరికైనా వచ్చిందా ?
ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని ముఖ్యమంత్రి మనకు అవసరమా ?
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట లక్ష 20 కోట్ల 20 వేల కోట్ల రూపయలు దోచుకున్నాడు..
డిసెంబర్ 3వ తేదిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం.
కర్ణాటక లో అమలు చేసిన విధంగా గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపిన ఉప ముఖ్యమంత్రి.
నాయిని రాజేందర్ రెడ్డిని అత్యధిక మెజారితో గెలిపించి అసెంబ్లీ కి పంపించాలి.
ఈ కార్యక్రమలో డివిజన్ అద్యక్షుడు ఓరుగంటి పూర్ణ కర్ణాటక ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దినేష్ గుండురావు, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, , వరంగల్ వెస్ట్ ఇంచార్జి సంజయ్ జాగీర్దార్, జిల్లా డిసిసిబి చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రా, వు టిపిసిసి కార్యదర్శి ఈ.వి. శ్రీనివాస్ రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, కార్పోరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, మాజీ కార్పొరేటర్ బుద్ధా జగన్, జిల్లా అనుబంధ సంఘాల అద్యక్షులు, డివిజన్ అద్యక్షులు యూత్ కాంగ్రెస్, ఎన్,.ఎస్,ఎస్.యు.ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News