
ఈటెల చేపట్టిన మహా ధర్నా లో పాల్గొన్న బొజ్జపల్లి
చెల్పుర్ గ్రామ సర్పంచ్ నేరెళ్ళ మహేందర్ గౌడ్ మరియు బిజెపి నాయకులు వార్డ్ మెంబర్లపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన శారీరకంగా హింసించిన హుజురాబాద్ సి.ఐ బొల్లం రమేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఈరోజు హుజురాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద హుజురాబాద్ శాసనసభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు చేపట్టిన మహా ధర్నా కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొజ్జపల్లి రాజయ్య గారి తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారు M.A, M.Phil పాల్గొన్నారు..
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ప్రమోద్ రెడ్డి, యువ మోర్చ మండల అధ్యక్షులు రాజ్ కుమార్ నాయక్, యువ మోర్చ మండల ప్రధాన కార్యదర్శి మారుపాక వెంకట్, ముడపల్లి అరుణ్ ఉన్నారు