ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరు కార్చే ఆలోచనలు
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని నీరు కార్చే ఆలోచనలు భాగంగా గాంధీ పేరు మీద ఉన్నటువంటి పేరును తొలగించి పట్టి స్థానంలో జి రాంజీ అనే పేరును ఈ మధ్యకాలంలో పార్లమెంటులో తీర్మానం చేయడం జరిగింది ఇట్టి పథకాన్ని కాలక్రమేనా పేదలకు దక్కకుండా చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈ పేరును మార్చడం జరిగింది అందులో భాగంగానే పని దినాలను తగ్గించాలని ఆలోచనలో ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇట్టి ప్రయత్నాన్ని గ్రామాలలో ఉన్నటువంటి కార్మికులు వ్యవసాయ కూలీలు వ్యతిరేకించాలని ఈ రోజున గార్ల మండలం గోపాలపురం లో వ్యవసాయ కూలీలను ఉద్దేశించి మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సహా కార్యదర్శి వంగూరు పెద్ద వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇమ్మడి గోవిందు పాల్గొన్నారు అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఠామేస్త్రులు వ్యవసాయ కూలీలు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది