కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర నిరసన
కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర నిరసన
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన కేంద్రం – మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్యానికి మచ్చ – యూత్ కాంగ్రెస్ మండిపాటు
తెలుగు గళం ఏటూరునాగారం :
ములుగు జిల్లా ఏటూరునాగారంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్సార్ ఖాన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మారం సుమన్ రెడ్డి సూచనల మేరకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గంట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏటూరునాగారం వై జంక్షన్ సమీపంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీఏ మెంబర్ వసంత శ్రీనివాస్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర అనిశ్చితిలో పడిపోయారని పేర్కొన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపడుతుండగా వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని ఆయన విమర్శించారు. విద్యార్థుల గొంతును అణచివేయడం కాకుండా, పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, యువతకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, దేశ యువత భవిష్యత్తును కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యా వ్యవస్థపై విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. విద్యార్థుల సమస్యలను రాజకీయంగా కాకుండా బాధ్యతాయుతంగా పరిష్కరించాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సర్వ అక్షిత్, మండల యూత్ ఉపాధ్యక్షులు ముస్తఫా, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్వ సాయితేజ, ప్రశాంత్, టౌన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ల తరుణ్, కళ్యాణ్, వేణు, మని, సిద్ధు, వంశీ, సద్దాం, దినేష్, సర్వ అక్షిత్ కుమార్, పోలాబోయిన గోపాల్, అఖిల్ ఆఫ్రిది, సాయి, వినాయక్‌తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.