” విలీనం , విమోచనం , విద్రోహం “

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం

ప్రచారాలు – వాస్తవాలు

చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న నైజాం ప్రాంతం భారతదేశంలో విలీనం అయింది. కేంద్ర సైన్యాలు జనరల్ జె.ఎన్. చౌదరి అధ్వర్యంలో నైజాం ప్రాంతంలో ప్రవేశించడంతో నిజాం కేంద్ర సైన్యాలకు లొంగిపోయి తన పాలన ప్రాంతాన్ని భారత యూనియన్లో కలిపి వేశారు. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని బొల్లారంలో జాతీయ జెండాను ఎత్తారు. నెహ్రూ ప్రభుత్వం నిజాంను “రాజ్ ప్రముఖ్ గా” నియమిస్తూ ప్రకటించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా భారతదేశంలో విలీనం కావడాన్ని ప్రజలందరూ హర్షించారు. ఈ పోరాటంలో ముస్లింలు, హిందూవులు, ఇతర మతాల వారు, కులాల వారు అందరు పాల్గొన్నారు. క్రూర నిజాం పాలన అంతమైంది.

ఈ విలీనాన్ని “విమోచన – విముక్తి ” పేరుతో బిజెపి ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్నది. ముస్లింల నుండి హిందువులకు విముక్తి కలిగినట్లు అర్థం వచ్చే రీతిలో వారి ప్రచారం కొనసాగుతున్నది. వాస్తవానికి క్రూర పరిపాలన పోయి భారతదేశం విలీనం కావడం అన్ని మతాల, కులాల కోర్కె మేరకే జరిగింది. “కామ్రేడ్స్ అసోసియేషన్” పేర 1940లోనే ముఖూం మొహియుద్దీన్, అలంకుంద్ మీరి, రాజ్ బహదూర్ గౌర్ తదితరుల నాయకత్వాన ఏర్పడి నిజాంతో పోరాటం చేశారు. సభలు, సమావేశాలు జరిపారు. ఉర్దూ భాషకు బదులు తెలుగు భాషను కూడా పాఠశాలలో బోధించాలని గ్రంథాలయ ఉద్యమం నడిపారు. సెప్టెంబర్ 17న “ఆపరేషన్ పోలో” విజయవంతం కావడంతో వారి కోర్కెలు అమలు జరిగాయి. అలాగే మరికొందరు విద్రోహం అంటున్నారు. రాజకీయంగా కమ్యూనిస్టు పార్టీని అణచడానికి కేంద్ర సైన్యాలు సెప్టెంబర్ 17 తరువాత హైదరాబాద్ సంస్థానంలోనే ఉండి 3 సంవత్సరాల 1 నెల తీవ్ర నిరంకుశ విధానాన్ని, క్రూర హింసకాండను సాగించాయి. అయినప్పటికీ ఉద్యమాన్ని

అణచలేకపోవడంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం “రక్షిత కౌలుదారీ చట్టం” 1951ని ప్రకటించింది. దాంతో పోరాటంలో స్వాధీనం చేసుకున్న భూములు వారికే దక్కుతాయి. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో కూడ అప్పీల్ చేయడానికి వీలులేకుండా పార్లమెంట్ ఆమోదించింది. ఆ రోజు ఈ ఉద్యమంతో సంబంధం లేనివారు ఈ రోజు రకరకాల నినాదాల పేరుతో పక్రీకరణలు చేస్తున్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలలో కలిసిన హైదరాబాద్ సంస్థాన ప్రాంతాలను 2022 సెప్టెంబర్ 17 నుండి “విమోచన” ప్రాంతాలుగా ప్రకటించడానికి ఉత్సవాలు జరపాలని తీర్మానించారు. విమోచనకు, విలీనానికి తేడా తెలియదని కాదు. ఇందులో హిందూ మతతత్వం జోడించి ముస్లింలకు, హిందువులకు మధ్య ఘర్షణ వైఖరి తేవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అన్ని కులాలు, మతాలు కలిసి ఉంటున్న నేటి తెలంగాణలో తగాదాలు సృష్టించి ఓట్ల లబ్ది పొందడానికి చేస్తున్న తప్పుడు ప్రయత్నం. అందువల్ల చరిత్రను వాస్తవిక దృష్టితో పరిశీలించడానికి వీలుగా “తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర”ను మీ ముందుకు తెస్తున్నాం. పోరాట వారసులుగా కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) బాధ్యతగా వాస్తవాలను మీ ముందుకు తేవాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్ 10 నుండి 17 వరకు “తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవం” జరుపుతున్నది.

నాటి తెలంగాణ భౌతిక పరిస్థితులు –ప్రజల జీవనం

తెలంగాణా వైశాల్యం

మొత్తం వైశాల్యం 82,698 చ.మైళ్ళు లేదా 5.30 కోట్ల ఎకరాలు తెలంగాణ ప్రాంతం, 50.4%, మరట్వాడా ప్రాంతం 28%, కన్నడ ప్రాంతం 21.4%గా ఉన్నారు. జనాభా వరుస వారీగా 54%, 26%, 20% ఉన్నారు. తెలంగాణ మొత్తం గ్రామాల సంఖ్య 10,167, మరట్వాడా, కన్నడా ప్రాంతాల మొత్తం గ్రామాల సంఖ్య 12,290 ఉన్నాయి.

తెలంగాణా ప్రాంతంలో మొత్తం 10,167కు దివానీ ప్రాంతం గ్రామాలు 6,891 కాగా జాగీరు, సర్ఫేఖాస్ గ్రామాలు 3,276 ఉన్నాయి.

మరట్వాడా, కన్నడ ప్రాంతాలలో మొత్తం 12,290 గ్రామాలకు ఖాల్సా గ్రామాలు 7,070 కాగా సర్ఫేఖాస్, జాగీరు గ్రామాలు 5,120 వరకు ఉన్నాయి.

ఈ ప్రాంతంలో భూమి మూడు విధాలుగా ఉంది. 1) దివానీ లేక ఖల్సా, 2) జాగీరు, 3) సర్ఫేఖాస్.

1) దివానీ లేక ఖాల్సా : ఇది రైతువారీ పట్టా ఇచ్చిన ప్రాంతం మూడు కోట్ల ఎకరాలకు పైగా ఉంది. 2) జాగీరు : జాగీర్దార్లు, సంస్థానాధిపతుల ఆధీనంలో గల భూమి. ఇది 1.5 కోట్ల ఎకరాలు ఉంది. జాగీర్లలో పాయ్గాలు, అల్తమా జాగీర్లు, జాతా జాగీర్లు, తనఖాజాగీర్లు ఉండేవి.

3) సర్ఫేఖాస్ : నైజాం ప్రభుత్వ సొంత ఆస్థిగా ఉన్న ప్రాంతం. ఇది 55 లక్షల ఎకరాలు ఉంది. రైతువారీ పట్టా (దివాని) భూమిలో 40% ఉంది.

1948 జూన్ 20న సర్ఫేఖాస్, జాగీరు ప్రాంతాలను రద్దు చేసి దివానీ ప్రాంతాలలో కలిపి వేశారు. సర్ఫేఖాస్ ప్రాంతం దాదాపు 8,000 చ.మైళ్ళ వైశాల్యం కలిగి 18 తాలూకాలు ఉన్నాయి. దీనితోపాటు 7 తాలూకాలు గల ఆత్రాపల్దా – హైదరాబాద్ జిల్లా నైజాం ఆస్థిగా ఉంది.

కౌలుదార్లు రెండు తరగతుల క్రింద విభజించబడ్డారు. సిక్మిలు, 2) సాధారణ ఆసామి సిక్మిలు. 1) రక్షిత ఆసామీ

రక్షిత ఆసామీ సిక్మీగా పరిగణింపబడేందుకు అవసరమైన 6 ఏండ్ల కబ్జాకాలాన్ని ఈ క్రింది విధంగా లెక్కకట్టాలి.

అ) 1342-52 ఫస్లీల మధ్య వరుసగా 6 ఏండ్లు కాలం వుంటే దాన్ని లెక్కించుట సులభమే.

1354 ఫసలీ (1944) ఆసామీ సిక్కీచట్టం 1950వ సంవత్సరపు కౌలుదారీచట్టం అమలులోకి వచ్చాక రద్దుగావించబడింది. అయితే ఆసామీ సిక్మీస్ చట్టం క్రింద సంక్రమించిన హక్కులు మాత్రం రద్దుచేయబడలేదు.

1958వ ఫసలీ (1948సం)లో జాగీర్లను రద్దు గావించి ఖల్సా ప్రాంతాలలో కలిపేందుకు అప్పటి మిలిటరీ గవర్నరు జనరల్ చౌదరి ఒక ఉత్తర్వును ( రెగ్యులేషన్ ను) గావించాడు.

జాగీరు అంటే పాయెగా, సంస్థానం, జాగీరులోని భాగం, మఖాపూర్తి గ్రామము, అగ్రహారం పూర్తి గ్రామము, వుమ్లీ, మొఖాసా (వీటన్నిటినీ ప్రభువుగాని లేక జాగీరుదారుగాని ఈనాంగా ఇచ్చి వుండవచ్చు) అని అర్థం.

రైతుల నుండి అంతకు ముందు సాంప్రదాయంగా వసూలు గావిస్తూ వచ్చిన అన్ని అక్రమ పన్నులను, సెస్సులను వసూలు చేయరాదు.

కౌలుదార్ల నుండి చట్టబద్ధంగా నిర్ణయించిన కౌలు రేటు తప్ప పారితోషికాలను పెంచుకోవడం కూడా నిషేధించబడింది. ఫ్యూడల్ దోపిడీగాండ్రకు చెందిన 10 లక్షల ఎకరాలను విప్లవ పంధాలో తెలంగాణా రైతులు పంచుకున్నారు.

ఫ్యూడల్ దోపిడీగాండ్లకు ఒక్కచిల్లిగవ్వ కూడా వసూలు అయ్యే పరిస్థితి పోయింది. చౌదరి మిలిటరీ ప్రభుత్వం కూలిపోతున్నా జాగీరుదారీ మున్నగు ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థ రక్షణకు పూనుకొంది.

జాగీరు రద్దు వలన అధిక శిస్తులు చెల్లిస్తున్న రైతులకు శిస్తుభారం కూడ తగ్గలేదు. ప్రభుత్వం నష్టపరిహారం కింద ప్రతియేటా ఒక కోటి 15 లక్షల రూపాయలు ముడుపు చెల్లించుకోవాలి. జాగీరుదార్ల రద్దు అన్న బూటకపు సంస్కరణ ద్వారా రైతులు చెల్లించే పన్నుల నుండి ప్రతి సంవత్సరం జాగీరుదార్లు మున్నగు ఫ్యూడలు మున్నగు దోపిడీగాండ్లకు హైదరాబాదు ప్రభుత్వం కోటిరూపాయలకు పై చిల్లర చెల్లించుతోంది. అక్టోబరు నుండి ఈ ముడుపు చెల్లించడం ప్రారంభమైంది.

హైదరాబాదు ప్రభుత్వం 1959 సంవత్సరపు కౌలుదార్ల మరియు వ్యవసాయ భూముల చట్టం అంటారు. 1951లో ఆ చట్టాన్ని రెండవపాలు సవరించారు.

1954వ ఫసలీ ఆసామి సిక్మీస్ చట్టం, హైదరాబాదు సంస్థానపు వ్యవసాయ భూముల అన్యాక్రాంతాల నివారణచట్టం రద్దు అయిపోయాయి.

వ్యవసాయం అంటే లోగడ ఆసామీ సిక్మీస్ చట్టంలో వున్న నిర్వచనంకు గడ్డి పెంచడం అన్న దాన్ని గూడా ఈ చట్టంలో చేర్చబడింది.

1950 కౌలుదారీ చట్టం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చెందిన భూమిని చట్టబద్దంగా సాగుచేస్తూంటే ఇట్టి వ్యక్తి కౌలుదారుగా పరిగణించబడుతాడు. కూలీగా గానీ, స్వాధీనపు తనఖాదారుగా గానీ, సాగు చేస్తూ వుండే వ్యక్తిగా వుండరాదు.

1951 మార్చి 1వ తేదీనాటికి భూకామందు నుండి కౌలుభూమిని గూర్చి, కౌలు కాలాన్ని గూర్చి ఏ అభ్యంతరం లేకుండా చట్టంలో రక్షిత కౌలుదార్లకుండాల్సిన యోగ్యతలలో యేదో ఒక యోగ్యతవున్న కౌలుదారు నేడు కబ్జాలో వున్నా లేకపోయినా రక్షిత కౌలుదారుగా పరిగణించబడతాడు.

1950 కౌలుదారీ చట్టం ఏ తరగతి భూములకు వర్తించుతుంది.

ప్రభుత్వం (హైదరాబాదు, మండల, స్థానిక ప్రభుత్వాలు) లేక సహకార సంస్థలు, ఇవి కౌలుకు తీసుకున్న లేక కౌలుకు ఇచ్చిన భూములు దానం పొందిన లేక దానం ఇచ్చిన భూములు యక్వైర్ గావించిన భూములు. ఏదైనా పారిశ్రామిక లేక వ్యాపార సంస్థ కౌలుపై తీసుకున్న భూములు. వృత్తి యినాము భూములు, దేవాదాయ యినాములు లేక ధర్మాదాయ యినాములు. పట్టణ పారిశ్రామిక లేదా వ్యవసాయేతర అభివృద్ధి కోసం రిజర్వు చేయబడినట్లుగా గెజెట్లో ప్రభుత్వం అప్పుడుప్పుడు ప్రకటించుతూవుండే ప్రాంతం.

భావుల క్రింద తప్ప తతిమా అన్నికరాల తరి భూముల విషయంలో పండిన పంటలో మూడోవంతు కంటే ఎక్కువ కౌలురేటును భూస్వామి తీసుకోరాదు. భావుల క్రింద తరి, తోట భూములకు ఖుష్కి భూములకు పండిన పంటలో నాలుగోవంతు కంటే కౌలురేటు అధికంగా వుండరాదు.

ఇంతకు ముందు ఏ ఒడంబడిక జరిగి వున్నా అది రద్దు అవుతుంది. కాంగ్రెస్ పథకంలో ముఖ్యాంశాలు :

సంవత్సరానికి రూ. 3000/-ల నుండి రు.3600/-ల వరకూ, అంతకులోపు నికరాదాయం వచ్చే భూభామందులు భూమిని ప్రభుత్వం ముట్టుకోరాదు.

దాదాపు 480 మణుగుల వడ్లుగాని, తత్తుల్యమైన ఇతర ధాన్యాలు, పంట సరుకులు పండాల్సి వుంటుంది. రెండు పంటలు పండే 16 ఎకరాలు తరి భూమిలోగాని లేదా ఒకే పంటపండే 24 ఎకరాల తరి భూమిలోగాని వస్తుందని ప్రభుత్వం అంచనా. 5 ఎకరాల చెల్కాభూమి ఒకపంట పండే ఒక ఎకరం తరి భూమికి సమానం అని అంచనా.

రెండు పంటలు పండే తరి భూమి అయితే 6 ఎకరాల 16 గుంటలు, ఒకపంటపండే తరిభూమి అయితే 10 ఎకరాలు, చెల్కాభూమి అయితే 50ఎకరాలు.

ఈత, తాడి, విప్ప చెట్లపై హక్కును మాత్రం ప్రభుత్వం అట్టిపెట్టుకొంది. ఆ చెట్లపై పట్టా రైతులు నరకడంగాని, గీతగీయడంగాని చేయరాదు. విప్ప చెట్టు పువ్వు అమ్ముకోరాదు. ఆ పువ్వును సారా చేసుకోరాదు.

మామ్లాపట్టిన ముస్తాజరు పట్టాదారుకు మాలిఖానా అనబడే మొదళ్ళ పన్ను చెల్లించాలి.

ప్రభుత్వ అనాక్రమిత భూముల క్రిందకు ఈ క్రింద పేర్కొన్న భూములు వస్తాయి: అ) పోరంబోకు, బంచరాయి (గైరాన్) భూములు

ఆ) గ్రామకంఠాలు (గైవుటాన్) ఇ) ఖార్జిఖాతా భూములు (విడుదల పెట్టిన భూములు) ఈ) చెరువులోతట్టు భూములు (సికంతలాబ్)

ఉ) నదీలంకలు

ఊ) ప్రభుత్వం క్రింద వున్న ఇతర భూములు

ఖాల్సా గ్రామాలలోనే ఈ విధంగా వున్నప్పుడు ఇక జాగీరు, ఇనాం, మక్తామున్నగు ఖాల్సాగాని ప్రాంతాల రైతుల దుర్భర పరిస్థితి గూర్చి చెప్పనవసరం లేదు. ఆ ప్రాంతాలలో రైతులు ఏ హక్కులులేని ఉత్త కౌలుదారులుగానే ఇటీవల వరకు పరిగణించబడుతూ వచ్చారు. 1317వ ఫసలీలో (1907) ల్యాండు రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చినా అది జాగీరు ప్రాంతాలకు సంబంధించినంత వరకు 1355వ ఫసలీ (1945) వరకు అమలులోకి రాలేదు. ఆ ఫసలీలోనే జాగీరుప్రాంతాలలో సర్వే, సెటిల్మెంట్లు (బందోబస్తు) తప్పనిసరిగా చేయబడాలని శాసించడం జరిగింది. అయినా 1949 వరకూ గూడ ఇంకా దాదాపు 1200 జాగీరు గ్రామాలలో బందోబస్తు జరగనేలేదు. అందుచేత 1317వ ఫసలీకి (1907) పూర్వం ఖల్సా ప్రాంతాలుకాని జాగీరు మున్నగు ప్రాంతాలలో రైతుల నుండి వసూలు గావించబడే శిస్తు వాస్తవానికి భూమి శిస్తు కానేకాదు. జాగీరుదారు, ఈనాందార్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి నిర్ణయించబడే కౌలురేట్లు. 1317వ ఫసలీ (1907) ల్యాండు రెవెన్యూ చట్టం తర్వాత గూడ అదే పరిస్థితి చాలావరకు కొనసాగింది.

