ఇంధన ధరలు తగ్గించాలి
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించి, రవాణా రంగ డ్రైవర్లు, కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు వై. విక్రమ్ డిమాండ్ చేశారు. అఖిల భారత కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద ప్లకార్డులతో నిరసన నిర్వహించారు.
ఈ సందర్భంగా వై. విక్రమ్, జిల్లా కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలతో పాటు రవాణా రంగంపై తీవ్ర భారం మోపుతోందని విమర్శించారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. వరుసగా ఇంధన ధరలు పెరగడంతో ఆటో, కారు, ట్రాక్టర్, లారీ డ్రైవర్ల జీవనం సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్లను అమలు చేయడం ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. వెంటనే నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు పెంచడం మరింత భారంగా మారిందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో: జిల్లా కోశాధికారి ధరావత్ రాందాస్, జిల్లా కమిటీ సభ్యులు గంగుల నరసయ్య, బీమా,