ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు ఆపాలి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట.ఒకపెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ జగిత్యాలలో మంత్రి అడ్లురి లక్ష్మణ్,ఎమ్మెల్యేలు ధర్నా చేస్తుండగా ‘ముందు వడ్లు కొనండి’ అని చెప్పినందుకు జగిత్యాల డిపో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై వేటు వేయడం అన్యాయమని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు.కార్మికులకు ప్రజల పక్షాన మాట్లాడే ట్రేడ్ యూనియన్ హక్కులు ఉంటాయని, మూర్ఖంగా వ్యవహరించడం బాధాకరమని మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదని,రైతుల గురించే మాట్లాడానని డ్రైవర్ అశోక్ చెప్పినా ఆర్టీసీ ఆర్ఎం రిమూవల్ లెటర్ ఇచ్చి డ్యూటీకి రావద్దనడం కార్మిక హక్కుల ఉల్లంఘనే అని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మంత్రిగారికి తెలియదా అని ప్రశ్నించారు.ప్రజా సమస్యలపై మాట్లాడడం కనీస బాధ్యతగా భావించిన డ్రైవర్ అశోక్‌ను అభినందిస్తున్నామని,వెంటనే అతనిపై చర్యలు నిలిపివేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.