rajaka news
★రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని మెమోరండం అందజేత ●శాలువాతో సన్మానించిన టీఆర్ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ____________ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ కమాండో కమల్ కిషోర్ గారిని కలిసిన నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ మరియు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నాయకులు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రజక కులస్తులు ఎస్సీ రిజర్వేషన్ లేనందున ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యా ఉద్యోగాల్లో వెనకబాటుతనానికి గురైతున్నారని ఎంపీ గారికి వివరించడం జరిగింది.ఎంపీ శ్రీ కమాండో కమల్ కిషోర్ గారు స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీ ఐన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులను కల్పించెందుకు ప్రయత్నిస్తామని అన్నారు అదేవిధంగా గతంలో పార్లమెంట్లో ఎస్సీ రిజర్వేషన్ అంశంపై మాట్లాడటం జరిగిందని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో మీ పోరాటానికి అన్ని విధాలుగా సహకరిస్తామని వారన్నారు. ఎంపీ శ్రీ కమాండో కమల్ కిషోర్ గారిని శాలువాతో సన్మానిస్తూ మెమోరండంను అందజేసిన వారిలో నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్,తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడిపుంజుల చంద్రయ్య,రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక,విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. బస్వరాజు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంపల్లి జంగయ్య,భువనగిరి జిల్లా అధ్యక్షురాలు బండిరాల సుశీల,సంగారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సిహెచ్. యాదయ్య.