జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్, బంజారా బస్తిల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను అప్యాయంగా పలుకరించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. నగరాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి నిరంతరం పాటు పడుతున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. ప్రతి పక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉండి, నిరంతరం నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం తపించే నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఎంపీ డా.కడియం కావ్య కోరారు.