దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు మంజూరైన1055 యూనిట్స్ ను గ్రౌండ్ చేయాలి
Uncategorizedనల్లగొండ నియోజకవర్గ పరిధిలో దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు మంజూరైన1055 యూనిట్స్ ను గ్రౌండ్ చేయాలని దళిత బంధు సాధన కమిటీ నాయకులు పాలడుగు నాగార్జున, బకరం శ్రీనివాస్ అద్దంకి రవి లు కోరారు.
ఈరోజు దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వము ద్వారా 1050 మంది దళితులను దళిత బంధు పథకం ద్వారా ఎంపిక చేసి ఉన్నారనీ బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చేయడం జరిగిందనీ అన్నారు. గ్రామ కార్యదర్శులు ఎంపీడీవోల ద్వారా మున్సిపల్ వార్డు కమిషనర్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులందరికి సమాచారం అందించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో
తేదీ 08/10/2023 నాడు లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సమావేశపరిచి లబ్ధిదారులను చైతన్యపరిచి ప్రొసీడింగ్స్ ఇచ్చారనీ తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చినందువలన యధావిధిగా సాగాల్సిన గ్రౌండింగ్ ప్రక్రియ ఆగిపోయినది. మాకు మంజూరైన నిధులను వెంటనే గ్రౌండ్ చేసి జీవనోపాధి పొందుటకు అవకాశం కల్పించి నిధులు విడుదల చేయగలరని కోరారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో దళిత బంధు సాధన కమిటీ నాయకులు కత్తుల జగన్ కుమార్ కందుల లక్ష్మయ్య బొజ్జ వెంకన్న బడుపుల శంకర్ చింత సైదులు తలారి పరమేష్ ఆరె కంటి నరసింహ కందుల రమేష్ ఏపూరి జానయ్య పాలడుగు ఆంజనేయులు పుల్లెంల కొండల్ దాసరి జానయ్య జె అంజయ్య కత్తుల చరణ్ కందుల విజయ్ బొజ్జ సైదులు ఖతర్నాక్ రత్నగిరి శ్రీనివాస్ జై గణేష్ కత్తుల చక్రి మేడి అశోక్ పెరికే శ్రీను బొల్లు క్రాంతి తదితరులు పాల్గొన్నారు.