గురుపౌర్ణమి వేడుకలు-ఉప ప్రధాన అర్చకులకు సత్కారం
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించారు.ఈ పవిత్ర దినం సందర్భంగా దేవాలయ ఉప ప్రధాన అర్చక పాతర్లపాటి రవీందర్ ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువా,పూలమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్,ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ,అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ, నందనం మధు శర్మ,ఉప్పుల శ్రీనివాస్,పాతర్లపాటి నరేష్ శర్మ, ఉప్పుల సాయి వరుణ్ తో పాటు ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.గురువులకు గౌరవంగా ఈ సత్కార కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.