గడపగడపకు మున్సిపాలిటీ ఎన్నికల సందడి
అవ్వ తాతలని కలుస్తూ ఓటు అభ్యర్థిస్తున్న కౌన్సిలర్ అభ్యర్థి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అజీజ్
మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇదొక్కసారి మీ అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదించండి అధికారం అంటే కుర్చీ కాదు అని ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల మధ్యలో ఉండేదే నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ 12వ వార్డు అభ్యర్థి షేక్ అజీజ్ అన్నారు. మంగళవారం మరిపెడ మున్సిపాలిటీ 12వ వార్డులో ఇంటిండ ప్రచారం నిర్వహించి ప్రజలతో మమేకమై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలన్నారు. ప్రతి ఇంటిని తట్టి సమస్య పరిష్కరించడంమే దిశగా ముందుంటానే భరోసా కల్పిస్తూ అని కోరారు.
ప్రచారంలో జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, యువ నాయకులు మాజీ సర్పంచ్ నూకల అభినవరెడ్డి, మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష గౌడ్,బుచ్చిరెడ్డి, గంధసిరి చోక్కం,వీరభద్రం,ఎండి అప్సర్,దేవరశెట్టి లష్మినారాయణ,గంధసిరి శ్రీనివాస్,గుండగాని ఉపేందర్,అశోక్ తదితరులు ప్రచారంలో జోరుగా ఇంటింటికి తిరిగి ఓటు అడుగుతూ అభ్యర్థించారు