ఈ రోజు పద్మాక్షి గుట్ట సమీపంలోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఆధ్వర్యంలో కాంగ్రెస్ హామీ అఫిడవిట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హనుమకొండ లోని విశాల్ భవన్ లో వరంగల్ పశ్చిమ నియజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నవంబర్ 30, 2023 న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను.
*ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తప్పక అమలు చేస్తానని హామీ ఇచ్చారు, మన నియోజకవర్గ అభివృద్ధి కోసమే పూర్తిగా అంకితమవుతాను.
*ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను, నిజాయితీగా నా బాధ్యతలని నిర్వర్తిస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను.
*అవినీతికి ఏమాత్రం తావు లేకుండా, పారదర్శకంగా పనిచేస్తూ, తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
పైన పేర్కొన్న విషయాలన్నింటికి సదా కట్టుబడి ఉంటానని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటానని ఈ అఫిడవిట్ తో మీకు హామీ ఇస్తున్నాను అని తెలిపారు.

గవర్నమెంట్ ఉద్యోలందరికి పోస్టల్ బ్యాలట్ అవకాశం కల్పించకుండా మోసం చేస్తున్నారు అని తెలిపారు.
వరంగల్ పశ్చిమ ఎం.ఎల్.ఏ. గా గెలిచినా వెంటనే 6 గ్యారంటీ స్కీం లను వెంటనే అమలు చేస్తానని అన్నారు
కాబట్టి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు.
నగరంలో మూడుచోట్ల ఫ్లైఓవర్లు అభివృద్ధి ప్రతిపాదనలలో ప్లైఓవర్ల ఊసే లేదు. మీరు మర్చిపోయి ఉండవచ్చు.
వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు.
పేదలకు 120 గజాల ఇళ్ళ పట్టాలెక్కడ?
నగరంలో నడిబొడ్డున నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఏళ్ళు గడుస్తున్నా, శిథిలమవుతున్నా పేద వారికి కేటాయించలేదు
మా బూత్ ఏజెంట్ లను, డివిజన్ ప్రెసిడెంట్ లను అధికార పార్టీ నాయకులు ఇబ్బందులను, దాడిలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
మా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన మళ్లీ దాడి జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు .
ఎమ్మెల్యే 20 ఏళ్లలో చేయలేని అభివృద్ధి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలలో చేసి చూపిస్తా.
ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారు.
మీరు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా.
మీరన్నట్లుగా గ్రేటర్ అభివృద్ధికి ప్రత్యేక అథారిటి ఏర్పాటు చేశారా?
ఆధునిక మార్కెట్లు ,విశాలమైన రోడ్లు,50 వేల జనాభాకు ఒక కమ్యూనిటీ హాల్ ,పార్కులు, ఎక్కడ?
మాస్టర్ ప్లాన్ లేని నగరం ఎక్కడైనా ఉందా?
వడ్డేపల్లి చెరువు పై కాకతీయ మిషన్ పైలాన్ ఏది..?
జాతీయ స్థాయిలో కాకతీయ ఉత్సవాలు జరిపిస్తున్నారా..?
మాజీ డి‌సి‌సి‌బి ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ… నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయిని రాజేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు, ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చింది, ప్రజలకు అందాయి, ప్రజాస్వామ్యం కోసం నడిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది, 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు, అధికార పార్టీ బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి రవీంద్ర ఉత్తం రావు దాల్వి, వరంగల్ వెస్ట్ ఇంచార్జి సంజయ్ జాగీర్దార్, అస్సాం ఎం.ఎల్.ఏ. రికుబుద్దిన్, డిసిసిబి మాజీ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, కార్పోరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమాన్, సయ్యద్ విజయ శ్రీ రజాలి,టి‌పి‌సి‌సి అసెంబ్లి ఇంచార్జ్ సంగీత, సీనియర్ నాయకులు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ అద్యక్షులు. యూత్ కాంగ్రెస్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News