rajaka delhi news
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
తక్షణమే కేంద్రం ఆర్డినెన్స్ ను జారీ చేసి ఎస్సీలో చేర్చాలి
ఎస్సి రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ఢిల్లీలో 17-12-2023 ఆదివారం జంతర్ మంతర్ ప్రాంగణంలో నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ మరియు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నాయకులు ప్లకార్డ్స్ తో నిరసన ప్రదర్శన తెలిపారు..ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. బస్వరాజు మాట్లాడుతూ దేశంలో 17 రాష్ట్రాలలో రజకులు ఎస్సి హోదా అనుభవిస్తూ ఆర్ధిక,సామాజిక,రాజకీయ రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నారు అని అన్నారు..తెలంగాణ రాష్ట్రాలలో రజకులు బిసి కేటగిరీలో ఉండటం వలన ఎంతో నష్ట పోతున్నారన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో రజకులపై కుల దాడులు జరుగుతున్నాయని,స్వతత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికి రజకుల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు..ఎస్సి రిజర్వేషన్ అమలు ఒక్కటే రజక జాతి అభ్యున్నతకి దోహదపడుతుందని ఆయన అన్నారు..తెలంగాణ ప్రభుత్వం ఎస్సి రిజర్వేషన్ అమలుపై శాసనసభలో చట్టం చేసి కేంద్రానికి పంపించని యెడల రాష్ట్ర వ్యాప్తంగా రజకుల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు..ఈ కార్యక్రమంలో నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడిపుంజుల చంద్రయ్య,రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంపల్లి జంగయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు బండిరాల సుశీల, సంగారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సిహెచ్. యాదయ్య తదితరులు పాల్గొన్నారు…