
తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా ఎలాంటి అవంచనీయ ఘటనాలు జరగకుండా,ముందస్తుగా మరిపెడ మండల బిజెపి నాయకులు భూక్యా గోపి కృష్ణ,భూక్యా శ్రీనివాస్ నాయక్ ను,గ్రామపంచాయతీ,వర్కర్ల యూనియన్ అధ్యక్షులు జానీ మియా,వీఆర్ఏల మండల అధ్యక్షులు హుస్సేన్ ను ఎస్సై సంతోష్ అరెస్టు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బాధలను చెప్పుకునే,పరిస్థితి కూడా లేదన్నారు.ప్రతిపక్ష నాయకులను యూనియన్ లీడర్లను,అరెస్టు చేయడంలో ఉన్న శ్రద్ధ,ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదన్నారు.