ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ కె .రాజు కుమార్
పార్టీలు, కులాలు పక్కన పెట్టండి
కనపర్తిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు బాల వికాస్ చొరవ
తెలుగు గళం న్యూస్ ఐనవోలు/మే8
హనుమకొండ జిల్లా:ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామంలో బాల వికాస్ ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణంపై 30 మంది ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఆదర్శ గ్రామ నిర్మాణ పథకం ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ కె .రాజు కుమార్ మాట్లాడుతూ…
“బాల వికాస్ గత 40 సంవత్సరాలుగా తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో పలు గ్రామాభివృద్ధి పథకాలను కొనసాగిస్తూ లక్షలాది మందికి లబ్ధి చేకూరుస్తోంది.గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఒక్కరితో సాధ్యం కాదు. గ్రామ పౌరులందరూ ఒకే ఆశయం కోసం పనిచేస్తే మార్పు సాధ్యం. స్థిరమైన మార్పు కోసం నాయకులంతా ఐకమత్యంతో పార్టీలు,కుల మత వర్గాలకు అతీతంగా కలిసి పనిచేయాలి. ‘గ్రామం మనది బాధ్యత మనదే’అనే స్ఫూర్తితో ప్రజలలో చైతన్యం పెంచాల్సిన అవసరం ఉంది”అని తెలిపారు.గ్రామ సర్పంచ్ రిషిక ఎల్లస్వామి మాట్లాడుతూ…*
“సంస్థ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి వీధి నుండి ప్రజలు ఈ పథకంలో భాగస్వాములు అయ్యేలా చూస్తాం.గ్రామ పంచాయతీ నుండి పూర్తి సహకారం అందిస్తాం.గ్రామ సభకు ప్రతి కుటుంబం నుండి కనీసం ఒక్కరు హాజరయ్యేలా ప్రయత్నిస్తాం. సంస్థ ద్వారా నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసి మార్పు దిశగా అడుగులు వేస్తాం” అని హామీ ఇచ్చారు.ఉప సర్పంచ్ నోముల కుమారస్వామి మాట్లాడుతూ…
“సంస్థ మా గ్రామానికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. అందరం కలిసి ఊరి కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం”అని తెలిపారు.ఈ సమావేశంలో వార్డు సభ్యులు,గ్రామంలోని 15 మంది ముఖ్య నాయకులు, పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, బాల వికాస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.