దేవస్థాన మాజీ చైర్మన్ తండ్రికి ఆరూరి రమేష్ నివాళి
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదివారం ఐనవోలు గ్రామంలో పరామర్శలు చేశారు.
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మునిగాల సమ్మయ్య తండ్రి కీ.శే. మునిగాల మొగిలి ఇటీవల మరణించగా,వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అనంతరం గ్రామానికి చెందిన చాగంటి యాదగిరి,పురుషోత్తం తండ్రి వెంకటయ్య ఇటీవల మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తంపుల మోహన్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు గడ్డం రఘువంశీ గౌడ్, సర్పంచ్ ఉస్మాన్ అలీ, మాజీ సర్పంచ్ పల్లకొండ సురేష్, ఉపసర్పంచ్ మజ్జిగ జైపాల్, మాజీ ఉపసర్పంచ్ అడ్డగూడి సతీష్, తండ వెంకన్న, తాటికాయల కుమార్, చింత అశోక్, కొత్తూరి రాజు, కొత్తూరి జాన్సన్, జిందా, చందు తదితరులు పాల్గొన్నారు.