ఉపాధిహామీ హక్కులను కాపాడుకుందాం
విబి జి రాంజీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్ డిమాండ్ చేశారు
ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో వివిజి రాంజీ చట్టాన్ని తీసుకురావడానికి వ్యతిరేకిస్తూ వెంటనే ఉపసంహరించుకొని 2005 ఉపాధి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్ డిమాండ్ చేశారు. సోమవారం గార్ల ఎంపీడీవో గారికి తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మెమోరండం ఇవ్వడం జరిగింది.అనంతరం హరి నాయక్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్లో కార్మిక కర్షక వ్యవసాయ కార్మికులకు బడ్జెట్లో నిధుల కోత విధించటం కార్పొరేట్లకు పెట్టుబడుదారులకు భూస్వాములకు అనుకూలమైన విధానాలు కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు. విబి జి రామ్ జి చట్టం, విద్యుత్ సవరణ చట్టం, లేబర్ కోడులు రద్దయేంతవరకు ఆందోళన పోరాటాల నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రూనువాల్ రాజేష్, బానోత్ మోహన్, భూక్య శ్రీను తదితరులు పాల్గొన్నారు.