
హన్మకొండ, ప్రభుత్వం మొండి వైఖరి విడీ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, సౌత్ మండల కార్యదర్శి నోముల కిషోర్ అన్నారు. శుక్రవారం
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై, రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1600/800 మీటర్లు రన్నింగ్ క్వాలిఫై అయిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల కు మెయిన్స్ పరీక్షకు అనుమతించాలని, హైకోర్టు ఉత్తర్వులను అనుసరించాలన్నారు. అలాగే మల్టిపుల్ ప్రశ్నలకు ఏడు మార్కులు కలపాలి. ప్రిలిమ్స్ పరీక్షలో తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తప్పుడు నిర్ణయాల మూలంగా మోసపోతున్న వేలాదిమంది నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారన్నారు. డిజిటల్ విధానంలో కాకుండా, పాత పద్ధతిలోనే మన్యువెల్ గా ఎత్తు కొలవలన్నారు.
అలాగే సివిల్, ఫైర్ మెన్, కమ్యూనికేషన్ విభాగల్లో బెస్ట్ ఆఫ్ టూ ఈవెంట్స్ అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఉండ్రాతి మురళి,వెలుదండి భాను, గౌతమ్, నగరబోయిన మధు, సకినాల మణికంఠ, శ్రీకాంత్ రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.