బందోబస్తు చేయడంలోగాని లేక శిస్తు మదింపులో గాని లెక్కల పొరపాట్లు లేక రాత పొరపాట్లు ఏవైనా వుంటే వాటిని సరిచేసుకోవడానికి భూకామందులకు బందోబస్తు అయ్యాక రెండేళ్ళవరకు వ్యవధి వుంటుంది. ఈ వ్యవధి లోపల ఆయా జిల్లా కలెక్టర్లకు అవసరమున్న భూఖామందులు దరఖాస్తు చేసుకోవచ్చును.

పాతిన రాళ్ళను పీకిపారేయడంగాని లేక వున్న చోటు నుండి మరోచోటికి మార్చడంగాని చేయడం చట్టవిరుద్ధం. అలా జరిగితే భూకామందుల నుండి రాతి ఖరీదుకు నాలుగు రెట్లు జరిమాన విధించుతారు.

శిస్తు రిమీషన్ల కోసం దరఖాస్తు చేసుకొనే విధానం : శిస్తు రిమీషనులకై దరఖాస్తులన్నీ తహశీలుదారుకుగాని లేక నాయబ్ తహశీలుదారుకుగాని పెట్టుకోవాలి. స్టాంపు బిళ్ళలు అతికించనవసరంలేదు. ఉత్త తెల్లకాగితంపై రాతపూర్వకమైన దరఖాస్తు ఇచ్చుకోవాలి. వానాకాలం పంట విషయంలో అయితే దరఖాస్తును నవంబరు 22వ తేదీ లోపలనూ, వేసవికాలం పంట విషయంలో అయితే ఏప్రిల్ 15వ తేదీ లోపలనే పెట్టుకోవాలి. ఆ తేదీలు దాటితే రిమీషను దరఖాస్తులు తీసుకోబడవు.

ఆయకట్టు నిర్ణయించడమంటే ప్రభుత్వం నీటిపారుదల వనరుల ద్వారా సప్లయి గాబడే నీటివలన సాగుఅయ్యే భూమి యింత అని నిర్ధారణ చేయడం. ఉదాహరణకు ఏదైనా ఖుష్కి భూమి ఆయకట్టులో చేర్చబడిందంటే అర్థం ఆ ఖుష్కి భూమికి యిక ముందునుండి ప్రభుత్వ నీటి సప్లయి వుంటుదన్న మాట. అందుకోసం తరి రేటు విధించబడుతుందన్నమాట.

నాటి తెలంగాణలో ప్రజలపై పన్నులు

ధనగర్ పట్టి (గొల్ల వారిపై)

దేడ్ పట్టి (మాల మాదుగులపై)

చర్మ పట్టి (తొళ్ళపై)

బొయిపట్టి (బొయిలమీదా)

షాది పట్టి (పెండ్లిలపై) హాట్ బజారీ (మార్కెట్లమీదా) కలాల్ పట్టి (కల్లు దుకాణాలమీదా) జూలాహ పట్టి (సాలే వాళ్ళపైనా) దారపట్టి (లోకల్ ఫండ్ వంటిది) రహదారీ (త్రోవ పట్టి) ఫారాల పట్టి (గడ్డి సప్లయ్క గానూ) బట్టి సబీ (కూరగాయల అమ్మకంకు) భాన్సూ పరోసి (బొంగులు అమ్ముకున్నందుకు) మజ్ఞూరి పట్టి (కూలీల మీదా) రెడ్డి రుసుం (రెడ్డిగారికి చెల్లించేది) దపన్ (పీనుగులను పూడ్చినందుకు)

తైలీపాన్ పట్టి (నూనె, తమల పాకులు) మచిలీ పట్టి (బెస్తావారిమీదా) కుంబాల పట్టి (కుమ్మరివారీ మీదా) భైంస్ పట్టి (దున్నపోతులు ఉంచుకున్నవారిపై) ఆదాం పట్టి (హిందూ శిల్ప కళాకారుల మీదా) మేహధరా (ఇంటి పన్ను) సఫర్ పట్టి (జమీందార్ గారి దౌర

1867లో సాలార్జంగ్ భూమి పన్ను విధానంలో మార్పులు తెచ్చాడు. కౌలు గుత్తా పద్ధతి తీసివేసి భూములు కొలిపించి బందబస్తు చేసి పనులు ఏర్పాటు చేశాడు. తాలుకదారులు వ్యతిరేకించారు. రెండు ఎద్దులు సేద్యగాని నుండి 5 నుండి 10 రూపాయల వరకు 4 ఎద్దుల వారికి 10 నుండి 20 రూపాయల వరకు ఇదే పద్ధతిలో వసూలు చేశారు.

ప్రజలలో ప్రతి కుటుంబంపైన ఏదో ఒక పన్ను చెల్లించాలి. పన్నులు చెల్లించలేక చాలా మంది గ్రామాలు వదిలి పారిపోతే వారిని పట్టుకవచ్చి హింసించి, పన్నులు వసూలు చేసేవారు. ఉద్యమం ప్రారంభం

ఆసఫ్జాహి వంశస్తుల పాలనలో మగ్గిపోయిన తెలంగాణ ప్రజలను జాగృతం చేయడానికి అనేక పరిస్థితులు దోహదం చేశాయి. ఈ స్థితిలో హైదరాబాద్ సంస్థానానికి చెందిన ఆఘోరనాథ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ కయాం మొదలైన ప్రముఖులు తెలంగాణ ప్రజలలో కొంత చైతన్యాన్ని కలిగించారు. కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. 20 శతాబ్ద ప్రారంభం నుండే తెలంగాణలో జాతీయ చైతన్యం కలిగింది. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి జరిగిన ప్రయత్నాల్లో ‘గ్రంథాలయోద్యమం’ మొట్ట మొదటిది. గ్రంథాలయోధ్యమానికి అది పురుషుడు కొమర రాజు వెంకట లక్ష్మణరావు 1901లో మునగాల రాజ రావిశెట్టి రంగరావు సహాయంతో హైదరాబాద్లో ‘శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయాన్ని’ నెలకొల్పాడు. ఇదే తెలంగాణలో స్థాపించిన ప్రథమ గ్రంథాలయం. తరువాత 1904లో లక్ష్మణరావు కృషి ఫలితంగా హన్మకొండలో ‘రాజరాజ నరేంద్ర భాష నిలయం’ 1905లో ‘ఆంగ్ల సంవర్ధిని నిలయం’ సికింద్రాబాద్లో వెలిశాయి. లక్ష్మణరావు గ్రాంథలయ స్థాపనతో తృప్తి చెందక అమూల్యమైన తెలుగు సాహిత్యాన్ని ముద్రించి ఆంధ్ర ప్రజలను విజ్ఞాన వంతులను చేయడానికి 1906లో హైదరాబాద్ లో విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలిని ప్రచురించారు. ఆ విధంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయోద్యమం తెలుగు భాష ప్రచారంతోపాటు నిజాం ప్రజా వ్యతిరేక ఫర్మానాలను (జీఓ లను) వ్యతిరేకిస్తూ అనేక తీర్మానాలు చేశారు. ప్రతి ఏట గ్రంథాలయ మహాసభలు జరుపుతూ తెలుగు ప్రజలను ఏకం చేశారు. ఉర్దు రాజ భాషగా ఉన్నప్పటికీ మరాఠి భాష కొంత మేరకు అమలులో ఉంది. 60 శాతం ప్రజలున్న తెలుగు మాత్రం మాట్లాడడానికి, చదవ డానికి నోచుకోలేదు. తెలుగు మాట్లాడిన వారిని హీనంగా చూసేవారు. గ్రంథాలయ మహాసభలలో ప్రభుత్వ విధానాలను భూ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కౌలుదారులకు రక్షణ కల్పించాలని, తావాన్ (జరిమాన) శిస్తులు తగ్గించాలని రాజు గారికి మెమోరాండాలు ఇచ్చారు.

ఆంధ్ర జన సంఘం స్థాపన

ఆంధ్రజన సంఘం ఒక విచిత్ర సంఘటన వల్ల ఆవిర్భవించింది. తెలంగాణాలోని జనాభాలో సగం తెలుగు వారైనప్పటికీ తెలుగు భాషకు ఆదరణ లేదు. ఉర్దూ భాష రాజభాషగా ఉండేది. మరాఠీ భాషకు కొంతవరకు ప్రాముఖ్యం ఉండేది. సభలలో సాధారణంగా ఉర్దూ, మరాఠీ భాషలలో మాట్లాడేవారు, అస్థితిలో 1921 నవంబరు 12న హైదరాబాదులో ‘వివేకవర్ధిని’ థియేటర్ లో డి.కె. కార్వే అనే పండితుని అధ్యక్షతన ఒక సభ జరిగింది. ఆ సభలో వక్తలందరూ ఉర్దూ, మరాఠీలో మాట్లాడారు. ఆ సందర్భంలో ఆల్లంపల్లి వెంకట రామారావు అనే హైదరాబాదు న్యాయవాది మాట్లాడటానికి లేచి తన ఉపన్యాసాన్ని తెలుగులో ప్రారంభించాడు. ప్రారంభించిన వెంటనే సభికులు, వక్తలందరు హేళనచేస్తూ నవ్వసాగారు. ఈ సంఘటన ఆ సభలో పాల్గొన్న తెలుగు వారందరికీ అది ఎంతో అవమానంగా అనిపించింది. ఆనాటి రాత్రి కొందరు ఆంధ్రులు టేకుమళ్ళ రంగారావు అనే ప్రముఖుని ఇంట్లో సమావేశమై తెలుగుభాష, తెలుగు సంస్కృతులను అభివృద్ధి పరచడానికై ‘ఆంధ్రజన సంఘం’ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ హైదరాబాదులో ఆంధ్ర తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసింది. దాంతో నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమం ప్రారంభమైంది. 14.02. 1922న ఆంధ్ర జన సంఘం మొదటి సమావేశం కొండ వెంకట రంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆ సమావేశంలో తెలంగాణ సాంస్కృతిక అభివృద్ధి గురించి మాత్రమే చర్చలు జరిగాయి.

ఆంధ్ర కేంద్ర జనసంఘం 1923-30

తెలంగాణా ప్రాంతంలో ఉన్న తెలుగు సంస్థలన్నీ కలిపి ఒకే సంస్థగా రూపొందించటానికి 1923లో హైదరాబాదులో ‘ఆంధ్రజన కేంద్ర సంఘాన్ని’ ఏర్పాటుశారు. బారిష్టరు రాజగోపాల చారి అధ్యక్షులుగాను, మాడపాటి హన్మంతరావు కార్యదర్శిగానూ నియమితులయ్యారు. 1923 జూలై 27న హైదరాబాదులో దీని ప్రథమ సమావేశం జరిగింది. కన్యం చగను. పత్రికల కృషి

ఆంధ్రోద్యమానికి తెలంగాణా పత్రికలు కూడా గొప్పకృషి చేశాయి. సురవరం ప్రతాపరెడ్డి ‘గోల్కొండ’ పత్రిక 1922లో సబ్నవీసు వెంకటరామ నరసింహారావు సంపాదకత్వంలో స్థాపించిన ‘నీలగిరి’ పత్రిక, అదే సంవత్సరంలో బద్దిరాజు సీతారామచంద్రరావు సంపాదకత్వంలో వెలువడిన ‘తెలుగు పత్రిక’ ఇంకా కాకతీయ, తెలంగాణ, సుజాత, శోభ, మొదలైన పత్రికలు ఆంధ్ర భాషా సాహిత్యాలకు గొప్ప సేవచేశాయి. చిలుకూరి వీరభద్రరావు రచించిన ‘ఆంధ్రుల చరిత్ర’, సురవరం ప్రతాపరెడ్డి రచించిన “ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ ఖండవల్లి లక్ష్మీరంజనం రచించిన ‘ఆంధ్రుల చరిత్ర సంస్కృతి’ ఆంధ్రుల గత వైభవాన్ని స్ఫురణకు తెచ్చి గొప్ప చైతన్యాన్ని కలిగించాయి.

ఆంధ్రమహిళా సభ

1930లో దుర్గాబాయి దేశ్ ముఖ్ మొదలైన అభ్యుదయ భావాలు కలిగిన మహిళలు ఆంధ్ర మహిళా సంఘాన్ని’ స్థాపించారు. ఈ సంస్థ నిజాం ఆంధ్ర మహా సభలతో పాటు ఆంధ్ర మహిళా సభవారు కూడా 10 సభలు జరిపారు. ఆంధ్రమహిళా సభ స్త్రీ జనోద్దరణకు స్త్రీ విద్యకు పాటుబడి తెలంగాణా స్త్రీలలో గొప్ప చైతన్యం తెచ్చింది.

ఆంధ్ర మహాసభ 1930 – 1946

తెలంగాణా ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చి స్వాతంత్య్ర సమరాన్ని జరిపిన సంస్థ నిజాం ఆంధ్ర మహా సభ. ఆంధ్రజన కేంద్ర సంఘం ‘నిజాం ఆంధ్ర మహాసభ’గా మారి తెలంగాణా స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రారంభించింది. 1930లో – జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ తను తాను ఆంధ్రమహాసభగా ప్రకటించుకున్నది. 1930 నుంచి 1946 వరకు ’13 ఆంధ్ర మహాసభలు జరిగి తెలంగాణా జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాయి. 1937లో నిజామాబాద్లో జరిగిన 6వ మహాసభలో కేవలం ఆంధ్రులేగాక నిజాం రాజ్యంలోని అన్ని రాజ్యాల భాషల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని అందరూ పాల్గొనవచ్చని ప్రకటించారు. 1940లో జరిగిన 7వ మహాసభ నిజాం ప్రభుత్వం నియమించిన అయ్యంగార్ కమిటీ సూచించిన రాజ్యాంగ సంస్కరణలను బహిష్కరించాలని, అతివాది అయిన రావి నారాయణరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా మితవాది అయిన – మాడపాటి హనుమంతరావు, కొండా వెంకట రెడ్డి, ముందుముల నరసింగరావు వ్యతిరేకించారు. కాని రావి నారాయణ రెడ్డి తీర్మానాన్ని అధికులు బలపరిచారు. దాంతో ఆంధ్ర మహాసభలో అతివాద, మితవాద – వర్గాలు ఏర్పడ్డాయి. 1944లో భువనగిరిలో జరిగిన 11వ సభలో సభ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ మహాసభకు 10 వేల మంది ప్రజలు హాజరైనారు. వామపక్ష భావాలు కలిగివారి అధిక్యతతో రావి నారాయణరెడ్డి అధ్యక్షునిగా ఎన్నికైనాడు. 12వ మహాసభ 1945లో ఖమ్మంలో జరిగింది. ఆ సభతో ఆంధ్ర మహాసభ పరిసమాప్తమై ‘సంఘంగా’ అభివృద్ధి చెందింది. అణా (6 పైసలు) చెల్లించి సంఘంలో సభ్యత్వం చేరారు. సంఘంలో సభ్యత్వం చేరిన వారు తరువాత కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు కృషి చేశారు. ఆరుట్ల లక్ష్మీనర్సింహ్మారెడ్డి, ఆరుట్ల కమలదేవి, ఆరుట్ల రాంచంద్రరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి వాళ్ళు సభ్యులుగా చేరారు. భువనగిరిలో జరిగిన 11వ మహాసభను కమ్యూనిస్టు పార్టీ సభగా కెవి రంగారెడ్డి, యం.రాంచందర్రావు అభివర్ణించారు. తెలంగాణ రైతులు మహాసభ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి దారీతీసి ప్రభుత్వ చర్య ‘బలవంతపు లెవి ధాన్య వసూళ్ళు’ కాగా ప్రజలపై అధిక పన్నుల భారం కూడా తోడైంది. మార్కెట్ ధరకు సగం మాత్రమే లెవీ ధర చెల్లించేవారు. అవి కూడా చాలా కాలానికి డబ్బులు ఇచ్చేవారు. అన్ని వృత్తులు, కులాల వారు భూస్వాములకు, అధికారులకు ఉచితంగా సేవలు అందించే బేగార్ పద్ధతి అమలులో ఉంటుంది. పల్లెల్లో అందమైన ఆడపిల్లలను దొరలకు ఉంపుడు గత్తెలుగా, బానిసలుగా, ఆడ బాపలుగా పంపె పద్దతి కొనసాగింది. ఫ్యూడల్ ధౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ ప్రజలను సంఘటిత పరిచిన ఆంధ్ర మహాసభకు ప్రజలు పెట్టుకున్న పేరు ‘సంగం’గా స్థిరపడింది. పీడిత ప్రజలంతా సంగం ఆధ్వర్యాన ఏకం కావడం సంగం ఇచ్చిన కార్యక్రమాలను అమలు జరపడం మొదలు పెట్టారు. ప్రజల మనుసులలో సంఘం బాగ నాటుకపోయింది. నైజాంను ఎదురించే ఐక్యతను సంఘం ప్రజలలో నింపింది.

రైతు పోరాటాలు ఆరంభం

మొట్టమొదటిసారి 1933 జూన్ 3వ తేదీన నల్లగొండ జిల్లా భువనగిరి నుండి 1000 మంది రైతులు హైదరాబాదుకు వచ్చి మాలు జారీ ఆఫీసుకుపోయి మెమోరాండం ఇచ్చారు. శిస్తు తగ్గించాలని, అక్రమపన్నులు నిషేధించాలని, భూమిపై సాగుదారుకు హక్కు కల్పించాలని ఉద్యమంగా వచ్చారు. రాష్ట్రంలో నీటిపారుదల కల్పించాలని కోరారు. ఏటేటా పంటల ధరలు తగ్గడాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ ఐక్యత రైతుల్లో చైతన్యం కల్గించింది. మొండ్రాయి (జనగామ-నల్లగొండ ప్రాంతాలలో) కమ్యూనిస్టు పార్టీ మరియు ఆంధ్ర మహాసభ (సంఘం) నాయకత్వాన 3000 మంది లంబాడీ రైతులు కదిలారు నర్సింహారావు దేశ్ముఖు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. 70 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. తాము సాగు చేస్తున్న భూములను రక్షించుకున్నారు.

