ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం పాంనూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికయిన సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు సభ్యులను ప్రమాణ స్వీకారం గ్రామ కార్యదర్శి సునీల్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది.సర్పంచ్ పోలెపల్లి సంపత్ రెడ్డి,ఉప సర్పంచ్,వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు,నూతనంగా ఎన్నికైన సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులను శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పోలెపల్లి సంపత్ రెడ్డి మాట్లాడుతూ..గ్రామంలో ఎలక్షన్ల ముందు ఇంటింటి ప్రచారంలో ప్రజలు గ్రామంలోని పలు సమస్యల గురించి చెప్పారు.మీ అందరి సహకారంతో ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుందామని అన్నారు.మన గ్రామాన్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.