ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు..?
చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు”
ద్విపాత్రాభినయంలో ఏజెంట్లు”
ఎవరిచ్చారో తెలుసా ఏజెంట్లకు అనుమతి..?
అనధికార వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మోటారు వాహనాల శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో సైలెంట్‌గా అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనధికార వ్యక్తులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ, తామే అధికారిక ఏజెంట్లమని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నట్లు ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.అసలు ఏజెంట్లకు అనుమతి ఎవరిచ్చారో అనే విషయాన్ని రేపటి సంచికలో చూద్దాం.అధికారాలు ఉన్నాయా అని ప్రశ్నించిన జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలతో కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారని సమాచారం. మరోవైపు లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ వంటి పనులు ప్రజలు కార్యాలయానికి రాకుండానే పూర్తి చేస్తామని చెప్పి, ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నట్లు,ఏజెంట్లు వాహన యజమానులు లాగ సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిఘా ఏర్పాటు చేసి, మోటారు వాహనాల చట్టాన్ని కాపాడుతూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.