తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం
ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలదే
కడ దాకా కార్యకర్తలు కడుపులో పెట్టుకొని చూసుకుంటా
సంక్షేమ పథకాలపై ప్రతి గ్రామంలో చర్చ పెట్టాలి
గత పాలకుల పాలనలో పల్లెలు అధోగతి.. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో పల్లెలు
తాడువాయి గ్రామంలో మునగాల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ముఖ్యఅతిథిగా కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు.ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ…..గతంలో వివిధ పార్టీలు పరిపాలించడం జరిగినది. 8 ఏళ్లు బిఆర్ఎస్ పార్టీ పరిపాలించడం జరిగింది గతానికి ఇప్పటికీ ఎన్నో తేడాలు ఉన్నాయి గతంలో ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి లేదని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో సరైన నీటి వసతి లేక విద్యుత్ లేక ఎన్నో ఇబ్బందులను ప్రజలు ఎదుర్కోవడం జరిగిందని అన్నారు.తెలంగాణ ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ప్రజల కష్టాలను తెలుసుకొని కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ప్రజల బాధలను గ్రహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేసిన నాయకుడు సీఎం కేసీఆర్ గర్వంగా పేర్కొన్నారు.నేడు మునగాల మండలం అన్ని గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు రావడం జరుగుతుందని అన్నారు . వ్యవసాయ రంగానికి రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్ కెసిఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు, వంటి నగదు రూపంలో తో పాటు గ్రామ గ్రామాన సిసి రోడ్లు నిర్మించిన ఘనత బిఆర్ఎస్ పార్టీలను తెలిపారు .అన్ని విధాలుగా రైతులకు అండగా నిలిచి గతంలో వ్యవసాయం అంటే దండగ కానీ కేసీఆర్ వ్యవసాయం అంటే పండగ నిరూపించింది. అదే కాక ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుండి మన ప్రాంతానికి కూలి పని చేయడానికి రావడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకం, తెలంగాణ రాష్ట్రంలో దళితుల కోసం సీఎం కేసీఆర్ దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం దళితుల ఆత్మ గౌరవంగా బతకాలని అన్ని వర్గాలతో సమానంగా ఆత్మగౌరవంతో జీవించాలని దళిత బంధు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
దేశంలో తెలంగాణ రాష్ట్ర అమలు అవుతున్న సంక్షేమ పథకాలను చూసి రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలో సీఎం కేసీఆర్ పరిపాలన మా ప్రాంతాల్లో కూడా కావాలని బిఆర్ఎస్ పార్టీ వైపు మగ్గుచూపుతున్నారు.
గ్రామాలే దేశానికి పట్టికొమ్మలు గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి,బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సీఎం కేసీఆర్ ను మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి నాకు కూడా మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలలో కళాకారులు ఆటపాటతో అలలించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తోగరు రమేష్, ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి, జడ్పిటిసి నల్లపాటి ప్రమీల శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, సొసైటీ చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, రామ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు పైడిమరి సత్యబాబు, అల్తాఫ్ హుస్సేన్, ఎలక ఎంకట్ రెడ్డి, కానర్లపూడి శ్రీనివాసరావు, నాగిరెడ్డి, కవిత, లేఖ్య నాయక్, యుగంధర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, మండల నాయకులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శిలు, బిఆర్ఎస్ నాయకులు, మహిళలు, మల్లన్న అభిమానులు, తదితరులు పాల్గొన్నారు