ఎర్రబాడు దొరలుగా పేరొందిన జన్నారెడ్డి ప్రతాపరెడ్డి సూర్యాపేట ఏరియాలో లక్ష ఎకరాల భూమిపై అక్రమంగా హక్కు కలిగినట్లు తన స్వాధీనంలో అట్టిపెట్టుకున్నాడు. ఎడపెల్లి, నూతనకల్లు గ్రామాల నుండి 3000 మంది రైతులు గాజుల రాంచంద్రయ్య మరియు సంఘం నాయకత్వాన 4 గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వీరి పోరాటానికి భయపడి నాటి నైజాం ప్రభుత్వం దేశముఖ్ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి భూములు వదులుకున్నారు. దేశముఖ్ నివాసం హైదరాబాద్కు మార్చుకున్నాడు.

భూములను ఆక్రమించిన భూసాను. 1000 మంది రైతులు స్వాధీనం చేసుకున్నారు. పాత సూర్యాపేటలోని పేదల భూములను ఆక్రమించిన భూస్వామి లక్ష్మీకాంతారావుకు వ్యతిరేకంగా సంఘం నాయకత్వాన 1000 మంది రైతులు పెద్ద పోరాటం చేశారు. తమ 1000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. హుజూర్ నగర్ తాలూకాలోనే బక్కపంతులు గూడెం భూసా ఆక్రమణలో ఉన్న 500 ఎకరాల భూమిపై సంఘం నాయకుడు బలపనూరు బాపయ్యల నాయకత్వాన 1500 మంది రైతులు, ప్రజలు తిరగబడి భూమి ఆక్రమించారు. తుల గూడెం భూస్వామి భోగాలు ఘం నాయకుడు తీగెల రాం మల్లారెడ్డి గూడెం (హుజూర్ నగర్ తాలూకా) లోని గ్రామ పహరి 600 ఎకరాలు ప్రజల సాగులోనున్న భూమిని ఆక్రమించారు. సంఘం నాయు 4000 మంది రైతులు, ప్రజలు ఉద్యమం సాగించి ఆక్రమించారు. ఇదే తాలూకాలో మేళ్ళ చెరువు భూస్వామి చెమురు 600 – ఆక్రమించగా సంఘం నాయకత్వాన వీరభద్రరావు మరియు 6000 మంది – ఉద్యమం చేశారు.

ఇదే కాలంలో ఆసీఫాబాద్ ప్రాంతంలో కొమరంభీం నైజాం ప్రభుత్వంపై దాడికి దిగాడు. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నైజాం ప్రభుత్వని ముపు తిప్పలు పెట్టాడు. నైజాం అధికారాన్ని కొనసాగనివ్వకుండా ఆ ప్రాంతాన్ని స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించుకున్నాడు. నైజాం ప్రభువు ఆంగ్లేయులతో కలిసి మోసం ద్వారా 1.9.1940న కొమరంభీంను కాల్చి చంపారు. అతనితోపాటు మరో 12 మందిని కాల్చి చంపారు.

జమీందార్లపై రైతులు, ప్రజలు భౌతికంగా పోరాటాల్లోకి దిగారు.

అనేక విజయాలు సాధించారు.

జమీందారీ

జమీందారు

ధర్మాపురం

ఎరపాడు

పూసుకురు రాఘవరావు – జమీందారు

కడారి నర్సింహరావు-భూస్వామి

లంబాడీల భూముల అక్రమణ

జన్నారెడ్డి ప్రతాప్రెడ్డి

1.5 లక్షల ఎకరాలు

తడకమల్ల సీతరామచంద్రారావు

1941-44

బక్కపంతులగూడెం

భోగాల వీరారెడ్డి-భూస్వామి

వడ్డీలు

మల్లారెడ్డిగూడెం

పటేల్ పట్వారీల దోపిడి

బంజరుదార్లు

ధాన్యం లే

మేళ్ళ చెరువు

పుర తిమ్మపురం అన్వర్వాషా

భూములు ఆక్రమణ

భూములు ఆక్రమణ

ములగూడెం

భూముల ఆక్రమణ

నసికల్లు

2000 ఎకరాలు

భూముల ఆక్రమణ

పై విధంగా జమీందార్ల భూస్వాములపై పోరాటానికి రైతులు, ప్రజలు, వ్యవసాయ కార్మికులు స్వచ్ఛందంగా దాడులు చేసి తమ భూములను ఆక్రమించుకున్నారు.

కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు

1934 సెప్టెంబర్లో కాకినాడలో 7 గురితో ఆంధ్ర ప్రాంత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. చలసాని జగ్ననాథ్ రావు, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరావు, మాకినేని బసవపున్నయ్య గార్లు ఉన్నారు. 1934లో పార్టీపై నిషేధం విధించి 1948లో తొలగించారు.

1936 ఏప్రిల్లో అఖిల భారత కిసాన్ సభ ఏర్పడింది. భూస్వామ్య విధానం రద్దు కావాలనే ప్రధాన నినాదంతో పాటు ఆంగ్లేయులు భారతదేశం నుండి వెళ్ళిపోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు. మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డిల ఆధ్వర్యంలో 1922 ఫిబ్రవరి 14 ఆంధ్ర జనసంఘం ఏర్పడింది. 1930 నాటికి ఇదొక రాజకీయ శక్తిగా రూపొందింది. అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో, హైదరాబాద్లో మగ్దుం మోహియుద్దీన్ నాయకత్వాన “కామ్రేడ్స్ అసోసియేషన్” 13.12.1939న ఏర్పడింది. ఇందులో సయ్యద్ అలంకుంద్మీరి, రాజ్బహుదూర్ గౌర్, ముర్తుజా హైదర్, సయ్యద్ ఇబ్రహీంలతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటుకు బూర్గుల రామకృష్ణారావు అభినందనలు తెలిపారు. మగ్దుం మొహియుద్దీన్ రైల్వే కార్మికులతో పని చేశారు.

అప్పటికే తెలుగు భాష ప్రచారం పేరుతో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. వాటికి ఎన్నికలు, మహాసభలు జరిపారు. గ్రంథాలయ ఉద్యమం బాగా బలపడింది. భాష పేర జరిగే ఈ మహాసభలలో నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ఆ సందర్భంగానే ఏర్పడిన ఆంధ్రమహాసభలో సంఘ సభ్యులు పెద్ద ఎత్తున చేరారు. నైజాం ఈ సంస్థపై నిషేదం ప్రకటించడంతో అనేక మంది అభ్యుదయ వాదులు ఆంధ్ర జనసంఘంలో చేరారు. అతివాదుల ప్రభావం పెరగడంతో వ్యవస్థాపకులు సంఘం విడిచి వెళ్ళారు. ఆ తర్వాత సంఘం పేరుతో రైతాంగ సమస్యలు తీసుకొని ఉద్యమాలు జరిగాయి. ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీ నైజాం ప్రాంతంలో “సంఘం” పేరుతో కార్యకలాపాలు కొనసాగింది. తెలంగాణలో 1941లో పెరవెల్లి వెంకట రమణయ్య, ఎ. గురువారెడ్డి, రవి నారాయణరెడ్డి, వేములపల్లి వెంకటేశ్వర్రావు, ఆరుట్ల లక్ష్మీనర్సింహ్మారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలతో నైజాం ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. దీనికి సిహెచ్. రాజేశ్వరరావు హాజరైనారు. పెరవెల్లి వెంకటరమణయ్య తరువాత కమ్యూనిస్టు పార్టీకి రాజీనామ పెట్టి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు. 1947 వేములపల్లి వెంకటేశ్వరావు, ఆ తరువాత బద్దం ఎల్లారెడ్డి 1956 వరకు కార్యదర్శులుగా పని చేశారు. కమ్యూనిస్టు పార్టీలో సర్వదేవబట్ల, రామనాథం, చంద్రగుప్త చౌదరి, హబిబోద్దిన్, రంగసాని గోపాల్రెడ్డి, విడి దేశ్పాండే (ఔరంగబాద్)తో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది.

1944లో ఆంధ్రమహాసభ భువనగిరిలో జరిగింది. కడవెండి గ్రామం నుండి నల్లా నర్సింహ్ములు, దొడ్డి మల్లయ్య, ఎర్రంరెడ్డి మోహన్రెడ్డి, పిట్టల నర్సయ్యలు సంఘంలో చేరారు. 1944 అక్టోబర్ 3 గ్రామంలో దావూత్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. దీనికి నాయకులు ఆరుట్ల రాంచంద్రారెడ్డి వచ్చారు. కమిటీ అద్యక్షుడుగా దావూర్రెడ్డి, కార్యదర్శిగా నల్లా నర్సింహ్ములు, సభ్యులుగా యర్రంరెడ్డి మోహన్రెడ్డి, దొడ్డిమల్లయ్య, మాచర్ల కొండయ్య, మచ్చ రామయ్యలు తలా అణా(ఆరు పైసలు) చెల్లించి సంఘం సభ్యులుగా చేరారు. అప్పటికే వారం వారం ప్రజాశక్తి వారపత్రిక వస్తున్నది. విస్నూరు దొర ఉద్యమాన్ని అనిచివేయాలని నాయకుల్ని అరెస్టు చేయించాడు. సీతారాంపురంలో ఆయన తల్లి జానమ్మ వద్ద ఉన్న 80 పుట్ల వడ్లను జప్తు చేశారు. దీనితో అసహనానికి గురైన తల్లీ, కొడుకులు ఉద్యమాన్ని దెబ్బతీయాలని కక్షపెంచుకున్నారు. ఈ సందర్భంగానే చాకలి ఐలమ్మ ఆస్తిని కాజేయడానికి పధకం వేశారు.

1940లో కాశింరజ్వి అడ్వకేట్ నాయకత్వాన 60,000 మంది ముస్లింలతో రజాకార్ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. నైజాం ప్రభువుకు తమ సేవలు అందిస్తామని ‘ఇతేహదుల్ ముస్లిమీన్’ పార్టీని స్థాపించాడు. నెలవారీ ఖర్చులు తీసుకుంటూ నైజాం సైన్యాలకు తోడుగా తన సైన్యాలను జత చేశాడు. రజాకార్ అనగా వాలంటీర్ అని అర్థం. వీరు దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు విచ్చలవిడిగా చేశారు. అప్పటి నుండి 1951 వరకు నైజాంకు, భారత పోలీసులకు రజాకార్లు తోడుగా ఉన్నారు.

ఈ విధంగా ఎక్కడికక్కడ పోరాటాలు కొనసాగుతూ వచ్చాయి. ప్రజా చైతన్యం ధాటికి నిజాం సైన్యాలు, జమీందార్ల గుండాలు, రజకారు సైన్యాలు నిలబడలేకపోయాయి. చాలా విజయాలు సాధించారు. ఆ విధంగా నైజాం ప్రాంతం అంతా ప్రభుత్వ నిర్భందానికి వ్యతిరేకంగా జమీందార్లకు అనుకూలమైన ఫర్మానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ప్రజలను ఐక్యపరిచాయి. ఈ అన్ని పోరాటాలకు పరాకాష్టగా పాలకుర్తి ఐలమ్మ పోరాటం సాగింది దొడ్డి కొమరయ్య అమరత్వం – సాయుధ పోరాటం ఆరంభం

జనగాం తాలుకాలో విసునూరు రామచంద్రారెడ్డి 40 గ్రామాల భూస్వామి. 45 వేల ఎకరాలు కలిగినవాడు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలను అనేక నిర్భంధాలకు గురిచేశాడు. తన గుండాలతో దాడులు చేయించాడు. అనేక మందిపై అక్రమ కేసులు బనాయించాడు. 1945లో తన జమీందారిలో వున్న కామారెడ్డిపల్లెలోని మహమ్మద్ బందగీని హత్య చేయించాడు. అతడి అన్నను తన గుండా గ్యాంగ్ లో పెట్టుకొని కామారెడ్డి, సీతారాంపురం, కడివెండి గ్రామాలపై నిరంతరం దాడులు చేయించాడు. సీతారాంపురంలో అతని తల్లి జానమ్మ అనేక దౌర్జన్యాలను చేసింది. రైతుల చేలు లూటీ చేయించడం, పశువులను తోలుకుపోవడం చేసేది. జమీందారు రాంచంద్రారెడ్డి కడవెండిలో ఆడ గుండాలను పోగుచేశాడు. ప్రజల ఊరేగింపులను వీరు అటకాయించి ఆడ గుండాలు బూతులు తిట్టేవారు. రాళ్ళ విసిరేవారు. హిందూ మహసభ కార్యకర్తలు వీరిని తరిమికొట్టారు. గ్రామాలలో సామాన్య రైతుల నుండి లెవీ గల్లా వసూలు చేసేవారు. పండిన పంటలో సగం తక్కువ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయడమే లెవీ గల్లా ఉద్దేశం. ఆ విధంగా వసూళ్ళ చేసిన లెవీ గల్లాను ప్రభుత్వ వినియోగానికి ఉపయోగించేవారు. విసునూరు రామచంద్రారెడ్డికి చెందిన కడవెండిలోని 800 బస్తాల వడ్ల నిల్వలను జప్తు చేసి చీప్ సెక్రటరీ గ్రెగ్సను రిపోర్టు చేశారు. అతను వచ్చేవరకు ఇక్కడ ధాన్యం కాపలా కాశారు. చివరికి 6000 బస్తాలను లెవీ కింద తీసుకువెళ్ళారు. దీనిని అవమానంగా భావించాడు. తిరుగుబాటు రగిలించిన అగ్నికణం ఐలమ్మ

పాలకుర్తి గ్రామంలో సంఘాన్ని గట్టిగా బలపరిచిన చాకలి ఐలమ్మ పొలాన్ని స్వాధీనం చేసుకోవాలని జమీందారు ప్రయత్నాలు ప్రారంభించారు. అంతకు ముందురోజే పాలకుర్తిలో జరిగిన బహిరంగ సభపైకి తన గుండాలను పంపాడు. గుండాలు నాయకుడు ఒనమాల వెంకడును కార్యకర్తలు చితక తన్ని పంపించారు. ఈ ఘటనపై 14 మంది సంఘ నాయకులపై కేసు పెట్టారు. గ్రామంలో భయబ్రాంతులు సృష్టించారు. ఈ పరిస్థితులలో పొలం అక్రమణకు 100 మంది కూలీలను, 100 మంది గుండాలను పంపించాడు. సంఘ నాయకులు 23 మంది గుండాలపై దాడి చేశారు. “బ్రతుకు జీవుడా” అంటూ పారిపోయారు. అదేరాత్రి విసునూరు నుండి పోలీసులు వచ్చి ఐలమ్మ ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకువేళ్ళే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు ఎదురు తిరగడంతో ధాన్యం ముట్టుకోలేకపోయారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్ల ప్రతాపరెడ్డి, మరో ఆరుగురిని తీసుకెళ్ళి విపరీతంగా దెబ్బలు కొట్టారు. ఇంత జరిగినా ధాన్యాన్ని, పొలాన్ని స్వాధీనం చేసుకోలేకపోయాడు. పేరుమోసిన దేశ్ ముఖ్, విసునూరు రాంచంద్రారెడ్డిపై సాధించిన విజయంగా ప్రజలను ఉత్సాహపరిచింది. ఈ ఘటనపై పాటలు పాడుకుంటు గ్రామాలలో ప్రచారం చేశారు. “తన జీవితంలో ఎన్నడూ ఎరుగనంతటి ఘోర ఓటమి”గా జమీందారు భావించాడు.

దొడ్డి కొమరయ్య ఆత్మార్పణం : 1946 జులై 4

ఈ సంఘటనతో విసునూరు దేశముఖ్ బాగా రెచ్చిపోయాడు. పోలీసులు సహాయంతో కడవెండి గ్రామానికి చెందిన నాయకులను హత్యచేయాలని పథకం వేశాడు. ఈ పథకంలో భాగంగా అనేకమంది ప్రజలపై కేసులు పెట్టాడు. వారిలో 15 మందిని అరెస్టు చేయించాడు. వారు తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. ఆ రోజుల్లో ఎంత నిర్భంధం ఉన్న సరే, ప్రజలు సంఘం కార్యాలయం వచ్చేవారు. తమ కార్యక్రమాన్ని గూర్చి చర్చించుకొనే వారు. ఆ విధంగా సమావేశమై చర్చించుకొనటాన్ని అరికట్టేందుకు గాను, వారిపై కోర్టులలో కేసులు పెట్టి భయపెట్టేట్లయితే తన హత్యా పథకాలు, అమలు జరపవచ్చునని అతడు భావించాడు. పోలీసు అధికారులు, జమీందారుతోను, అతని గూండాలతోనూ, కలిసి మొత్తం పథకమంతా తయారు చేశారు. జమీందారు యధేచ్చగా వ్యవహరించటం కోసం వాళ్ళక్కడ నుండి వెళ్ళిపోయారు.

అది 1946 జూలై 4వ తేదీ తప్ప త్రాగిన గూండాలు నాయకుల ఇండ్లపై రాళ్ళు విసిరారు. ప్రజలు లాఠీలు, వడిసెలలు, చేతబూని నినాదాలు చేసుకుంటూ ఊరేగింపు జరిపారు. ఆ ఊరేగింపు ప్రధాన వీధిలోనే వున్న జమీందారు ఇంటిదాపుకు వచ్చేసరికి, జమీందారు యింటి ప్రక్కన ఒక పాకలో అప్పటికే సిద్ధంగా వున్న గూండాలు ఊరేగింపుపైకి కాల్పులు జరిపారు. ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్న గ్రామ సంఘ నాయకుడు దొడ్డి కొమరయ్యకు తుపాకీ తూటా పొట్టలో దూసుకు పోయింది. ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన అన్న దొడ్డి మల్లయ్య కాలికి తూటా తగిలి కిందపడి పోయాడు. మంగలి కొండయ్య నుదుటికి దెబ్బతగిలింది. అతని సోదరుడు నరసయ్య ముంజేతికి గాయమైంది.

అయినా ప్రజలు భయకంపితులై పారిపోలేదు. రక్తానికి రక్తం అని నినాదాలు చేసుకుంటూ వారు జమీందారు భవనాన్ని చుట్టుముట్టారు. జమీందారు భవనానికి ప్రక్కనే పాకలోవున్న గూండాలు ఆది చూచి భయపడిపోయారు. ప్రజల కోపాగ్ని నుండి తప్పుకుని బ్రతికి బయటపడటం సాధ్యం కాదని తలంచారు. జమీందారు భవనపు ఎత్తయిన గోడలు తమకు రక్షణ నివ్వగలనని భావించారు. జమీందారు భవనంలోకి దూకారు. అయితే ప్రజలప్పటికే ఆ భవనాన్ని చుట్టుముట్టారు. జమీందారు భవనానికి నిప్పంటించడం కోసం ఎండుగడ్డి మోపులతో ప్రజలు వచ్చిపడ్డారు. రెండు వేల మంది ప్రజలక్కడ చేరారు. కొంతమంది గడిని చుట్టుముట్టారు. మరికొంతమంది ఊరి వెలుపల కాపలా కాస్తున్నారు. ఇంకా కొందరు గ్రామవీధులలో తిరుగుతున్నారు. ప్రజల ఆగ్రహంతో అట్టుడికిపోతున్నారు. ఈ వార్త విని, విసునూరు రామచంద్రారెడ్డి కొడుకు బాబూరావు (జగన్ మోహన్) విసునూరు నుండి, కత్తులు, బల్లేలు, పిస్తోళ్ళు చేతబూని 400 మంది గూండాలను

తీసుకొచ్చాడు. గ్రామం వెలుపల కాపలా కాస్తున్న ప్రజలు వాళ్ళను చూసి ఆకాశం దద్దరిల్లేటట్లు నినాదాలు చేశారు. వడిసెలతో రువ్వుతూ మూకుమ్మడిగా గూండాల మీదికి వెళ్ళారు. ఆగ్రహావేశపరులైన జనసామాన్యాన్ని చూచిన గూండాలు, తుపాకీ కాల్పులు సహితం ప్రజల పురోగతిని ఆపజాలవని ఉహించారు. ప్రాణాలు దక్కితే చాలునని కాలికి బుద్ధి చెప్పి పారిపోయారు. ఊరు ప్రజలు వాళ్ళను మూడు మైళ్ళ దూరం తరిమి కొట్టారు. అనేక మంది గూండాలకు రాళ్ళదెబ్బలు తగిలాయి. వాళ్ళలో చాలామంది, పారిపోతూ మాదాపురం తండాలో దాగున్నారు. అయితే, అచ్చటి ప్రజలు పరిస్థితిని గమనించి ఆ గూండాలను తరిమి వేశారు. పేరుమోసిన గూండా అనుముల రామిరెడ్డిని ఒకచోట పట్టుకున్నారు. భీమిరెడ్డి నరసింహా రెడ్డి, సి. యాదగిరిరావు తదితరుల నోళ్ళలో మూత్రంపోసిన వాళ్ళలో వాడూ వొకడని తెలిసిన ప్రజలు అతనిని చితకదన్ని పంపించారు. గూండాలు ఎక్కివచ్చిన బండ్లను ముక్కలుముక్కలు చేశారు. జమీందారు మామిడి తోటలో ఒక్క చెట్టయినా మిగల కుండా నరికేశారు.

సరిగ్గా అదే సమయంలో 60 మంది రిజర్వు పోలీసులు ఆ గ్రామానికి వచ్చారు. గూండాల పై తాము చర్య తీసుకుంటామని ప్రజలకు చెప్పారు. వారిని అక్కడి నుండి వెళ్ళిపొమ్మన్నారు. ప్రజలచ్చటి నుండి చెదిరిపోయిన తర్వాత గూండాలను సురక్షితంగా జమీందారుకు అప్పగించారు. ఇదంతా జరిగిన తర్వాత సంఘ నాయకులపై ఆరు కేసులు పెట్టారు. గూండాలపై దాడి చేశారని, గడీని చుట్టుముట్టారని, దానికి నిప్పంటించటానికి ప్రయత్నించారని ఆరోపణ చేశారు. గూండాలలో ఎవరినీ అరెస్టు చేయలేదు. వాళ్ళ మీద ఏ కేసూ పెట్టలేదు. అయినా ప్రజలు చలించలేదు. దొడ్డి కొమరయ్య మృతదేహానికి, శవపరీక్షానంతరం వేలాది ప్రజలు ఆ గ్రామాలన్నింటా పెద్ద వూరేగింపు జరిపి అంత్యక్రియలు జరిపారు. పరిసర గ్రామాల ప్రజలు కూడా ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. జమీందారు ఎదుట తాము తలవంచేది లేదని, సంఘం కోసం తామంతా ఇనుమడించిన శక్తితో పనిచేస్తామని వారంతా ప్రతినబూనారు. ఆ తర్వాత మూడు నెలల కాలంలో వారు, జమీందారు మనుషులను పొలాలలోకి రానివ్వలేదు. పనిచేయ నివ్వలేదు. ఈ సంఘటన అనంతరం అమర వీరుని శ్లాఘించే పాటలు పాడుకుంటున్నారు.

దేశ్ముఖ్ రాంచంద్రారెడ్డి కొడుకు బాపురెడ్డి హైదరాబాదు పారిపోతుండగా జనగామ రైల్వేస్టేషన్లో చంపివేశారు. ప్రజల ప్రతిఘటన 300-400 గ్రామాలకు వ్యాపించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ప్రదర్శనలు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ పత్రిక విస్తృత ప్రచారం చేసింది. పోలీసులు 156 కేసులు నమోదు చేశారు. జనగామ, సూర్యాపేట, దేవరుప్పల, హుజూర్ నగర్ లో మిలట్రీ దాడులు కొనసాగాయి. జిల్లాను మిలట్రీపరం చేశారు. వారాలు, నెలల తరబడి ఈ దాడులు సాగాయి. రజాకార్లు, పోలీసులు ఇండ్లు లూటీలు చేశారు. వీరి దౌర్జన్యాలను తిప్పి కొట్టడానికి రైతులు, ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు

11.09.1946వ తేదీన సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వబడింది. వర్గపోరాటం ప్రారంభమైంది. అన్ని కులాల వారు, మతాల వారు సంఘం నాయకత్వాన ఏకమై పోరాడారు. తమ మధ్యనున్న కుల వివక్షతలు, మత వివక్షతలు పక్కనబెట్టారు. పోరాటంలో అంటరానితనం మ హిళలు, పురుషులూ అన్న భేదభావం లేదు. అన్ని వర్గాల నుంచీ బాలురూ, బాలికలు పాల్గొన్నారు. దానితో గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి. సంఘం నాయకత్వాన గ్రామాలలో కమిటీలు, శాఖలు ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ తిరుగుబాట్లు ప్రారంభమయినాయి. దీంతో దేశముఖ్ లు, భూస్వాములు పట్టణాలకు పారిపోయినారు. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల పోరాటానికి కీలక కేంద్రంగా తయారైంది. కరీంనగర్ లోని భూస్వాములంతా ప్రాణభయంతో హైదరాబాద్ బాట పట్టారు. భూస్వాముల భూములను పేదలు ఆక్రమించారు.

కొమరయ్య మరణం, అమరత్వం తెలంగాణా రైతాంగంలో నిద్రాణమై వున్న అగ్రహాన్ని ప్రజ్వరిల్ల జేసింది. నల్గొండ జిల్లాలోని అన్ని తాలూకాలలో ప్రజలు ఒక్కుమ్మడిగా విజృంభించారు. జిల్లా అంతటా జరిగే అన్ని సభలలోనూ, ప్రదర్శనల లోనూ ఈ అమరనీరునికి జోహార్లర్పించే పాటలు పాడారు. కర్రలు, వొడిసెలను ధరించి ప్రజలు ఒక గ్రామానికి జెందినవారు మరొక గ్రామానికి వెళ్ళి వస్తూ వుత్తేజం కలుగజేసేవారు. వారు ఉమ్మడిగా భూస్వామి గడిముందు బహిరంగ సభలు జరిపేవారు. ఎర్రజెండాను ఆవిష్కరించేవారు. “ఇక్కడ సంఘం ఏర్పాటు చేయ బడింది. వెట్టి, అక్రమ నిర్బంధ వసూళ్ళు, బేదకళ్ళు ఇంకెంతమాత్రం సాగవు” అని ప్రకటించారు. భూస్వామి గాని, దేశ్ముఖ్ గానీ సంఘం యొక్క ఈ ఉత్తర్వులను అమలు జరపకపోతే అతనిని సాంఘిక బహిష్కారానికి గురిచేసేవారు. అతని పొలాలలో ఎవరూ పనిచేయటానికి వీలులేదు. క్షురకులుగానీ, రజకులుగాని ఇంటిపని వాళ్ళుగాని, ఇతర పనివాళ్ళుగాని ఎవరూ వారికి ఏ పని చేయటానికి వీలులేదు.

ఈ వూరేగింపులు, జమీందార్ల ఇండ్లముందు నిలిపి, “జమీందారీ విధానం రద్దుకావాలి,” “భూస్వాముల పీడనకు, పోలీసు జులుముకు స్వస్తిజెప్పాలి,” “నిర్బంధ ధాన్య సేకరణను, వెట్టిని, అవినీతిని అంతంజేయాలి,” “అమరజీవి దొడ్డి కొమరయ్య జిందాబాద్” మొదలగు నినాదాలు చేసేవారు. తమ చేతుల్లోని గుతకర్రలన్నింటిని ఒక్కుమ్మడిగా నేలపై కొట్టి పెద్ద శబ్దం చేసేవారు. ఆ శబ్దం యావత్తు గ్రామాన్ని దద్దరిల్ల జేసేవి. ప్రజాద్రోహుల గుండెల్లో కంపరమెత్తించేవి. “గుత్పల సంఘం” అని వాళ్ళు పిలుస్తుండే సంఘ నివాదాలు వినపడగానే, ఈ ప్రజా ద్రోహులు తలుపులు మూసుకొని, లోపల కూర్చొని తాళాలు పెట్టుకునేవారు. ఈ వూరేగింపులలోగల ప్రత్యేక లక్షణాలలో వొకటి ఏమిటంటే, “పురుషులతో పాటు స్త్రీలు కూడా తమ గ్రామాలలోనేగాక, ఇతర గ్రామాలలోనూ పాల్గొనటం” జరిగింది. చాకలి ఐలమ్మ భూమి పోరాటంపై రాసిన పాటలు మహిళలను అత్యధికంగా ఆకర్షించాయి. మొట్టమొదటిసారి భూమి, బేదఖళ్ళు, వెట్టి, నిర్బంధ ధాన్య సేకరణ వంటి జీవిత సమస్యలను జమీందారీ రద్దు నినాదాన్ని జోడించటం జరిగింది. ఈ దశలో ప్రధానమైన అంశమిది.

ఈ గ్రామోద్యమ వెల్లువలో ప్రభుత్వం లెవీ ధాన్యం సేకరించలేకపోయింది. లెవీ ధాన్యం వసూలు చేస్తుండే అధికారులను గ్రామంలో అడుగయినా పెట్టనివ్వటం లేదు. అదేవిధంగా వెట్టికూడా దానంతటదే అంతమయింది. వెట్టి చేయించుకుంటూ వచ్చిన దేశముఖులు, గ్రామాధికారులు, గ్రామాలు వదలి వెళ్ళిపోవలసి వచ్చింది. వాళ్ళు ఊళ్ళోనే వున్నా తలెత్తుకు తిరగలేకపోయేవాళ్ళు. కొలది వారాలలోనే ఈ ఉద్యమం నల్గొండ జిల్లాలోను, పొరుగునే వున్న వరంగల్లు (ఖమ్మం) జిల్లాలో మూడు నాలుగు వందల గ్రామాలకు వ్యాప్తి గాంచింది. పోరాట విస్తరణ

సాయుధ ప్రతిఘటనోద్యమం

15 ఆగష్టు 1947 – 13 సెప్టెంబర్ 1948 వరకు

తెలంగాణ సాయుధ పోరాటం ప్రకటన తరువాత పోలీసులు బీభత్సకాండ కొనసాగింది. అరెస్టులు, గ్రామాలపై సాయుధ పోలీసులు దాడులు ప్రారంభమయ్యాయి. అదే సందర్భంలో ప్రజల ప్రతిఘటన కూడా పెరిగింది. దళాల నిర్మాణం-శిక్షణ గరపడం తుపాకులు తక్కువ వినియోగం – కర్రలు, కత్తులు, వడిసెలలు, కొడవండ్లుతో ఆత్మరక్షణ చేసుకోవడంతో పాటు పోలీసులపై, జమీందారి గుండాలపై, రజాకారు ముష్కరులపై ఎలా దాడులు చేయాలో నేర్పారు. ఈ దాడులలో ముఖ్యంగా గెరిల్లా పద్దతులను నేర్పారు. సూర్యపేట, పాత సూర్యపేట మరికొన్ని గ్రామాలలో 144వ సెక్షన్లు పెట్టారు. నల్లా నర్సింహులు, మోహన్రెడ్డి, మంగలి కొండయ్య, లింగయ్యలను పట్టుకోవడానికి పోలీసులు వెతుకులాట పెట్టారు. అనతికాలంలోనే ఉద్యమం నైజాం అంతట వ్యాపించింది. ప్రతి దాడులు జరిగాయి. జనగాం, దేవరుప్పుల, హుజూర్నగర్, మల్లారెడ్డినగర్ గ్రామాలలో దాడులు జరిగాయి, ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ పోరాటానికి ప్రతిజ్ఞ చేసింది.

సామ్రాజ్యవాదుల నుండి భారత బూర్జువా వర్గానికి స్వాతంత్య్రం సిద్దించినా నైజాం ప్రాంతానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. నైజాంలో వున్న కాంగ్రెస్వేరు పటేల్, పట్వారీలు రాజీనామా ఇవ్వాలని పిలుపిచ్చారు. భారత, నైజాం ప్రాంతాల మధ్య కస్టమ్స్ విధి విధానాలు రద్దు చేయాలని తాటి, ఈత చెట్లను నరికి వేయాలని పిలుపునిచ్చారు. గీత కార్మికులు నష్టపోతారని కమ్యూనిస్టు పార్టీ చెట్ల నరికివేతను నిలుపుదల చేసింది. పన్నులు చెల్లించవద్దంటూ పార్టీ పిలుపునిచ్చింది.

వ్యవసాయ కార్యక్రమం

అన్ని రకాల నిర్భంధ చాకిరి నిర్భంధ వసూళ్ళకు స్వస్తి చెప్పాలి.

నిర్భంధ లెవి ధాన్యం చెల్లింపులు రద్దు చేయాలి.

కౌలుదారులకు హక్కులు – కౌలు తగ్గింపు అక్రమణ చేయాలి. – కౌలు చెల్లించకుండా భూముల

1 బడా భూస్వాముల ప్రభుత్వ బంజర్ల అక్రమణను బయటికి తీయాలి. దుర్మార్గ భూస్వాముల వద్దగల ధాన్యన్ని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి. –

– పటేల్, పట్వారీల రికార్డులు, వడ్డీ వ్యాపారుల రికార్డులు దగ్ధంచేయాలి.

భూస్వాముల మిగులు భూములు అక్రమించాలి. 500 ఎకరాల సీలింగ్ను 100 ఎకరాలకు తగ్గించాలి. దీనితో గూటుపాల సంఘం మళ్ళి కదిలిందని ఉత్సమపడ్డారు. కాంగ్రేస్-సిపిఐ – ఆంధ్ర మహాసభకు చెందిన దళాలన్ని ఆయుధాలు సమకూర్చుకున్నాయి. నైజాం పాలన పునాదులన్ని కదిలాయి. నైజాం బీభత్స కాండకు పూనుకున్నాడు. కాశీం రజ్వీ నాయకత్వాన దళాలు ఏర్పాటు చేసి నైజాం సైన్యానికి అండగా నిలిపాడు. లూటీలు, గృహ దహనాలు, హత్యలు, మానభంగాలు విచ్చల విడిగా సాగాయి. ఈ నిర్బంధం వలన ధనికులు భూస్వాములు భారత భూ భాగంలోకి వెళ్ళిపోయారు. ఫ్యూడల్ వ్యతిరేక – భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటం వూపందుకుంది. పార్టీ దళాలు చాలా వరకు కాంగ్రేస్ దళాలను నిరాయుధం చేయాల్సి వచ్చింది. నిజాయితీపరులు పార్టీలోకి వచ్చారు. భారత ప్రభుత్వం నైజాంతో గుట్టుచప్పుడు కాకుండా ఒప్పందం చేసుకొని మందుగుండు సరఫరా చేసినట్లు చాల సాక్ష్యాలు ఉన్నాయి.

