ప్రభుత్వం నిధులిచ్చే దాకా ఆగకుండా సైడ్ కాలువలు తీయించిన రమేష్"
ప్రభుత్వం నిధులిచ్చే దాకా ఆగకుండా సైడ్ కాలువలు తీయించిన రమేష్”
సత్తుపల్లి,ఆర్ సి,ఫిబ్రవరి05(తెలుగుగళం)న్యూస్: సత్తుపల్లి నియోజవర్గ పరిధిలోని వేంసూరు మండల పరిధిలోని
భీమవరం గ్రామoలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ వంట్లా రమేష్ ప్రజలకు చేరువగా పరిపాలన చేస్తున్నారు.ప్రభుత్వం గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోయినా తనను నమ్మి గెలిపించిన ప్రజలకు అండగా నిలవడమే ధ్యేయంగా తన సొంత సొమ్ముతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. బుదవారం,గురువారం గ్రామంలోని ఎస్సీ కాలనీలోని పేదలు కొన్ని కుటుంబాలకు త్రాగునీటి ఇబ్బంది అని తెలపగా వారి ఇంటి వద్దకు నూతన పైపు లైన్ వేయించి వారి దాహార్తిని తీర్చే దానికి సహకారం అందించారు.అంతే కాకుండా సైడ్ డ్రైనేజీలు లేక మురుగు నీరు నిల్వ ఉండి విష జ్వరాలు వస్తున్నాయని గమనించి ప్రారంభంలోనే జ్వరాలను అరికట్టాలనే ఉద్దేశ్యంతో సొంత సొమ్ముతో సైడ్ కాలువలు తీయించి ప్రజా సేవకుడిగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమాలలో:గ్రామ పంచాయతీ కార్యదర్శి చీకటి చైతన్య,వంట్లా సుబ్బారావు, గరిగంటి సత్యం,గ్రామ పంచాయతీ సిబ్బంది,కల్లూరుగూడెం గ్రామానికి చెందిన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.