జనగామ జిల్లా బీజేపీ ధార్మిక సెల్ జాయింట్ కన్వినర్‌గా బుర్ర తిరుపతి
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ (ధార్మిక) సెల్ జిల్లా జాయింట్ కన్వినర్ కమిటీని రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది.ఈ కమిటీలో జనగామ జిల్లా ధార్మిక సెల్ జాయింట్ కన్వినర్‌గా బుర్ర తిరుపతి నియమితులయ్యారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారాపరాజు రామచంద్రరావు సూచనల మేరకు, రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కన్వీనర్ ఎ. సూర్యప్రకాష్, కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్ సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో ఈ నియామకాన్ని ప్రకటించారు.నియామకంపై స్పందించిన బుర్ర తిరుపతి, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ధార్మిక సెల్ ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ధార్మిక కార్యక్రమాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎండోమెంట్ సెల్ నాయకత్వంతో పాటు జనగామ జిల్లా పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.బుర్ర తిరుపతి నియామకాన్ని స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ధార్మిక వర్గాల ప్రతినిధులు స్వాగతిస్తూ అభినందనలు తెలియజేశారు.