10 వేల మంది సభ్యులతో కూడిన గ్రామ దళాలు, 2000 మందితో గెరిల్లా దళాలు ఏర్పాటు చేశారు. 10, 15 గ్రామాలకు చెందిన వేలాదిమంది జాతీయ జెండాలు, ఎర్ర జెండాలు ఎగురవేస్తూ గ్రామాల యాత్రలు చేశారు. హుజూర్ నగర్, సూర్యపేట, తుంగతుర్తి, వంగపల్లి స్టేషన్లపై దాడి చేశారు. రజాకార్ దళాలు ‘ఆజాద్ హైదరాబాద్’ నినాదంతో ప్రచారం చేశారు. పార్టీ 1. గ్రామ దళాలు 2. నిర్మూలన దళాలు 3 గెరిల్లా దళాలు ఏర్పాటు చేయగా వేల మంది చేరారు. రావులపెంట క్యాంపు, ఎరబాడు క్యాంపుపై దాడులు చేశారు. పోలీసులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోటపాడు, ఊదరబాంబు దాడి రజాకార్లను అడలుకొట్టింది. మామిళ్ళగూడెం కాంపు, బిక్కుమల్ల, మామిడితోట, చిన్న నెమలి, పేద్ద నెమలి, చిట కోడూరు, పులిగిల్ల, అడ్డగూడూరు, జనగాం, కొండూరు, పాత భువనగిరి, ఎర్రబెల్లి, వరంగల్, కొత్తకొండ, బైరాన్పల్లి, వర్ధన్నపేటలలోని పోలీస్ క్యాంపులపై దాడులు చేశారు. ఖమ్మం, మధిర, కొత్తగూడెం, పాల్వంచలలో భూమి ధాన్యం పేదలకు పంచారు. మానుకోట, కోదాడ, కల్లూరు అడువులలోనూ దళాలు కేంద్రీకరించి దాడులు చేశాయి. కరీంనగర్ అమరజీవి ప్రభాకర్రావు (పోలంపల్లి గ్రామం), రేణిగుంట రాంరెడ్డి, గోపాల్రెడ్డి, బొగ్గుగని నాయకులు శేషగిరిరావు, యాదగిరి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. నైజాం ప్రాతంలోని 3వ వంతు భూ భాగంలో 3 వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. దున్నేవారికే భూమి, బంజరు భూముల పంపిణీతో 10 లక్షల ఎకరాల భూమిని అక్రమించారు. ఆనాటి పార్టీ కార్యదర్శి అజయ్కుమార్ ఘోష్ గ్రామ కమిటీల నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తాకట్టు భూముల విడుదల, పశువుల పంపిణీ, రుణ పత్రాల రద్దు, వ్యవసాయ కార్మికుల వేతనాల పెంపు, పన్ను వసూళ్ళ రద్దు సాధించారు. స్త్రీలకు సమాన హక్కులు, అంటరానితనం నిర్మూలన, సాంస్కృతిక పురోగమనం, పట్టణాలతో వర్తకం చేపట్టారు.

చారిత్రాత్మక బైరాన్పల్లి పోరాటం

బైరాన్పల్లి ప్రజాపోరాటం తెలంగాణా ప్రజాపోరాట చరిత్రలోనే అత్యున్నత స్థాయికి చెందినది. ఆ గ్రామంలో ప్రతి పురుషుడు, స్త్రీ, యువకుడు, వృద్ధుడు ఈ పోరాటంలో పాల్గొన్నారు. శత్రువుపై అడుగడుగునా పోరాటం సాగించారు. ఆ గ్రామమే ఒక భయంకర యుద్ధరంగంగా మారింది. ఈ గ్రామంలో ఎత్తయిన బురుజొకటుంది. ఇది చాలా పురాతనమైనప్పటికీ కోటవలె చాలా బలంగా వుండి, దానికి మెట్లు లోపలివైపునే వున్నాయి. ఈ బురుజు పై నుండి గ్రామం నలువైపులా చాలా దూరం వరకు పరికించి చూడవచ్చు. ఆ బురుజు పైన ఒక పెద్ద రణభేరి, ఒక పెద్ద దేశవాళి తుపాకి, ఒక కరబ్బీ అమర్చబడి వున్నాయి. తుపాకి మందుతో నింపిన గోనె సంచులు, సీసపుగుండ్లు కూడా అక్కడ నిలవచేయబడి వున్నాయి. ఆ బురుజు పైన ఒక దళం ఎల్లప్పుడూ వుంటూ వుండేది. వారి వద్ద తగినన్ని తుపాకులు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి వున్నాయి. శత్రువుగనుక బురుజును సమీపించ గలిగినట్లయితే వాళ్ళు పైకెక్కకుండా క్రింద పడవేయడం కోసరం దళం వద్ద ఈటెలు, కర్రలు, రాళ్ళు, వడిసెలలు, మరుగుతున్న నీళ్ళు సిద్ధంగా వుండేవి. వారు గ్రామానికి అన్ని వైపులా సెంట్రీలను ఏర్పాటు చేశారు. ప్రతిరోడ్డుమీద ఒక దళం ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా వుండేది. ఏ క్షణంలోనయినా శత్రువుతో పోరాడటానికి వారు సర్వసన్నద్ధంగా వుండేవారు. వాళ్ళకు సహాయపడటానికి, వాళ్ళను కట్టుదిట్టంగా నడపటానికి ఒక గెరిల్లాదళం అక్కడ వుండేది.

ఒకరోజున లద్దనూరు క్యాంపునుండి సుమారు 60 మంది రజాకార్లు, పోలీసులు వచ్చి గ్రామంపై దాడిచేశారు. బురుజుపై నున్నవారు భేరీ మోగించారు. తను నాటు తుపాకిని, కరబ్బీని వుపయోగించి కాల్పులు జరిపారు. యుద్ధనినాదాలు చేశారు. శత్రువు దిమ్మరపోయి గ్రామానికి కొలది దూరంలోనే నిలిచిపోయాడు. ఈలోగా రెండు వందలమంది ప్రజలు వడిసెలలు, బర్మార్లు తీసుకొని శత్రువుమీదికి నడిచారు. కొంత సేపు ముఖాముఖి పోరాటం జరిగింది. అయితే ప్రజలధాటికాగలేక శత్రువు పారిపోయాడు. మరొకరోజున ఒక క్యాంపునుండి సుమారు 70 మంది రజాకార్లు, పోలీసులు ఆ గ్రామంపై తిరిగి దాడిచేశారు. ప్రజలను ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో వచ్చారు. అయితే ఈసారికూడా ప్రజలు సన్నద్ధంగా వుండి, వాళ్ళను ఎదుర్కొన్నారు. స్థానిక దళసభ్యుల్లో ఒకరు సింహంవలె శత్రువుపైకి దుమికాడు. రజాకారు చేతిలో రైఫిల్ పట్టుకొని అతని పొట్టలో తన్నాడు. అయితే ఈ పోరాటంలో రైఫిల్ ప్రేలింది. ఆ కామ్రేడ్ కు దెబ్బతగిలింది. అయినా ఆయన రైఫిల్ వదలలేదు. ఈపాటికే ప్రజల ఆగ్రహానికి తాళజాలక శత్రువు పారిపోనారంభించాడు. ఆ రజాకారు గూడా తన రైఫిల్ని వదిలి పెట్టి పారిపోయాడు. దళానికి రైఫిల్ చిక్కింది. చికిత్సానంతరం ఆ కామ్రేడ్ కోలుకున్నాడు. పోరాటంలో తిరిగి పాల్గొన్నాడు. ఆ గ్రామంపై దాడిచేయాలని రజాకార్లు అనేకసార్లు ప్రయత్నించారు. పోరాడటానికి ప్రజలు సన్నద్ధంగా వుండటం చూసి వెనుదిరిగిపోయారు. తమ గ్రామాన్ని కాపాడుకోవాలని ఈ గ్రామ ప్రజలు ప్రదర్శించిన దృఢదీక్ష ధూళిమిట్ట, ఆకునూరు, లింగాపురం, కూటిగల్లు మొదలైన గ్రామాలకు కూడా వ్యాప్తిగాంచింది. భేరీ మ్రోగితేచాలు ఒకచోట చేరడానికి వారు అలవాటు పడ్డారు. శత్రువు వెళ్ళిపోయిన తరువాత వారు తిరిగి వచ్చేవారు. బలమైన శత్రువును ఎలా ఎదుర్కోవాలో, భూమిపై బోర్ల పండుకొని శత్రువు కాల్పులను ఎలా తప్పించుకోవాలో మున్నగు విషయాల్లో వారు సైనిక శిక్షణ పొందారు. ఒకరోజున గెరిల్లా దళం గ్రామంలో వుంది. వారు వేరుశెనగ కాయలు తింటున్నారు. ఉదయం 8 గంటల సమయంలో రెండు వందల మంది రజాకార్లు, పోలీసులు దాడి చేయడానికి వచ్చారు. గెరిల్లాలు బురుజు పైకి ఎక్కారు. బురుజు పైనుండి నాటు తుపాకితో, కరబ్బీతో, రైఫిల్తో కాల్పులు జరిపారు. ఈ కాల్పులు కొంత సేపు సాగాయి. అప్పుడు గెరిల్లాలకు కామ్రేడ్ రేణిగుంట రామిరెడ్డి పోరాటానుభవం గుర్తుకు వచ్చింది. తాము దెబ్బగాచుకొనే స్థితిలోనే వుండేట్లయితే తమ వద్దగల తూటాలు అయిపోతాయని తాము శత్రువు చక్రబంధంలో యిరుక్కుపోతామని తలంచారు. అందువల్ల వారు బురుజు పైనుండి దిగివచ్చారు. గోడలను మాటుచేసుకొని, శత్రువుపై గురిచూసి కాల్పులు జరిపారు. ఒక యింటికి నిప్పంటిస్తున్న పోలీసు చచ్చి క్రింద పడ్డాడు. బురుజు పైనుండి, గోడల వెనుకనుండి కాల్పులు సాగుతూనే వున్నాయి. ఐదుగురు పోలీసులు మృతిచెందారు. శత్రువును ఊపిరి సలుపుకో నివ్వలేదు. దాంతో తమ వాళ్ళ మృతదేహాలను తీసుకొని శత్రువులు కాలికి బుద్ధి చెప్పారు.

కొలది రోజుల తరువాత శత్రువు మరింత పెద్ద ఎత్తున దాడికి వస్తున్నట్లు కబురందింది. ప్రజలూ దళమూ అంతా సిద్ధం ఉన్నారు. ఒకరోజు వేకువనే 500 మంది రజాకార్లు, పోలీసులు గ్రామాన్ని ముట్టడించారు. బురుజు పైనుండి గోడల మాటున శత్రువు వెనుక భాగాన్నుండి, గ్రామం వెలుపలినుండి శత్రువుపై కాల్పులు జరిపారు. బురుజు పైనున్న వారిని, గురిజూచి కాల్చాలని ఒక పోలీసు చెట్టెక్కాడు. ప్రజల రైఫిల్ తూటా దెబ్బ తగిలి అక్కడక్కడ నుండి వచ్చి క్రిందపడ్డాడు. శత్రువులు అతని శవాన్నయినా తీసుకుపోలేక పోయారు. శత్రుబలగంలోని మరో 9 మంది మరణించారు. వాళ్లు 9 మంది శవాలను మోసుకెళ్ళలేక ఊరిబయట సూతిలో పడవేసి పారిపోయారు. మరొక రోజు ఉదయం రెండు వందల మంది రజాకార్లు, పోలీసులు ఆ గ్రామంపై తిరిగి ముట్టడి చేశారు. అశ్వారూఢుడైన ఒక పోలీసు రైఫిల్ చేతబట్టుకొని చుట్టూ తిరుగుతున్నాడు. బురుజు పై నుండి మామూలు ప్రకారం భేరీ మ్రోగింది. కాల్పులు ప్రారంభమైనాయి. గెరిల్లా దళం గ్రామం వెలుపల సూమిడితోటలో వుంది. వాళ్ళు పోలీసులకు కనిపించకుండా నేలపైనే ప్రాకుతూ గుర్రం మీదవున్న పోలీసు వాడికి గురి బెట్టి కాల్చారు. అతడు చచ్చిపడ్డాడు. మరికొంత మంది మరణించిన తరువాత, యింకా కొందరు గాయపడిన తరువాత ఆ శవాలను, గాయపడిన వారిని పోగు చేసుకొని శత్రువు కాలికి బుద్ధి చెప్పాడు.

బైరాన్ పల్లి, కూటిగల్లు, గ్రామాల పై దాడి చేయడం కోసం జనగామకు పెద్ద సైనిక బలగం దిగింది. గెరిల్లాలు గ్రామం విడిచి పోవాలని, ప్రజలు గూడా గ్రామాన్ని ఖాళీ చేయాలని ఒక ముఖ్యమైన కామ్రేడ్ ద్వారా పార్టీ నాయకులు కబురు పంపించారు. అయితే ఈ ఆదేశాలు అమలు జరగలేదు. ఉదయం 6 గంటలకల్లా, సైన్యం గ్రామాన్ని చుట్టు ముట్టి కాల్పులు సాగించనారంభించింది. సైన్యం పైకి ప్రజలు కూడా కాల్పులు సాగించారు. అయితే సైనికుల కాల్పులు పోలీసుల కాల్పుల వంటివి కాదు. సైన్యం వద్ద ఫిరంగులు, బ్రెన్ గన్లు, మంటల బాంబులు తదితర అధునాతన ఆయుధాలనేకం వున్నాయి. గురిజూచి నిశితంగా కాల్పులు జరుపుతున్న ప్రజల చేతుల్లో కొందరు సైనికులు కూడా మృతిజెందారు. అలా మృతి జెందినవారిలో ఫిరంగులు ప్రేల్చుతున్న సైనికులు కూడా వున్నారు. సైన్యం తన దృష్టిని గెరిల్లాల పైన కేంద్రీకరించింది. మంటల బాంబులు, ఫిరంగులు, బ్రెన్ గన్లు పేల్చింది. దళం ఇకనక్కడ తట్టుకొని నిలవజాలకపోయింది. శత్రువుల తుపాకి దెబ్బకు అందకుండా వుండేంతదూరం వెనుకడుగువేశారు.

గ్రామంలో, బురుజుపైనున్న వారు నాటు తుపాకితో, క్రింది అంతస్తునుండి కరబ్బీతో, శత్రువుపై కాల్పులు సాగిస్తూనే వున్నారు. గోడలను మాటు జేసుకుని ప్రజలు పోరాడుతూనే వున్నారు. ఈ పోరాటంలో ఒక మిలటరీ కెప్టెన్ తో సహా 13 మంది మృతిజెందటమో, గాయపడటమో జరిగింది. అయితే శత్రు ఫిరంగులముందు ప్రతిఘటన సన్నగిల్లజొచ్చింది. బురుజు పై అంతస్తుకు పెద్ద గండికొట్టబడింది. పై అంతస్తు మీది నుండి నాటుతుపాకితో కాల్పులు జరుపుతున్న ముగ్గురు కామ్రేడ్స్ మోటం పోశాలు, మోటం రాములు (అన్నదమ్ములు), బలిజెనాగయ్య మృతిచెందారు. మిగతావారు క్రిందికి దిగివచ్చారు. ప్రజలలోను, స్థానికదళ సభ్యులలోనూ మరి కొంతమందికూడా మృతిచెందారు. శత్రువు చాలా శక్తివంతంగా వున్నవిషయం, ఆధునాతన ఆయుధాలన్నింటిని కలిగివున్న విషయం గుర్తించిన మీదట అనేకమంది ప్రజలు తప్పుకున్నారు. 80 మంది ప్రజలను నిర్బంధించి కట్టివేసి మరతుపాకితో కాల్చి చంపారు. వీరోచితంగా పోరాడిన కొందరు యువకులను నిర్దాక్షిణ్యంగా హింసలపాలుజేసి, ఆ తరువాత కాల్చి చంపారు.

మరునాటి ఉదయం పరిసరాలనుండి గెరిల్లా దళాలు ఆ గ్రామానికి వచ్చేసరికి అక్కడ 88 మృతదేహాలు పడివున్నాయి. గెరిల్లాలు ప్రజలకు ధైర్యం జెప్పి ఓదార్చారు. మృతవీరులకు అంత్యక్రియలు జరిపారు. ప్రజలంతా అంత్యక్రియల్లో పాల్గొని అమరవీరులకు జోహార్లర్పించారు. పోశాలు, రాములు తండ్రి ఇద్దరు కుమారులను కోల్పోయిన దుఃఖాన్ని దిగమ్రింగి ఈ హంతకుల పైనా, ప్రభుత్వం పైనా పగసాధించవలసిందిగాను, అంతిమ విజయం లభించేంతవరకు పోరాడవలసిందిగాను ఆ ప్రాంతీయ కమాండరుకు విజ్ఞప్తి చేశాడు. మరొక రణరంగం కూటిగల్లు

జనగామ తాలూకా కూటిగల్లు గ్రామంపై రజకార్లు, బైరాన్ పల్లి గ్రామంమీద జరిపినట్లే అనేక మారులు దాడులు జరిపారు. అచటి ప్రజలు వాళ్ళపై జయప్రదంగా పోరాటం సాగించారు. బురుజుపై అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రజాకార్లను పోలీసులను తిప్పికొట్టారు. గెరిల్లా దళంకూడా వాళ్ళకు తోడ్పడుతోంది. ఆ గ్రామానికి చెంది అక్కడినుండి వెళ్ళిపోయిన రజాకార్లు, పోలీసులు తమ పశువులను తోలుకొని పోవడానికి ఒకసారి ఆ అడుగు పెట్టనివ్వలేదు. ఒక కామ్రేడ్ ఒక ఈటెకు తాటి గొడ్డలితో యిద్దరు రజాకార్లను అక్కడికక్కడే మరొక గ్రామానికొచ్చారు. ప్రజలు రణభేరి మ్రోగించారు. ప్రజలు వాళ్ళను గ్రామంలో అడుగు పెట్టనివ్వలేదు. ఒక కాపై పండును గ్రుచ్చి ‘బాంబు బాంబు’ అని అరుస్తూ వాళ్ళ వెంటబడ్డాడు. రజాకార్లు భయకంపితులై, అరుస్తూ వాళ్ళ వెంటబడ్డాడు. రజాకార్లు భయకంపితులై పారిపోయారు. పారిపోతుండగా తమకు కనిపించిన ఒక గ్రామస్థునిపై దాడిచేశారు. ఆయనకు ఆగహం వచ్చి తన చేతిలో వున్న గొడ్డలితో యిద్దరు రజాకార్లను చావకొట్టారు. మిగతా వాళ్ళంతా ఆయన పైబడి కనుగ్రుడ్లు తోడారు. ఆ తరువాత గొడ్డలితో ఆయనను ముక్కలు ముక్కలుగా నరికారు. అప్పటినుండి కర్రగాని, గొడ్డలిగాని చేతిలోవున్న వాళ్ళను చూస్తే రజాకార్లు భయపడుతుండేవారు. వాళ్ళజోలికి పోయేవాళ్ళు కాదు. మంది పోలీసులు, రజాకార్లు వచ్చారు. గెరిల్లాదళం గ్రామంలోనే వుంది. భేరీ మ్రోగించబడింది. ప్రజలు సన్నద్ధమయ్యారు. శత్రువును గ్రామానికి చేరకుండా దూరంలోనే నిలవేశారు. తాటి చెటమాటున, పొలాలలోని వాములు మాటున వుండి కాల్పులు సాగించారు. ఉ భయపక్షాల మధ్య కాల్పులు కొన్ని గంటలపాటు సాగాయి. ప్రజలు, గెరిల్లాలు శత్రువును మూడువైపులనుండి ఎదుర్కొన్నారు. ప్రజల ధాటికి ఆగలేక రజాకార్లు, పోలీసులు పారిపోయారు. ప్రజలు, గెరిల్లాలు వాళ్ళను మద్దూరు క్యాంపుకు అరమైలు దూరానగల గుగ్గిల్లాపురం దాకా వెంటబడి తరిమి వచ్చారు.

