గృహలక్ష్మి పథకం క్రింద పది లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలి
జులై 3న కలెక్టరేట్ ముట్టడి
సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్
అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఖాజీపేట తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది పేదలకు పట్టాలు ఇవ్వాలని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంచాలని ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ధర్నా సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ధర్నా అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచిన పేదలకు ఇండ్ల స్థలాలను ఇండ్లను కట్టించడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు 2022 నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నిరుపేద లందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ఒక్కరికి హనుమకొండ జిల్లాలో ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు ఇవ్వడంలో వైఫల్యం చెందారని దుయ్యబట్టారు పేదల ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పది లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు తక్షణమే ఇవ్వాలని రాగుల రమేష్ డిమాండ్ చేశారు గృహలక్ష్మి పథకం కింద పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇంట్లో ఇండ్ల స్థానాల కోసం జూలై మూడో తేదీన జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా నాయకులు తొట్టె మల్లేశం మాట్లాడుతూ 58 జీవో ప్రకారము పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసముంటున్న పేదల పట్ల నిర్బంధాన్ని ఆపాలని అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, క్షౌరవృత్తిదారుల జిల్లా కార్యదర్శి జంపాల రమేష్, చిలుక జంపన్న, చిట్యాల విజయ్ కుమార్, శ్వేతా, కరుణాకర్, చామంతి తదితరులు పాల్గొన్నారు.