కమ్యూనిస్టుల పోరాట ఫలితాలే – ప్రజా సంక్షేమ పథకాలు అమలు, త్యాగాలు చేసిన కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపండి| కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలే గ్యారెంటీ లేదు, ఆర్ గ్యారంటీల అమలు ఎక్కడ:సిఐటియు ఆల్ ఇండియా కోశాధికారి సాయిబాబా
Uncategorizedకమ్యూనిస్టులు పోరాడిన పోరాట ఫలితాల వలనే ప్రజలకు కార్మిక కర్షకులకు ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే గ్యారెంటీ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు పరుస్తామని చెప్పటం హాస్యస్పదంగా ఉందని సిఐటియు ఆల్ ఇండియా కోశాధికారి సాయిబాబా విమర్శించారు. ఎర్రుపాలెం మండల పరిధి లోని మీనవోలు,
తక్కెళ్ళపాడు, ములుగుమాడు, సకినవీడు,ఇనగాలి, రామన్నపాలెం, తదితర గ్రామాలలో సిపిఎం పార్టీ అభ్యర్థి పాలడుగు భాస్కర్ విజయాన్ని కాంక్షిస్తూ గ్రామాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో జరిగిన సభలలో సాయిబాబా మాట్లాడుతూ అర్థ బలం అంగ బలం మంది మార్బలం డబ్బున్న పార్టీలు ఒకవైపు, దేశం కోసం ప్రజల తరఫున నికరంగా పోరాడే ఎర్రజెండా ఒకవైపున ఉన్నాయని ఈ పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు, డబ్బులు మద్యం పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న ఈ ప్రస్తుత తరుణంలో ప్రజలు సిపిఎం ను ఆదరించాలని కోరారు. గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన అనుభవం చూసిన తర్వాత ప్రజలు శాసన సభలో పోరాడటానికి ప్రజల గొంతుకను వినిపించడానికి కమ్యూనిస్టుల అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలు చర్చించి వాటి పరిష్కారానికి ప్రజా ప్రయోజనాలను పట్టించుకోని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే కమ్యూనిస్టు అభ్యర్థి అయిన పాలడుగు భాస్కర్ ని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి పాలడుగు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు పరుస్తామని చెబుతున్న వారంటీ లేని కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని అన్నారు. శాసన సభ్యుడిగా గ్రామాల అభివృద్ధి ప్రజా సమస్యలు పట్టించు కోకుండా ఢిల్లీ హైదరాబాదు చుట్టూ చక్కర్లు కొట్టే భట్టిని ఓడించాలని అన్నారు. ఒక సామాన్య వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి తీసుకొని వచ్చిన కమ్యూనిస్టు పార్టీకి వెన్నుపోటు పొడిచిన కమల్ రాజును ఓడించాలని జెడ్పీ చైర్మన్ గా గ్రామాలు చుట్టూ తిరగటం తప్ప అభివృద్ధి పరిచింది ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించి ప్రజా సమస్యల పైన నికరంగా నిరంతరం పోరాడే నన్ను గెలిపించాలని మీ సమస్యలను చట్ట సభలలో ప్రస్తావిస్తా, వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. నా ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లను వేసి గెలిపించాలని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి మీకు తోడుగా నేనుంటానని ప్రజలను ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్య క్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, జార్జి టెన్షన్, మండల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు, సానుభూతిపరులు తదితరులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.