దేవాదాయ భూముల పరిరక్షణపై ధర్మన్నగూడలో మీడియా సమావేశం
తెలుగు గళం న్యూస్ రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా
ధర్మన్నగూడ గ్రామంలో భక్తుల ఆరాధనకు కేంద్రబిందువుగా నిలిచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి చెందిన దేవాదాయ భూముల పరిరక్షణ అంశంపై ధర్మన్నగూడ దేవాదాయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం గుడి ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ తరఫున కరపత్రం, వాల్ పోస్టర్లను విడుదల చేశారు.కమిటీ అధ్యక్షుడు మండల సత్యనారాయణ మాట్లాడుతూ, గుడి భూముల పరిరక్షణ అనే ఏకైక లక్ష్యంతోనే కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. దేవాదాయ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుతామని స్పష్టం చేశారు.కమిటీ కార్యదర్శి బండ మల్లేష్ మాట్లాడుతూ, దేవాదాయ భూములు పరిరక్షించబడినప్పుడే గుడి అభివృద్ధి, నిత్య పూజలు, ఉత్సవాలు మరియు ఇతర ధార్మిక కార్యక్రమాలు సక్రమంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. “భూమే లేనప్పుడు గుడి ఎలా అభివృద్ధి అవుతుంది? దేవాదాయ భూములను కాపాడకపోతే రాబోయే తరాలకు ఆలయం ఎలా మిగులుతుంది?” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సర్వే నెంబర్ 98/2లో ఉన్న 3 ఎకరాల దేవాదాయ భూమిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని కమిటీ స్పష్టం చేసింది. ఈ భూమికి సంబంధించి ఇప్పటికే ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తోందని, కమిటీ తరఫున కోర్టు కేసులో ఇంప్లీడ్ అయి చట్టపరమైన న్యాయపోరాటం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ భూమి పూర్తిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికే చెందిందని, ఎలాంటి వ్యక్తిగత హక్కులు లేవని కమిటీ పేర్కొంది.ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బిలకంటి మల్లారెడ్డి, పట్లూరి శశిధర్ రెడ్డి, మండల నర్సింహం (ఎట్టయ్య), మండల గోపాలకృష్ణ, బండ శ్రీనివాస్, పెరుమండ్ల సత్యం, పెరుమండ్ల రమేష్ (పెద్ద), పెరుమండ్ల ధనేష్, మండల జంగయ్య (పెద్దోల్ల), బండ చెన్నయ్య, సోమ అంజయ్య, మండల బాల్రాజ్, బుర్రి నరేష్, మండల నరేందర్, పెరుమండ్ల సురేష్, జక్కుల ఆనంద్, పెరుమండ్ల రమేష్ (చిన్న), కొంపోజు సురేష్, అనుమాండ్ల కృష్ణ, జక్కుల బాల్రాజ్ తదితరులు హాజరయ్యారు.దేవాదాయ భూముల పరిరక్షణ అనేది కేవలం కమిటీ బాధ్యత మాత్రమే కాకుండా ధర్మన్నగూడ గ్రామ సమస్త ప్రజల సామూహిక బాధ్యత అని కమిటీ స్పష్టం చేసింది.