కోల్పోయిన మొబైల్‌ను తిరిగి అందజేసిన పోలీసులు
సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ట్రాకింగ్–రెండు నెలల తర్వాత యజమానికి ఎస్ఐ డి.సుధాకర్ చేతుల మీదగా మొబైల్ అందజేత
పోలీసుల సేవలకు కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు–ప్రజలకు అవగాహన సూచనలు
రెండు నెలల క్రితం కోల్పోయిన మొబైల్ ఫోన్‌ను రేగొండ పోలీసులు గుర్తించి యజమానికి తిరిగి అందజేశారు.లింగాల గ్రామానికి చెందిన నరసింహస్వామి రేగొండ నుంచి పరకాల వెళ్తున్న సమయంలో తన మొబైల్ ఫోన్‌ను కోల్పోయారు. వెంటనే రేగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయడంతో పోలీసులు సాంకేతిక సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు.ఈ సందర్భంగా సి ఈ ఐ ఆర్ పోర్టల్‌లో ఫోన్ వివరాలను నమోదు చేసి, ట్రాకింగ్ ప్రక్రియ చేపట్టారు. నిష్ణాతంగా వ్యవహరించిన పోలీసులు ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.అనంతరం రేగొండ ఎస్ఐ డి. సుధాకర్ చేతుల మీదుగా నరసింహస్వామికి మొబైల్ ఫోన్‌ను అందజేశారు.సుమారు రూ.20,000 విలువైన మొబైల్ తిరిగి లభించడంతో నరసింహస్వామి ఆనందం వ్యక్తం చేస్తూ రేగొండ పోలీసుల సమర్థ సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ డి.సుధాకర్ మాట్లాడుతూ,మొబైల్ ఫోన్లు కోల్పోయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేస్తే వాటిని ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు.ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.ప్రజలు మొబైల్ ఫోన్ కోల్పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం లేదా సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా త్వరితగతిన సహాయం పొందవచ్చని పోలీసులు తెలిపారు.మొత్తం మీద రేగొండ పోలీసుల చురుకైన చర్యల వల్ల బాధితుడికి తన మొబైల్ తిరిగి అందడంతో పోలీసులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగింది.