ఐసీడీఎస్ సూపర్ వైజర్స్"
ఐసీడీఎస్ సూపర్ వైజర్స్”
మర్లపాడు లో మానవ అక్రమ రవాణా దినం”
సత్తుపల్లి/వేంసూరు,జూలై30(తెలుగు గళం) న్యూస్: నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల మర్లపాడు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు ఐసీడీఎస్ సత్తుపల్లి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సూపర్ వైజర్స్ కమల,గంగాజలం,వసంతరాణి లు అవగాహన సదస్సు నిర్వహించారు.
టోల్ ఫ్రీ నంబర్స్ కు కాల్ చేసి నేరాలను,ఘోరాలను జరగకుండా నివారించవచ్చని, జయించవచ్చని తెలిపారు. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098,మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181,పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 100,ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ 112,సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ల గూర్చి విపులంగా విశదీకరించారు. ఈ కార్యక్రమంలో: పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకాంత్,అంగన్వాడీ కేంద్రాల చిన్నారులు, అంగన్వాడీ టీచర్స్ స్వర్ణ,నాగేశ్వరీ,మిట్టపల్లి రమాదేవి, రాయుడుపాలెం అంగన్వాడీ టీచర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.