బైరాన్పల్లిలో పోరాటం జరిగిన రోజునే సుమారు 200 మంది సైనికులు ఈ గ్రామంపైనకూడా దాడిచేశారు. ఇక్కడ కూడా కొంతమంది ప్రజలు దేశముఖ్ మాటలు నమ్మారు. తప్పుకుపోవడానికి మారుగా గ్రామంలోనే వుండిపోయారు. పోరాడేదళం బురుజు పైనుండి క్రిందికి దిగి వచ్చింది. కొంతమంది ప్రజలు గ్రామంలోనే చంపబడ్డారు. మరికొంతమందిని వూరిబయట మర్రిచెట్టు క్రిందకి తీసుకెళ్ళి కాల్చి చంపారు. చేతుల్లో తుపాకులు బట్టి పోరాడుతుండగాని, సైనికులచే నిర్బంధించబడిన తర్వాతగాని ఈ పోరాటంలో మొత్తం యిరవైమంది ప్రజలు మృతిచెందారు. బురుజుమీద మృతిచెందినవారిలో సిద్ధిపేట తాలూకా ఘణపురానికి చెందిన కామ్రేడ్ యెంబయ్య ఒకరు. ఆయన తన గ్రామంలో దేశముఖులకు వ్యతిరేకంగా పోరాడాడు. ఈ దేశముఖుకు చెందిన ముప్పై పశువులను కూటిగల్లుకు తోలాడు. ఆ పనిజేస్తుండగా, ఆయన వీరోచితంగా పోరాడి మృతిజెందాడు. గెరిల్లాదళం అక్కడికి వెళ్ళేసరికి, ఆ ప్రాంతమంతటా మృతదేహాలు చిందరవందరగా పడివున్నాయి. కాస్త శ్వాస ఆడుతున్న కామ్రేడు గెరిల్లాలు చేతుల్లోకి తీసుకున్నారు. కామ్రేడ్ వారిచేతుల్లోనే అసువులు బాశాడు. ఈ రెండు గ్రామాలపై మిలిటరీదాడుల అనంతరం రజాకార్లు, పోలీసులు ఆ గ్రామాలను లూటీ చేయడానికి మరలావచ్చారు. తమను ప్రతిఘటించే వాళ్ళెవరూ బ్రతికివుండరని వాళ్ళనుకున్నారు. నాలుగువందల మంది రజాకార్లు, పోలీసులు బైరాన్పల్లిలో ప్రవేశించి ఇళ్ళను లూటీ చేసి, ఇళ్ళకు నిప్పంటించటం ప్రారంభించారు. వాళ్ళు బురుజు పై కెక్కారు. గడ్డపలుగులతో దాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అచ్చటికి కొలది దూరంలోనే సమావేశం జరుపుకుంటున్న దళం ఈ వార్త విని వెంటనే అక్కడికొచ్చి దాడి చేసింది. బురుజు పైనున్న వాళ్ళిద్దరూ క్రిందపడి మరణించారు. శత్రువులు తమవాళ్ళ మృతదేహాలను మాత్రమే తీసుకోగలిగారు. తమ బండ్లను, తాము కొల్లగొట్టిన వాటిని అక్కడే వదిలేసి ప్రజలమీద కాల్పులు జరుపుకొంటూ పారిపోయారు.

300 మంది రజాకార్లు, పోలీసులు కూటిగల్లు గ్రామాన్ని కూడా చుట్టుముట్టారు. ఇళ్ళకు, గడ్డి వాములకు నిప్పుపెట్టారు. గ్రామానికి వెలుపల వున్న గెరిల్లాలు చెట్లను మాటుచేసుకుని శత్రువుపై కాల్పులు జరిపారు. శత్రుబలగంలోనూ ముగ్గురు మరణించారు. సరిగ్గా అదే సమయంలో అంతకు ముందొక దాడి సందర్భంగా గడ్డివామిలో పెట్టబడిన తూటా పెద్ద శబ్దంతో పేలింది. ఈ సంఘటన అనంతరం “పోలీసుచర్య” జరిగేంతవరకూ రజాకార్లుగాని పోలీసులుగాని ఆ గ్రామంపై దాడి చేయలేదు.

ఈ విధంగా 1948 సెప్టెంబర్ 13 నాటికి ప్రజలు గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసుకొని తమ పాలనను తామే కొనసాగించారు. ఎవరికి పన్నులు చెల్లించలేదు. ఈ పరిస్థితిని గమనించిన భారత ప్రభుత్వం, నైజాంలోని కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచలేదని ఈ నిర్ణయానికి వచ్చి తన సైన్యాలను నైజాంలోకి దించింది.

సైన్యాలు వచ్చిన అనంతరం పోరాట పరిస్థితిలో మార్పులు వచ్చాయి. కేంద్రం సైన్యాల రాక : భారతదేశంలో విలీనం 13-9-1948 నుండి 21-10-1951 వరకు

1948 సెప్టెంబర్ 13న సికింద్రాబాద్-షోలాపూర్ మార్గంలోని నల్లదుర్గం కోటను లక్ష్యంగా పెట్టుకొని భారత బలగాలు వచ్చాయి. తెల్లవారుజామున హవల్దార్ బచ్చీందర్ సింగ్ రెండు వాహనాల్లో రావటం చూశారు. అక్కడ కొంత కాల్పులు జరిగాయి. తెల్లవారేసరికి తుల్జాపూర్ కోట స్వాధీనమైంది. విజయవాడనుండి బయల్దేరిన సైన్యం కల్నల్ అమ్రిక్ సింగ్ నాయకత్వాన కోదాడను పట్టుకున్నాయి. సెప్టెంబర్ 14 నుండి 16 వరకు సైన్యాలు పెద్దఎత్తున నైజాంలో ప్రవేశించడంతో సెప్టెంబర్ 17 తెల్లవారుజామున బీదర్కు చేరాయి. సెప్టెంబర్ 18 సాయంత్రం 4గం.లకు జనరల్ జే.యన్. చౌదరి నాయకత్వాన సికింద్రాబాద్లో అడుగుపెట్టాయి. హైదరాబాద్ సైన్యాధిపతి మేజర్ జనరల్ ఎల్.ఎడ్రూస్ లొంగిపోయాడు. చౌదరి మిలటరీ గవర్నర్ పదవి స్వీకరించాడు. 19న ఖాసీం రిజ్వీ అరెస్ట్ అయ్యాడు. నవంబర్ 24న జనరల్ చౌదరి హైదరాబాద్ సంస్థాన అధికార బాధ్యతలను సివిలియన్ గవర్నర్కు అందజేశాడు. ఈ పోరులో భారత సైన్యం తరుపున 66మంది మరణించగా 97 మంది గాయపడ్డారు. హైదరాబాద్ సైన్యంలో 490 మంది మరణించారు. 122 మంది గాయపడ్డారు.

భారత ప్రభుత్వం నైజాం రాజు సేవలో

సెప్టెంబర్ 17న నైజాం ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిన తరువాత ఇక్కడి నుండి సైన్యాలను ఉపసంహరించాలి. కానీ సైన్యాలు వచ్చిన లక్ష్యం కమ్యూనిస్టులను అణిచివేయడం మాత్రమే. నైజాం తన సైన్యాలతో నూ, జమీందార్ల గూండా గ్రూపులతోనూ, కాశీంరజ్వీ నేతృత్వంలో ఏర్పడిన 60 వేల మంది రజాకార్లతోనూ కమ్యూనిస్టులను అణిచివేయడానికి సాధ్యం కాకపోవడాన్ని గుర్తించిన కేంద్రం, కమ్యూనిస్టులు ఎదగకుండా అణిచివేయడానికి సైన్యాన్ని ఇక్కడే ఉంచింది. భారతదేశంలో విలీనమైన 17వ తేదీన భారత ప్రభుత్వం “నైజాంను రాజ్ ప్రముఖ్”గా నిర్ణయించారు. (ఇతను 1951 ఎన్నికల వరకు కొనసాగాడు. 1949 డిసెంబర్ 1న వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించారు. 19 ఎన్నికల అనంతరం బూర్గుల రామకృష్ణారావు మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు. ) యూనియన్ సైన్యాలు వచ్చి నైజాంను భారతదేశంలో విలీనం చేసిన తరువాత పార్టీ ఒక చర్చ సాగింది. భారత ప్రభుత్వం జమీందారుల భూములు పంఫిణీ చేస్తుందని పోరాటం విరమించడం గురించి ఆలోచించాలన్న ప్రతిపాధన వచ్చింది. పోరాటంలో సాధించిన భూములపై హక్కులు ఏర్పాడేవరకు పోరాటం కొనసాగించలని మేజార్టీ వర్గం అభిప్రాయపడింది. రెండు అభిప్రాయాలున్నప్పటికీ కలిసి పోరాటం సాగించారు.

‘ఆపరేషన్ పోలో’ (పోలీసు చర్య)

సైన్యాల ప్రవేశంతో పోరాటం కొనసాగించడమా ? విరమించడమా ? అన్న చర్చ ప్రారంభమైంది. మనం సాధించుకున్న విజయాలన్నింటిని వమ్ముచేసి తెలంగాణ ఉద్యమాన్ని సర్వ నాశనం చేసేందుకు తయారైన నెహ్రు సైన్యాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించడమా ? సాయుధ పోరాటం అంటే విముక్తి పోరాటం అని లేదా విప్లవ సాయుధ విజృంభణ అనేది నాటి అవగాహన. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పోరాటాన్ని విరమించి అవకాశం ఉన్న పరిధిలో చట్టబద్ద పోరాటం చేయాలన్నదానికి అనుకూలంగా ఉన్నారు. భారత ప్రభుత్వం బూర్జువా, భూస్వామ్య ప్రభుత్వం. ఆంగ్లేయ సామ్రాజ్య వాదులతో లంకె వేసుకొని ఉంది కాబట్టి ‘స్వతంత్ర హైదరాబాద్’ నినాదం ఇవ్వాలని రాజ్బహుదూర్ గౌర్, కె ఎల్ మహేంద్ర పత్రికా ప్రకటన చేశారు. భారత దేశంలో విలీనాన్ని కూడా వ్యతిరేకించారు. పోలీసు చర్య అనంతరం బద్దం ఎల్లారెడ్డి అరెస్టు, రావి నారాయణరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళారు. 1950 డిసెంబర్ 13 వరకు అజ్ఞాతంలోకి వెళ్ళిన రావి నారాయణరెడ్డి కేంద్ర ఆఫీసు వద్దకు వెళ్ళాడు. కేంద్ర కమిటీ తెలంగాణ పోరాటంపై తీర్మానం చేసినప్పటికీ, సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, వీరిద్దరూ పోరాటం చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారన్న వాస్తవాన్ని గుర్తించాలి. వీరు గెరిల్లా చర్యలను బహిరంగంగా సమర్ధించారు. ఇది గమనార్హం.

సాయుధ పోరాటం కొనసాగింపుకు పార్టీ నిర్ణయం

విబేధాలు ఎన్ని ఉన్నా రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి పోరాటం కొనసాగించడానికి అంగీకరించారు. ప్రజలు సాధించుకున్న విజయాలను రక్షించుకోవాలంటే పోరాటం కొనసాగించాలి. సైన్యం, నైజాం సైనికుల పైన, రజాకార్ క్యాంపులపైన దాడులు చేస్తే భారత సైన్యంతో తలపడవద్దు. “రజాకారు, నైజాం సైన్యంపై స్వతంత్రంగానే దాడి చేయండి. ఆయుధాలు గుంజుకొండి” అంటూ కొంత కాలం ఓపిక పట్టండి అంటూ పోలీసు చర్య సందర్భంగా అన్ని దళాలకు సర్క్యులర్ పంపారు. భారత సైనిక బలగాలు – భూస్వామ్య గుండాలు రైతాంగంపై దాడి చేస్తే సామాన్య ప్రజలలో తలెత్తిన భ్రమలు పటా పంచలు అవుతాయి. వారు తిరిగి సన్నద్ధం అవుతారు. తమ రక్షణ కోసం ఆయుధాలు పట్టి పోరాడుతారని పార్టీ స్పష్టం చేసింది. దొడ్డా నర్సయ్య నాయకత్వాన హుజుర్ నగర్ , ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కట్కూరి రాంచంద్రారెడ్డి నాయకత్వాన భువనగిరిలో, నల్లమల గిరి ప్రసాద్ పుల్లన్న నాయకత్వాన పాల్వంచలో ఉన్న కొన్ని కమిటీలు పోరాటం ఉపసంహరించాలని చట్టబద్ధమైన ఆందోళన చేపట్టాలని వాదించారు. ఆ తరువాత వీరంతా మితవాద సిపిఐ పార్టీలో చేరారు. సూర్యాపేట, ఖమ్మం, మానో కోట కమిటీలు పోరాటాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపాయి. పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాత అందరూ సాయుధ పోరాటాన్ని బలపర్చారు. విభేధించిన వారు తరువాత పార్టీ విడిపోయారు. సూర్యాపేట తాలుకాలో క్యాంపుపై దాడి చేసి నైజాం సైన్యాలను, రజాకార్లను దళాలు తరిమి వేస్తుండగా సైన్యాలు వచ్చి ప్రజలను తరిమి వేశారు. సూర్యాపేట తాలూకాలో జన్నారెడ్డి ప్రతాష్రెడ్డి గడిని (హైదరాబాద్ జైలంతా కూల్చివేసి దున్నారు. మొక్కజొన్నలు వేశారు. 2000 బస్తాల వడ్లు ప్రజలకు పంచారు. మాన్కోట తాలూకాలో నెల్లికుదురు రజాకారు క్యాంపుపై 300 మంది ప్రజలు దాడి చేశారు. 100 మంది రజాకార్లు ఆయుధాలతో సహా లొంగి పోయారు. వాళ్ళ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రాఘవరావు అనే భూస్వామికి చెందిన 3 లక్షల విలువ గల మిల్లు ధ్వంసం చేశారు. 1500 బస్తాలు వడ్లు పంపిణీ చేశారు. ఈ విధంగా ప్రజా శత్రువుల భవనాలు, ఆస్తులను క్రమపద్ధతి ప్రకారం నిర్మూలించారు. జనగాంలో విస్నూర్ రాంచంద్రారెడ్డి గడీలో 10 వేల మంది పోగై స్వాధీనం చేసుకోగా 120 మంది యూనియన్ సైనికులు వచ్చి చుట్టుముట్టి నిలిచారు. అతని బంగ్లాను రక్షించారు. అతని కుమారుడు జగన్మోహన్రెడ్డి 100 మందిని గతంలో కాల్చి చంపాడు. చిత్ర హింసలు చేశాడు. అక్కడి ఎస్పై ప్రజలపై అంతులేని అత్యాచారాలు చేశాడు వారిద్దరు ఎవరికి చెప్పకుండా జనగాంకు వెళ్ళారు. దళాలు కూడా జనగాం వెళ్ళాయి. హైదరాబాద్ గూడ్స్ రైల్ ఎక్కి పారిపోబోయాడు. గూడ్స్ రైల్ను నిలిపివేశారు. రైల్ కింద దూరిన బాబురావును పట్టుకొని చంపివేశారు. ఇన్స్పెక్టర్ తల పగిలింది. రైఫిల్ లాక్కున్నారు. ఆలేరు వద్ద గూడ్స్ దిగి పోయారు. భువనగిరిలో మోత్కూరు క్యాంపును దళాలు చుట్టుముట్టాయి. పోలీసు స్టేషన్ ను నేలమట్టం చేశారు. నల్గొండ, నార్కెట్పల్లి, వరంగల్, తాటికొండ క్యాంపులను జఫర్డ్ క్యాంపును ధ్వంసం చేశారు. యూనియన్ సైన్యాలు పట్టాణాలలో కొన్ని స్థానాలలో ప్రజా శత్రువులను కాపాడాయి. దేశముఖ్ లు, భూస్వాములు భారత సైన్యాల ప్రవేశం తరువాత 2 వారాల్లో తిరిగి గ్రామాలకు వచ్చారు. ఆ విధంగా యూనియన్ సైన్యాలు, నైజాం సైన్యాలను, భూస్వాములను కాపాడాయి. కాశీం రజ్విని జైళ్ళో పెట్టి 1వ తరగతి ఖైదీగా చూశారు.

కాన్స్టషన్ క్యాంపులు (చిత్రవధ కేంద్రాలు)

నైజాం సైన్యాలు, రజాకార్లు, భూస్వామ్య గూండాలు మరియు భారత సైన్యాలు కలిసి చేసిన ఆకృత్యాలు అంతాఇంతా కాదు. ప్రతి నాలుగైదు మైళ్లకు ఒకటి చొప్పున మిలటరీ క్యాంపులు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు మూడు సార్లు సైనికులు దరిదాపుల గ్రామాలపై దాడులు చేసి ప్రజలందర్ని ఒకచోట మంద వేసి పాశవికంగా కొట్టారు. కమ్యూనిస్టులను వెతకడం కోసం అడవులు, తోపులు, చెరువులలో వెతికారు. కాళ్లకు తాళ్లు కట్టి తల కిందికి వేలాడదీసి గిలకలపై పైకీ కిందికి లాగారు. మనుషులను గోనె సంచులలో పెట్టి సైనికులు నూతిలో అటునుండి ఇటు, ఇటునుండి అటు లాగారు. మహిళలపై హత్యాచారాలు, మానభంగాలు పెద్దఎత్తున జరిపారు. సూర్యాపేటలో మూడు రోజుల క్రితం ప్రసవించిన మహిళను చెరిచారు. గర్భిని స్త్రీ లను చెరిచారు. భువనగిరిలో 10 సంవత్సరాల బాలికను సైతం వదిలిపెట్టలేదు. స్త్రీలను వివస్త్రలుగావించారు. తొడలకు తొండలను కట్టి గాయాలకు కారం రాసారు. ఇంత జరిగినా పోరాటాలు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. భూసమస్య అత్యంత కీలక సమస్యగా తీసుకున్నారు. గ్రామాలలో నిర్బంద శిభిరాలు ఏర్పాటుచేసినా, గ్రామ దహనాలు కొనసాగినా శత్రువులను మట్టుపెట్టడంలోనే ఉద్యమాలు కొనసాగాయి. సైన్యానికి ప్రజలను కాల్చి చంపడం అనేది సరదాగా మారింది. ప్రైవేట్ వడ్డీ, వెట్టి చాకిరీ, అడవిభూములపై పన్నులు తదితర నిర్బంద వసూళ్లు జరిగాయి.

1949 అక్టోబర్ చివరి నాటికి 50 మంది కమ్యూనిస్టు యోధులకు ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించింది. వీరందరూ తమ తరుపున న్యాయవాదులను పెట్టుకోలేదు. మీ ఇష్టం వచ్చిన శిక్షలు వేసుకోండని న్యాయస్థానంలో చెప్పారు. ఆతరువాత వీరంతా జట్లు జట్లుగా నల్లగొండ, హైదరాబాద్ జైళ్లకు పంపించబడ్డారు. వీరిలో డిల్లీ వెంకులు (14), యర్రబోతు రాంరెడ్డి (15), పన్నాల రాంరెడ్డి (20), నంద్యాల శ్రీనివాస్ రెడ్డి (20) నల్లా నర్సింహ్ములు (22)లు ఉరిశిక్ష పడిన వారిలో ఉన్నారు. దీనిపై “టైం పత్రికలో” వ్యాసం వచ్చింది. ప్రపంచవ్యాపితంగా ఆందోళన సాగింది. హైకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించకుండానే వారిని ఉరి తీయాలని సైనిక ప్రభుత్వం పధకం పన్నింది. ఉరిశిక్షల రద్దును డిమాండ్ చేస్తూ జకోస్లోవేకియా రాజధాని ప్రేగ్ నగరంలో 10వేల మందితో పెద్ద ప్రదర్శన జరిగింది. రాంరెడ్డి ఫోటోను పెద్దగా చిత్రించి ముందు జీపు పై పెట్టి ఊరేగించారు. తరువాత హైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హైకోర్టులో ఉరిశిక్ష కొట్టివేయబడింది.

బీభత్స పాలన : ప్రతిఘటన

పక్షం రోజుల లోపలనే – సెప్టెంబరు నెలాఖరుకల్లా జనరల్ జె.యన్. చౌదరి ఆధ్వర్యాన గల సైనిక ప్రభుత్వం తెలంగాణా ప్రజలపై తన దాడులు ప్రారంభించింది. రజాకార్ల పై సాగించిన లాంఛనప్రాయమైన పోరాటాన్ని నిలిపివేసింది. నైజామంతటా జరిగిన హత్యలకు, లూటీలకు బాధ్యుడయిన కాశి రజ్వీవంటి పరమ కిరాతకులను జైళ్ళలో నిర్బంధించటం మాత్రమే జరిగింది. జైళ్ళలో వారికి ప్రథమ తరగతికి చెందిన సౌకర్యాలు కల్పించారు. ఇంకా అనేకమంది రజాకార్లను జైళ్ళలో నైనా పెట్టకుండా వదిలేశారు. మరోవైపున కమ్యూనిస్టులను అచివేసే ఉద్యమాన్ని ప్రారంభించారు.

సంస్థానంలోని వివిధ ప్రాంతాలలో, వందలాది సైనికులతో పెద్ద పెద్ద మిలటరీ క్యాంపులను ఏర్పాటు జేశారు. గ్రామాలనుండి పారిపోయిన దేశముఖులను, ప్రజాశతృవులను, కాంగ్రెస్ వాలంటీర్లను గ్రామాలలో తమ పెత్తనాన్ని పునఃస్థాపితం చేయటం కోసం తిరిగి తీసుకొచ్చారు. ప్రతి మిలటరీ క్యాంపు సరసనే ఒక కాంగ్రెస్ కార్యాలయం కూడా వెలిసింది. సైన్యానికి లొంగిపోవలసిందిగాను, దళసభ్యులను పట్టించవలసిందిగాను ప్రజలను కోరుతూ గ్రామాలవెంట తిరగడమే వారి కార్యక్రమంగా తయారైంది. వారు ప్రతి గ్రామంలో జెప్పినది:

“మనకిప్పుడు ప్రజారాజ్యం వచ్చింది. నైజాం పోయాడు. ఆయుధాలతో సహా లొంగిపోవలసిందిగా దళాలకు చెప్పండి. మీరు మాతో ఒప్పందానికి కూడా రండి. దేశముఖుల నుండి మీరు తీసుకున్న ఆస్తులను, పశువులను, ధాన్యాన్ని, భూము లను అంటినీ తిరిగి మా కిచ్చి వేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత భూ సంస్కరణలు ప్రవేశ పెడుతుంది. మీకు భూములిస్తుంది. మనమంతా హిందువులం. కమ్యూనిస్టులు రష్యా ఏజెంట్లు, కమ్యూనిస్టు ప్రభుత్వం క్రింద ప్రతి ఒక్క వ్యక్తీ కార్మికుడే. వారు ఏ విధమైన సాంఘిక కట్టుబాట్లనూ పాటించరు. ముసలివారిని చంపివేస్తారు. అందువల్ల వాళ్ళను నమ్మవద్దు. భూమిశిస్తు, ధాన్యంలెవి, ఎక్సైజు పన్నులు చెల్లించండి. మేమెంత చెప్పినా మా మాట విని మమ్మనుసరించకపోతే మిమ్ములను శిక్షిస్తాం. మాకున్న బలగాల ముందు నైజాం అంతటివాడు సయితం వారంరోజుల లోపలే లొంగిపోవలసి నచ్చింది. ఇక ఈ కమ్యూనిస్టులనగా ఎంత ? రెండు మైళ్ళ దూరానగల లక్ష్యం పైన దెబ్బ తీయగల అతి పెద్ద ఆయుధాలు మాకు న్నాయి. గ్రామాలపై బాంబులు వేసే విమానాలున్నాయి. దారిలో అడ్డం వచ్చిన ప్రతి దానిని పిండి పిండి చేయగల టాంకులున్నాయి. మిమ్ములను కాపాడటానికే మేమొచ్చాము. మా మాట వినకపోతే మీ గోతిని మీరు త్రవ్వుకున్నట్లే.”

గ్రామాలలో మొట్టమొదట ఒక వరస ఈ విధమైన ప్రచారం సాగించారు. వారంరోజుల లోపల లొంగిపోవలసిందిగా కమ్యూనిస్టులను కోరుతూ, అలా లొంగిపోకపోతే వాళ్ళను నిర్మూలిస్తామని పేర్కొంటూ మిలటరీ గవర్నరు జనరల్ జెఎన్ చౌదరి కూడా, హైదరాబాద్ నుండి ఒక ప్రకటన చేశాడు.

యూనియన్ ప్రభుత్వ స్వభావాన్ని వివరించి చెప్పటంకోసం పార్టీ కార్య కర్తలు, గెరిల్లా దళాలూ వువ్వెత్తున ప్రచారం సాగించారు. కాంగ్రెసు కమిటీలు దేశముఖ్ కమిటీలు తప్ప వేరేమీకాదని వారు ప్రజలకు చెప్పారు. పోరాటంద్వారా తాము సాధించుకున్న భూమిని, పశువులను, గ్రామ పంచాయతీ కమిటీలను కాపాడుకోవలసిందిగాను, లొంగిపోవద్దనీ వారు కోరారు. ఈ దశలో సూర్యాపేట తాలూకాలో ఒక పాట బహుళ ప్రచారంలో వుంది. “ఓ రైతా, రాజీపడాలనుకుంటున్నావా? ఎలుకకూ-పిల్లికీ మధ్య రాజీ అసంభవం” అనేదే దాని సారాంశం. ఈ పాటను రామన్న గూడెముకు జెందిన పార్టీ సభ్యులొకరు వ్రాశారు.

దళాల పైన, ప్రజల పైన మిలటరీ ప్రత్యక్ష దాడులు ప్రారంభించింది. పార్టీ ఆంధ్రమహాసభ కార్యకర్తలను గురించి ఎవరు ఏ దళంలో చేరారు ? ఏ దళం ముఖ్యమైనది? ఎవరు ఏ నూతి సమీపాన లేదా ఏ పొలంలో నివసించారు ? మొదలుగాగల సమాచారాన్ని సంపాదించారు. ఆ సమాచారం ప్రాతిపదికన పై సైన్యం తన దాడులను అలాంటి తావులపై కేంద్రీకరించి సాగించింది. కాంగ్రెస్ వాలంటీర్లు, సైన్యం యొక్క ప్రత్యేక గూఢచారి శాఖగా వ్యవహరించుతూ, సమాచారం సేకరించారు. సైన్యంతోపాటు వాళ్ళూ రజాకార్లు చేసినట్లే అత్యాచారాలు సాగించారు.

సైనికులు లారీలలో బయలుదేరి, ఒక్కొక్కసారి ఐదారు గ్రామాలను చుట్టుముట్టేవారు. ఈ గ్రామాల ప్రజలందరినీ ఒక్కచోటికి పోగుజేసి, కమ్యూనిస్టులను, గెరిల్లాలను చూపించవ లసిందిగా కోరుతూ వాళ్ళను కొట్టేవారు. చిత్రహింసలకు గురిచేసేవారు. ఉదయం 8-10 గంటల కల్లా ఈ పని పూర్తిజేసి, ఆ తర్వాత దాగి ఉండేవారు. గెరిల్లాలకోసం కొండల్లో, గుట్టల్లో, వాగుల్లో, వంకల్లో, పొదలలో వెదికేవారు. సాయంత్రానికల్లా క్యాంపులకు తిరిగి చేరుకునేవారు. ఆ విధంగా వారు రోజుకొక కేంద్రంమీద కేంద్రీకరించేవారు. ఒక్కొక్కసారి అదేరోజు రెండు, మూడు కేంద్రాలు తీసుకునేవారు. ఈ దాడుల సంఖ్య, ఉధృతి, తీవ్రత అధికమైంది. ఒక తాలూకా, తర్వాత మరొక తాలూకాలో ఈ విధంగా సాగించారు. ఒక్కోసారి ఇరవై, ముప్పై గ్రామాలను చుట్టుముట్టేవారు.

వీటిని “చుట్టుముట్టే దాడులని” పిలిచేవారు, ఈ ముట్టడిలో చిక్కుకున్న దళ మేదైనా తప్పించుకోగలగటం అరుదు. ప్రతిఘటించటం అంతకంటే ప్రమాదకరం. అందువల్ల, దీన్ని దృష్టిలో వుంచుకుని, దళాల నిర్మాణంలో, వాటి సంఖ్య విషయంలో, రక్షణ పద్ధతుల విషయంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఒక్కొక్క దళంలో వుండే సభ్యులసంఖ్య ఐదుకు మించరాదని వారు ప్రజలు ధరించేటటువంటి దుస్తులనే ధరించాలనీ, తమ ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించుతూ తిరగరాదనీ, సైన్యం ముట్టడి జేయబోతున్నదన్న వార్త ముందుగా తెలిస్తే అలాంటి ప్రాంతాలను వదిలి వెళ్లాలని నిర్ణ యించబడింది. స్థానిక ప్రజలతో కలసిపోయి మెలగవలసిందిగా గ్రామ దళాలను పార్టీ కోరింది.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మనలను కాపాడుకోవటం ఎంతో కష్టమైంది. ఒక పథకం ప్రకారం సాగించబడుతున్న ఈ చిత్ర హింసాకాండను మన రక్ష ణకు ప్రధాన ఆధారమైన ప్రజలు తట్టుకోలేక పోయారు. ప్రజలను హింసలపాలు జేయటంలో మిలిటరివాళ్ళ, రజాకార్లను తలదన్నారు. “గొర్రెలుదినే వాడుపోయి, బర్రెలు దినే వాడొచ్చాడు” అని ప్రజలు చెప్పుకోనారంభించారు. ప్రజలను ఒకచోట మందవేయడం, కమ్యూనిస్టుల ఆచూకీ చెప్పవలసిందిగాను, దేశముఖుల ఆస్తులను తిరిమిచ్చి వేయవలసిందిగాను కోరుతూ బాదటం రోజువారీ కార్యక్రమమైపోయింది. స్త్రీ పురుష విచక్షణ గాని, వయోవృద్ధ భావంగాని లేకుండా ప్రజలను లాఠీలతో, తుపాకి మడమలతో, చింతబరికెలతో తీవ్రంగా కొట్టేవారు. ప్రజలను చిత్రహింసలు బెట్టటంలో సీతాపతి అనే మిలిటరీ కమాండరు అందరిని తలదన్నాడు. చింతబరికెలను, సుత్తి. కొడవలి ఆకారంలో వంచి కట్టి, వీపుల మీద సుత్తి కొడవలి గుర్తుబడేట్లు బాదేవారు. పార్టీ సభ్యుల కుటుంబాల పైన, గెరిల్లా దళాల సభ్యుల కుటుంబాలపైన ప్రత్యేకంగా కేంద్రీకరించి దాడులు సాగించారు. చేతికి చిక్కిన ప్రతి వారినీ, ప్రజల సమక్షంలోనే అమానుషంగా కొట్టి హింసించేవారు. నెహ్రూ సైన్యాల అఘాయిత్యాలు బీభత్స పద్ధతులు

తెలంగాణా ప్రజల వీరోచిత పోరాటాన్ని అణచాలనే వుద్దేశ్యంతో, హైదరాబాద్ లోని కాంగ్రెస్ మిలిటరీ ప్రభుత్వమూ, పోలీసులు, సైన్యమూ, కాంగ్రెస్ రజాకార్లూ, కనీవిని ఎరుగని స్థాయిలో గూండాయిజాన్ని, బీభత్సకాండను, ఫాసిజాన్ని విచ్చలవిడిగా సాగించారు.

తెలంగాణాలోని పోరాట ప్రాంతమంతటా ప్రతి నాలుగైదు మైళ్ళ కొకటి చొప్పున మిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేయబడ్డాయి. రోజుకు రెండుసార్లు, మూడుసార్లు సైనికులు ఈ క్యాంపుల దరిదాపులలోగల గ్రామాలపై మిలటరీ దాడులు సాగిం చారు. ప్రజలను నిర్ణీత పద్ధతి ప్రకారం హింసలపాలు చేశారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలను ఒక చోట మంద వేసి, పాశవికంగా కొట్టారు. కమ్యూనిస్టులను వెదకటం కోసం అడవులు, తోపులు, కొండలు మొదలైన వాటిలో తమవెంట రావలసిందిగాను, సమాచారం చెప్పవలసిందిగాను ప్రజలను నిర్బంధించేవారు. ఆ విధంగా వెదికినప్పుడు ఎవ్వరూ కనిపించకపోతే, మరల ప్రజలను పట్టుకు కొట్టేవారు.

మానుకోట తాలూకా తొర్రూరు, తదితర గ్రామాలలో, హుజూర్ నగర్ తాలూకాలో ప్రజలను త్రాళ్ళతో కట్టి గిలకలమీదుగా పైకి లాగి, ఎత్తు నుండి క్రిందపడ వేశారు    మనుషులను గోనెసంచులలో బెట్టి మూతిగట్టి సైనికులు నూతిమీదుగా అటు నుండి ఇటు ఇటునుండి అటూ విసిరివేసేవారు.  కొంతమంది సైనికులు ఆయుధాలు చేతబట్టుకునేవారు. మరికొంతమంది ప్రజల కాళ్ళు బట్టుకుని వూపుతుండగా, యింకా కొందరు ఆ వూగుతున్న వాళ్ళను తమ ఇనప నాడాల బూట్లతో ఫుట్ బాల్ ను తన్నినట్లు తన్నుతుండేవారు.

– మండే ఎండలో, యిసుకలో ప్రజలను మూకవుమ్మడిగా పరుండబెట్టి కొట్టేవారు. కొంతమందిని తలక్రిందులుగా చెట్ల కొమ్మలకు వేళ్లాడదీసి, ఉయ్యాల పూ పేవారు పూపుకు ఆ చివర, ఈ చివర కొట్టుతూ వుండేవారు. కొంతమందిని బోర్లా పరుండబెట్టి వీపుమీద కొయ్యపలక మీదపడవేసి సైనికులు దానిమీది కెక్కి తొక్కుతూ, నృత్యంజేస్తూ వుండేవారు.

చేతి వేళ్ళ గోళ్ళ క్రింద గుండుసూదులు గుచ్చేవారు ఎర్రగా కాలిన ఇనుముతోనో, కొరివితోనో వొంటిపై వాతలుబెట్టటం సర్వసాధారణం. ప్రజలను హింసలసాలు జేయటానికి విద్యుచ్ఛక్తిని కూడా పుపయోగించేవారు.

– మానుకోట – ఖమ్మం తాలూకాలలో, ఒక్కోసారి పదినుండి పాతిక గ్రామాల పైన దాడులు చేసేవారు. వందలాది ప్రజలను తీవ్రంగా కొట్టేవారు. లారీల ముందు పరిగెత్తించేవారు. లారీలకంటే ముందు పరుగెత్తలేకపోయినవాళ్ళను, లారీల వెనుక వేళ్ళాడగట్టి ఈడ్చుకు పోయేవారు.

– తెట్టలపాడు గ్రామ నాయకుడగు కామ్రేడ్ వీరాస్వామి కాళ్ళు, చేతులు వెనకకు మడిచి కట్టారు. ఆయనను, మోకాళ్ళు, మోచేతుల మీద ప్రాకునట్లు చేశారు. రక్తం కారుతుండగా, ప్రాకలేనిస్థితిలో వుండగా, ఆయన తలమీద లాఠీలతో, రాళ్ళతో మోదారు. తన జోన్ కమాండర్ సత్యం ఎక్కడున్నదీ బయట బెట్టటానికి ఆయన నిరాకరించటమే అందుకు కారణ). ఈ అమానుష చర్యను గాంచిన స్త్రీలు, బిడ్డలు ఆగ్రహావేశపరులై పోలీసులపై దుమ్ము జల్లారు. వాళ్ళను తిట్టిపోశారు.

ఇల్లెందు తాలూకా, బేతాలపాడు గ్రామ ప్రజలందరినీ కొట్టారు. వారం దరినీ కింద పరుండబెట్టారు. వాళ్ళపై బరువైన రాళ్ళు బెట్టారు. “కమ్యూనిస్టు లెక్కడున్నారో యిప్పుడు చెప్పండి”, “కాంగ్రెసు పాలన మంచిదా? కమ్యూనిస్టు పాలన మంచిదా చెప్పండి” అని అడిగారు. సైనికులు, తమ ఇనుపనాడాల బూట్లతో వారి శరీరాలపై నృత్యం చేశారు. ఆ తర్వాత, వారిని ఖమ్మం ముళ్ళకంచెల బందెల దొడ్డిలో పడవేసేవారు మానుకోట తాలూకా మన్నెగూడెం, పుల్లెపల్లి, జయ్యారం గ్రామాలలో ప్రజలను నేలమీద పరుండబెట్టి వాళ్ళమీదుగా గుర్రాలతో స్వారీ జేశారు.

లోయపల్లి పరిసర గ్రామాలలో ప్రజలను ముండ్ల తుప్పలలో పడవేసి, సైనికులు తమ బూట్ల కాళ్ళతో వారిమీదకెక్కారు. మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ, మండుటెండలో, ప్రజలను ఆ ముండ్ల పొదల మీదుగా మోచేతులు, మోకాళ్ళతో ప్రాకునట్లు చేశారు. ఆ స్థలమంతా రక్తసిక్తమయి పోయింది. వందల మంది స్పృహ గోల్పోయారు. ఈ నాజీ హింసాకాండ అంతా అయిన తర్వాత, మీరు కమ్యూనిస్టులను వదులుకుంటారా లేదా అని సైనికులు ప్రజలనడిగారు. “మా జీవితాలలో ఎన్నడూ మేము వాళ్ళను వదులుకునేది లేదు” అని ప్రజలు ముక్తకంఠంతో సమాధాన మిచ్చారు.

నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాదు జిల్లాలకు చెందిన రెండువేలకుపైగా గ్రామాలలో, పైన పేర్కొన్న విధంగా మూడు లక్షలమంది ప్రజలను చిత్రహింసల పాలుజేశారు. సుమారు యాభై వేలమందిని అరెస్టు చేశారు. కొలదిరోజు మొదలు, మాసాలవరకు క్యాంపులతో నిర్బంధించారు. ఐదువేల మందికి పైగా, సంవత్సరాల తరబడి జైళ్ళలో నిర్బంధించబడ్డారు. ఈ మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు చేసారు. మహిళలపై అత్యాచారాలు జరపటంలోనూ వారిని మానభంగం చేయటం లోనూ కాంగ్రెసు రజాకార్లు, సైనికులు నైజాం రజాకార్లను తలదన్ని పోయారు. ఈ అత్యాచారాల స్వభావం అర్థం చేసుకొనటానికి ఈ దిగున ఉదాహరణలే చాలు :

సూర్యాపేట తాలూకా రాగిపాడులో మూడు రోజుల క్రితమే ప్రసవించిన స్త్రీని చెరిచారు. భువనగిరి తాలూకా తెనుగుంటలో ఒక గర్భిణీ స్త్రీని చెరిచారు. క్రితం రోజే ప్రసవించిన స్త్రీని చెరిచారు.

ఖమ్మం తాలూకా పుష్పాపూరులో, భువనగిరి తాలూకా యెర్రపాడులో పది సంవత్సరాల బాలికలను సయితం చెరిచారు.

ఈ సైనికులు, ఇల్లెందు తాలూకా బలపాలలో 20 మంది స్త్రీలను, సీమలపాడులో 70 మందిని, జనగామ తాలూకా నర్మెట, నంగనూరు గ్రామాలలో 80 మందివి చెరిచారు.

నీలాయగూడెంలో గ్రామస్తులు గెరిల్లాలకు బియ్యం ఇచ్చినందుకుగాను, ఆ గ్రామంలో 12 సంవత్సరాలు దాటిన వారినందరినీ కొట్టారు. పదిహేను మంది స్త్రీలను పాశవికంగా చెరిచారు. అందిన సమాచారాన్ని బట్టి, మొట్ట మొదటి సంవత్సరకాలంలోనే వెయ్యి మందికి పైగా స్త్రీలను చెరిచారు. మొత్తం ఆ కాలమంతటిలోనూ వేలమందిని చెరిచారు. అనేకమంది పశువులుగా, ఒకరి తర్వాత ఒకరు చెరిచినందున వందమందికి పైగా స్త్రీలు మృతి జెందారు.

ఇనుప పట్కార్లతో స్త్రీల రొమ్ములను పట్టిలాగటం, నొక్కటం జరిగింది. తల్లుల ఎదుటనే బిడ్డలను చంపి వేయటమూ జరిగింది.

నెరెడలో డెబ్బైమంది స్త్రీలను వివస్త్రలను గావించారు. వారి తొడలకు తొండలను కట్టి, గాయాలలో కారం కూరారు.

దారుణ హత్యలు

సజీవ దహనాలు, జీవ సమాధులు, మూకుమ్మడి ఊచకోతలు కోసారు.

చందుపల్లికి చెందిన కామ్రేడ్ రంగయ్యను ఒక బండికి కట్టి సజీవంగా దహనం చేశారు. “కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్” అని నినదిస్తూ ఆయన ప్రాణాలు విడిచాడు.

కామ్రేడ్ రాములును సూర్యాపేట తాలూకా, మిర్యాల వద్ద చుట్టుముట్టడి దాడిలో పట్టుకున్నారు. ఆయన నుండి ఎలాంటి రహస్యాలు రాబట్ట లేక ఒక లారీకి కట్టి శరీరం ముక్కలు ముక్కలై పోయేంతవరకూ ఈడ్చు కెళ్ళారు.

తెల్లవారగట్ల గ్రామాలను ముట్టడించి గ్రామ ప్రజలందరినీ ఒకచోట చేర్చి, వారిని దిగంబరులుగా మార్చి లాఠీలతో, తుపాకులతో హింసించారు. మహిళలు, బాలికలు, ముసలివారు అన్న తేడా చూడకుండా హింస కొనసాగింది. కాన్సెంటేషన్ క్యాంపులలో పెట్టి చర్మాలు ఊడేవరకు హింసినప్పటికీ, ఆసనాలలో కారం పెట్టినప్పటికీ ఉద్యమ రహస్యాలను బయటపెట్టలేదు. ఉద్యమాన్ని అణచాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

విద్యార్థుల ప్రతిఘటన

26 జనవరి 1950 వరకు నైజాంను రాజ్ ప్రముఖ్ గా నిర్ణయించినందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇది సహించని ప్రజలు మరియు విద్యార్థులు కలిసి తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లో జనవరి 31న పోస్టర్లు వేసి నిరసన ప్రదర్శన చేశారు. కాచిగూడ హైస్కూల్ విద్యార్థులు సమ్మె చేశారు. వరంగల్లో 2000 మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయగా కాంగ్రెస్ పోలీసులు లాఠీచార్జి చేసి అరెస్టులు చేశారు. అరెస్టు చేసిన వారిని దూరంగా అడవిలోకి తీసుకెళ్ళి వదిలి పెట్టారు. కరీంనగర్లో జనవరి 26న విద్యార్థుల పోరాటం పెద్ద ఎత్తున సాగింది. 300 మందితో సోషలిస్టులు సభ జరిపారు. సభ జరుగుతుండగా మలబార్ పోలీసులు రెచ్చగొట్టగా వారికి బుద్ధి చెప్పారు. పోలీసులు గాల్లోకి కాల్పులు చేసి ఐదుగురిని అరెస్టు చేసి కానరాని చోట్లకు తీసుకెళ్ళారు. కార్యాలయంపై దాడులు చేసి పుస్తకాలు ఎత్తుకపోయారు. జనవరి 31 వరకు సమ్మె చేశారు. వరంగల్ విద్యార్థుల దాడితో నిరసనలు పెల్లుబుకాయి.

నల్గొండ, సూర్యాపేట, జగిత్యాల, సూల్తానాబాద్, పెద్దపల్లి, పరకాలలో విద్యార్థులు సమ్మె చేశారు. హైదరాబాద్లో కొమురయ్య అనే విద్యార్థిని చిత్రవాదలు చేసి కాల్చి చంపారు. వారి కుతంత్రాలకు విద్యార్థులు వెనుకంజ వేయలేదు. ఫిబ్రవరి 28న హైదరాబాద్లో విద్యార్థులు, కార్మికులు, ప్రజలు పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఆ బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పోలీసు జులుంను తీవ్రంగా ఖండించారు.

కార్మికవర్గ పోరాటాలు

పోలీసు చర్య జరిగిన వెంటనే గని కార్మికులు, హిందూ, ముస్లీం బడా వ్యాపారస్తులు కార్మికవర్గంపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించారు. భారత సైన్యం కర్ఫ్యూ పెట్టింది. ఎర్రజెండాలు ఎగరవేయడం నిషేధించింది. హిందూ, ముస్లీం స్త్రీలను మానభంగాలు చేశారు. సెప్టెంబర్ 25న 9 వేల మంది కార్మికులు సమ్మె చేశారు. మెనేజ్మెంట్ వద్దకు వెళ్ళి సైన్యాలను ఉపసంహరించాలని ఆందోళన చేయగా చివరికి ఉపసంహరించాల్సి వచ్చింది. కొత్తగూడెం గని కార్మికులు నవంబర్ చివరలో బోనస్ కోసం సమ్మె చేశారు. 1949 మే లో బెల్లంపల్లి కార్మికులు మరోసారి సమ్మె చేశారు. వరంగల్, నల్గొండ జిల్లాల్లో గెరిల్లా చర్యల ప్రభావం ఉన్నప్పటికీ ఉత్సాహం పొందినప్పటికీ పరిస్థితులు తగినంత అనుకూలంగా లేవు. వివిధ పరిశ్రమలలో రిట్రెంచ్మెంట్, ఊరిశిక్షల రద్దు కొరుతూ సభలు, సమావేశాలు జరిగాయి. ఆజంజాహిమిల్ కార్మికుల నాయకులు భూమయ్యపై దాడి చేశారు. 1950 ఫిబ్రవరి 25 వరకు రహస్యంగా ఉన్నాడు.

ప్రభుత్వ ఉద్యోగులలో అసంతృప్తి

ముఖ్యమైన నాయకులను భారత యూనియన్ నుండి తీసుకువచ్చి స్థానికంగా పదవులు ఇవ్వడంతో వారి కింద పని చేయడానికి ఉద్యోగులు అసంతృప్తి ప్రకటించారు ద్వంద పరిపాలన వద్దు అంటూ నినాదాలు చేశారు. యూనియన్లో అధికారంలో ఉన్నత పదవులలో తెలంగాణ ఉద్యమం అణిచి వేయడానికి మీరే కారణం అంటూ పరస్పరం తిట్టుకున్నారు.

జైళ్ళలో పోరాటాలు

50 వేల మందిని అరెస్టు చేసి జైళ్ళలో కుక్కారు. ఒకరు ఉండాల్సిన చోట ఆరుగురిని పెట్టారు. కిక్కిరిసి ఉండడంతో బహిరంగ స్థలాలలో ముళ్ళ కంచెలు వేసి దానికి కరెంటు పెట్టి బహిరంగ జైళ్ళను ఏర్పాటు చేశారు. పశువువలే శిక్ష పడిన వారిని అరెస్టు చేసిన వారిని ఒకేచోట పెట్టారు. ఖమ్మం నిర్భంద శిబిరం, గుల్బర్గా జైలు, జాల్నా జైలు, బీడ్ జైలు, హైదరాబాద్, సికింద్రాబాద్ జైలులలో ఆందోళనలు మొదలైనాయి. వరంగల్ జైల్లో మిలట్రీ కాల్పులు జరిపింది. ఖైదీని కొట్టడంతో ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళి ఆందోళన చేశారు. మహిళ డిటెన్యూలపై లాఠీచార్జి చేశారు. ప్రత్యేక ట్రిబ్యునల్లు ఏర్పాటు చేసి బూటక విచారణలు చేసి వేలాది మందిని అరెస్టు చేశారు. జైళ్ళలో నుండి తప్పించుకున్న ఘటనలు ఉన్నాయి. నల్ల నర్సింహులు సీనియర్ మరియు నంద్యాల శ్రీనివాసరెడ్డి అందులో ఉన్నారు.

స్త్రీల వీరోచిత పాత్ర

భూములు నిలుపుకోవడంలో స్త్రీల పాత్ర గుర్తించవల్సినది. మిర్యాలగూడ, ముకుందాపురం, వాడపల్లి లంబాడీలు, కొండపోలు స్త్రీలు పోరాటాలు చేసి భూములు దక్కించుకున్నారు. కూలీ పెంపుకు పోరాటాలు చేశారు. జైనాబి (రాజారం) లచ్చమ్మ నడిగడ్డ, హము-మంగ్లీతో పాటు పాలడుగు మల్లికాంబ (కృష్ణా జిల్లా వలసగా వచ్చింది) ఎర్రమ్మ (హూజుర్ నగర్), రాంబాయి (పిండిప్రోలు) తదితరులు వీరోచితంగా పోరాటం చేశారు. మహిళలు వివాహ సమస్యలను కూడా పరిష్కరించారు. విడాకులు భార్య భర్తల ఇష్టాలపై ఆధారపడి చేశారు. కుల మతాల తేడా లేకుండా వివాహాలు జరిపించారు. ఈ పోరాటం కుల వివక్షత, స్త్రీ పురుషులకు సమాన హక్కులు, కుల మతాంతర వివాహాలు అమలులోకి తెచ్చింది.

1951 ఎన్నికలు నిర్వహించే వరకు నైజాంనే హైదరాబాద్ సంస్థానానికి రాజ్ ప్రముఖ్ కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1948 సెప్టెంబరు నుండి కమ్యూనిస్టులను అణిచివేసే బాధ్యతను కేంద్రబలగాలు తీసుకున్నాయి. 1946 జూలై నుండి 1948 సెప్టెంబరు వరకు 1500 మంది కార్యకర్తలు, నాయకులు నైజాం సైనికుల, రజాకార్ల కాల్పులకు ఘాతుకాలకు బలయ్యారు. 1948 సెప్టెంబర్ తర్వాత వచ్చిన కేంద్ర సైన్యాలు భూ సమస్యను పరిష్కరించకపోగా భూస్వాములకు, దేశముఖ్ కు అనుకూలంగా పేదలను భూముల నుండి బేధఖలు కార్యక్రమాన్ని కొనసాగించాయి. ఈ పరిస్థితులలో పోరాటాన్ని కొనసాగించాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. భూస్వాముల నుండి స్వాధీనం చేసుకున్న భూములను రక్షించుకోవడానికి సాయుధ పోరాటం అనివార్యమైంది. నైజాం పోలీసులు కన్నా కేంద్ర పోలీసు బలగాలు అత్యంత క్రూరంగా ప్రజలపై నిర్బంధకాండ కొనసాగించాయి.

చివరకు కేంద్ర ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం ద్వారా పేదల స్వాధీనంలో ఉన్న భూములను వారికే హక్కు కల్పిస్తామని, రక్షిత కౌలుదారీ చట్టం 38(ఇ) ప్రకటించింది. ఈ చట్ట ప్రకటనతో తెలంగాణా సాయుధ పోరాటాన్ని 1951 అక్టోబర్ 20న ముగిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. మొత్తంగాను ఈ ఉద్యమంలో 1946 జూన్ నుండి 4000 మంది పోరాట యోధులు, రైతులు ప్రాణాలర్పించారు. ప్రపంచ చరిత్రలోనే ఈ పోరాటం గుర్తింపు పొందింది. 38(ఇ) చట్ట ప్రకారం ఇప్పటికీ కొన్ని భూములు రైతులకు పట్టాలు కావల్సియే ఉన్నది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ చట్టాన్ని చిత్తశు ద్ధితో అమలు జరపలేదు. ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో కూడా సవాలు చేసే హక్కు లేదు. 38(ఇ) చట్ట ప్రకారం ఇప్పటికీ కొన్ని భూములు రైతులకు పట్టాలు కావల్సియే ఉన్నది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు జరపలేదు. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో కూడా సవాలు చేసే హక్కు లేదు.

సారంపల్లి మల్లా రెడ్డి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News