బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే
అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ఎమ్మెల్యే నాగరాజు
•విద్య ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చని విద్యార్థులకు పిలుపునిచ్చారు అణగారిన వర్గాలకు ఆశాకిరణం, సామాజిక పోరాటాలకు మార్గదర్శకం, సమానత్వం కోసం నిరంతరం పాటుపడిన మహానాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా నేడు ఎల్బీ స్టేడియం సమీపంలో గల ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ,అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ శ్రీ మల్లు రవి, సహచర ఎమ్మెల్యేలు మందుల సామెల్, కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కే.ఆర్. నాగరాజు పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు..అనంతరం ఏర్పాటు చేసిన 118వ జయంతి ఉత్సవాలలో పాల్గొని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ అణగారిన
వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని తెలిపారు. సమానత్వ సమాజ నిర్మాణం కోసం ఆయన చేసిన పోరాటం భారత దేశ రాజకీయ, సామాజిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో పనిచేశారని, ఆయన చూపిన మార్గంలో నడవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చేసిన సేవలు నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. అలాగే సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, యువత ముఖ్యంగా ఆయన జీవితం నుంచి ప్రేరణ పొందాలని ఎమ్మెల్యే నాగరాజు పిలుపునిచ్చారు….
భారతదేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని, చదువు మన తలరాతను మారుస్తుందని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం, మాజీ హనుమంతరావు తో సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు