నాయీబ్రాహ్మణుల జోలికొస్తే ప్రతిఘటన తప్పదునాయీబ్రాహ్మణుల జోలికొస్తే ప్రతిఘటన తప్పదు

ఉమ్మడి రాష్ట్రాల నాయీబ్రాహ్మణ సంఘాలు నేడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలోని ప్రెస్ క్లబ్ మీటింగ్ హాల్‌లో ఉమ్మడి రాష్టాల నాయీబ్రాహ్మణ సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎం సూర్యనారాయణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.*

ఈ సమావేశంలో పలువురు ఇరు రాష్ట్రాల వక్తలు మాట్లాడుతూ తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నాయీబ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఏబీఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో లక్షలాదిమంది జనం సాక్షిగా తన అహంభావం అహంకారాన్ని ప్రదర్శించటం సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి విధానం మార్చుకోక పొతే నాయీబ్రాహ్మణులు తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని హెచ్చరించారు.

నాయీబ్రాహ్మణులకు ఉన్న జీవో ఎంఎస్ నెంబర్ 50ని అతిక్రమించి అహంకారంతో కొవ్వెక్కి మాట్లాడటం అత్యంత దారుణమని తెలిపారు. నాయీబ్రాహ్మణల జోలికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సిఎల్ఎన్ గాంధీ (నాయీబ్రాహ్మణ)ను కించపరిచి మాట్లాడినందున నాయీబ్రాహ్మణ సంఘాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అందరూ ముక్తకంఠంతో ఖండించి ఉద్యమాలు చేయడం వలన జె సీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పింది మరచిపోయి మళ్ళీ అహంకారంతో మరోసారి నొటికి ఇష్టం వచ్చినట్లు మాట్లడినాడు. జెసి ప్రభాకర్ రెడ్డి బుద్ధి వచ్చే విధంగా అలాగే మన ఆత్మగౌరవారన్ని కాపాడుకోనే విధంగా నాయీబ్రాహ్మణు ఉమ్మడి కార్యచరణ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
నాయీబ్రాహ్మణులను కులం పేరుతో హేళన చేయకూడదు కించపరచకూడదు అని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం జీవో 50 విడుదల చేసింది కనుక పోలీస్ అధికారులు జీవో ని అమలు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు కోరినారు.
నాయీబ్రాహ్మణులను కించపరిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఇరు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలో ప్రజా పోరాటానికి సంసిద్ధం కావాలని, జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసులు నమోదు చేసి న్యాయస్థానాలను ఆశ్రయించాలని, నాయీబ్రాహ్మణులపై జరుగు అన్యాయాలపై ఉన్న చట్టాలను అమలు చేయుట కొరకు ఒక ప్రతినిధి వర్గం నేషనల్ బీసీ కమిషన్ న్యూఢిల్లీ వారిని కలిసి విజ్ఞాపన చేయుటకు సమావేశం ఏకగ్రీవ తీర్మానించడం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య, తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్, నాయీబ్రాహ్మణ నంద యువజన రాష్ట్ర అధ్యక్షులు ఇంటూరి బాబ్జి నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు, నవ సమాజ్అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరావు కార్యదర్శి సుందరపల్లి గోపాలకృష్ణ, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ద్రాక్షారపు సూరిబాబు, నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పివి రమణయ్య, డైరెక్టర్స్ మల్కాపురం కనకారావు ఎం శ్రీనివాసులు, ఉప్పుమావులూరి నాగలక్ష్మి కాపవరపు శ్రీదేవి, ధనవంతుని నాయీ బ్రాహ్మణ ఆర్ఎంపి వైద్యుల సంఘం, పిల్లుట్ల ఆనందు తెలంగాణ నవసమాజ్ అధ్యక్షులు ఏ చంద్రశేఖర్ అనేకమంది ప్రముఖులు పాల్గొని ప్రసంగించిన వారిలో ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News