
ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనవరి 07
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామ బైండ్ల వాడను బాగుచేయాలని వార్డు కు చెందిన జిలుకర సాయి,ఎలుమకంటి రవి ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ ను కోరారు.ఈ సందర్భంగా సాయి మీడియాతో మాట్లాడుతూ..
తమ్మడపల్లి జి గ్రామంలోని బైండ్ల వాడకు సరైన రోడ్లు లేక,సైడ్ కాలువలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామ సర్పంచ్ కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించు కోవడం లేదని అన్నారు. ఎమ్మార్వో,జిల్లా కలెక్టర్ లు స్పందించి బైండ్ల వాడకు సిసి రోడ్లు,సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు.